ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

భారతదేశంలో అతి చౌకగా విమాన సేవలు అందించే విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ. భారత్ లోని కేరళరాష్ట్రం కేంద్రంగా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. మధ్య తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలో వారానికి 100 విమాన సర్వీసులను ఈ సంస్థ నడిపిస్తోంది. ఏయిర్ ఇండియా చార్టర్ట్ లిమిటెడ్ కుచెందిన సొంత విమాన సంస్థ ఇది. ఏయిర్ ఇండియా అందిస్తోన్న సేవలు విస్తరిస్తూనే ఉన్నాయి.

ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్
IATA
IX
ICAO
AXB
కాల్ సైన్
EXPRESS INDIA
స్థాపనMay 2004
మొదలు29 April 2005
Focus cities
  • Chennai International Airport
  • Chhatrapati Shivaji International Airport (Mumbai)
  • Mangalore International Airport
  • Tiruchirapalli International Airport
  • Dubai International Airport
AllianceStar Alliance (affillate)
Fleet size20
Destinations30
Parent companyAir India Limited
కంపెనీ నినాదం"Simply Priceless"
ముఖ్య స్థావరంMumbai
ప్రముఖులుRohit Nandan, CMD
Website: www.airindiaexpress.in

టూకీగా

ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు ఎక్కువగా భారత్ లోని కేరళ రాష్ట్రం నుంచి నడుస్తున్నాయి. మధ్య తూర్పు, ఆగ్నేయాసియాలో వారానికి 100 విమాన సర్వీసులను నడిపిస్తోంది. ఏప్రిల్ 29, 2005 నాడు ఏయిర్ లైన్స్ సేవలు కేరళలోని తిరువనంతపురం నుంచి అబుదాబీకి ప్రారంభమయయ్యాయి. మొదట బోయింగ్ 737-86Q విమానాన్ని ఈ సంస్థ ఫిబ్రవరి 22, 2005 నాడు బొలోవియన్ విమానయాన సర్వీసుల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 2014 లెక్కల ప్రకారం ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థకు సగటున 6.3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 20 విమానాలున్నాయి. డబ్బులు తగినంతగా సేవలు అందిస్తోన్న సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ఏయిర్ఇండియా ఎక్స్ ప్రెస్ గుర్తింపు సాధించింది. ముఖ్యంగా విమాన సర్వీసులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు, మంచి భోజనం, ఇతర వసతులు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. అంతర్జాతీయంగా విమాన సర్వీసులను నడిపిస్తోన్న ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ దేశంలోని ఏ ప్రదేశానికైనా గరిష్ఠంగా నాలుగు గంటల్లో చేరుకుంటుంది.ఈ విమానంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా క్యూలైన్లలోనిల్చొనే బాధ లేకుండా వెబ్ చెకింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది.

ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రధాన కేంద్రం కేరళలోని కోచిలో ఉంది.[1] కోచి కి ప్రధాన కార్యాలయాన్ని తరలించడానికి డిసెంబరు 2012లో ఏయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డు చేసిన ప్రతిపాదనలను 2013 జనవరిలో పంపించింది.[2] దీనిని దశలవారిగా తరలించాలని అప్పటి కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె.సి వేణుగోపాల్ అన్నారు. ఇందులో భాగంగా జనవరి 1న కోచిలో కార్యాలయాన్ని ప్రారంభించారు.[3]

గమ్య స్థానాలు

ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ వారానికి 100 విమానాలు నడిపిస్తుండగా, ముఖ్యంగా భారత దేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో దీని సేవలు కొనసాగుతున్నాయి. భారత దేశంలోని 12 పట్టణాలకు ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. తిరుచునాపల్లి, కోచి, పూణె, ముంబయి, అమృత్ సర్, లక్నో, చెన్నై, మంగుళూరు, కోజీకోడ్, తిరువనంతపురం, కోలకాతా, జైపూర్ నగరాలకు వెళ్లడానికి ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఆధ్వర్యంలో 13 అంతర్జాతీయ కేంద్రాలకు విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. కొలంబో, సింగపూర్, కౌలాలంపూర్, బహరైన్, కువైట్, ఢాకా, దుబాయ్, అబుదాబీ, షార్జా, దోహా, సలహ్, అల ఐనా, మస్కట్ లకు విమానాలను నడిపిస్తోంది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.[4]

విమాన సర్వీసులు

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ ఆధ్వర్యంలో బోయింగ్ 737-800 విమాన సర్వీసును నడిపిస్తోంది. తన వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించడంలో ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు అధిక ప్రాధాన్యతనిస్తోంది. సాధారణ ప్రయాణికులకు అందుబాటు ధరలో విమాన టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ప్రమాదాలు, సంఘటనలు

మే 22, 2010 నాడు దుబాయి-మంగళూరు మార్గంలో ఎగిరే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం-812, బోయింగ్ 737-800(రిజిస్టర్డ్ VT-AXV) విమానం మంగళూరు రన్ వే జారీ పోవడంతో ప్రమాదం జరిగి 152 మంది ప్రయాణికులు, 6గురు విమాన సిబ్బంది సహా 166 మంది దుర్మరణం పాలయ్యారు.[5]

అదేవిధంగా 25 మే, 2010 నాడు ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన బోయింగ్ 737-800 దూబాయి నుంచి పూణెకు తిరిగి వస్తుండగా 7000 అడుగుల ఎత్తులో పట్టు తప్పింది. విమాన పైలట్ మూత్రశాలకు వెళ్లిన సమయంలో విమానాన్ని నడిపిస్తోన్న సహాయ పైలట్ తన సీటును సర్దుబాటు చేసుకునే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో కాక్ పిట్ బయట ఉన్న పైలట్ తొందరగా లోపలకి వచ్చి విమానాన్ని ప్రమాదానికి గురికాకుండా కాపాడగలిగాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులున్నారు. వీరందరినీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని హెచ్చరించిన పైలట్, ఆ తర్వాత విమానాన్ని అదుపులోకి తెచ్చి ఘోర ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు.[6][7]

మూలాలు

బయటి లంకెలు