సూర్యోదయం

సూర్యోదయం అనగా సూర్యుడు క్షితిజ రేఖ నుండి పైకి ఎగుస్తూ కనిపించే క్షణం.[1] ఈ పదం సూర్యుని క్షితిజ రేఖను దాటే ప్రక్రియను, దానితో పాటు వాతావరణ ప్రభావాలను కూడా సూచిస్తుంది.[2]

బంగాళాఖాతం వద్ద సూర్యోదయం, విశాఖపట్నం
ఫిబ్రవరి 2021లో నార్వేలోని గ్జోవిక్‌లో సంధ్య, సూర్యోదయం టైమ్‌లాప్స్ వీడియో

సూర్యుడు క్షితిజం నుండి ఉదయించినట్లు కనిపించినప్పటికీ, వాస్తవానికి భూమి తన చుట్టూ తాను తిరిగే భూభ్రమణం దానికి కారణమవుతుంది. భూమిపై నివసించేవారికి సూర్యుడు కదులుతున్నాడనే భ్రమ కలుగుతుంది; ఈ కారణంగా చాలా సంస్కృతులు భూకేంద్రక సిద్ధాంతాన్ని నిర్మించాయి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నికోలాస్ కోపర్నికస్ 7 వ శతాబ్దంలో తన సూర్యకేంద్ర నమూనాను రూపొందించే వరకు ఇవి ఉన్నాయి.[3]

  • సూర్యుడు ప్రతిరోజు తూర్పు వైపున ఉదయిస్తాడు. దీనినే సూర్యోదయం అంటారు.
  • సూర్యుడు ప్రతిరోజు పడమర వైపున అస్తమిస్తాడు దీనినే సూర్యాస్తమయం అంటారు.

రంగులు

సూర్యోదయ సమయం లో సూర్యుడికి దగ్గరగా ఉన్న ఆకాశం నీలం రంగులో ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న ఆకాశం ఎరుపు రంగులో ఉంటుంది. సూర్యోదయం రంగుల కంటే సూర్యాస్తమయ రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, ఎందుకంటే సాయంత్రం గాలిలో ఉదయం గాలి కంటే ఎక్కువ రేణువులు ఉంటాయి.[4]

ఇవి కూడా చూడండి

మూలాలు