ఓటు

ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ఇస్తుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడును. డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి.

ఓటు ప్రజాస్వామ్యానికి పునాది.

ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసిన అభ్యర్థులను "ఓటర్లు" అని పిలుస్తారు. ఓట్లు సేకరణ కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి.

ఓటింగ్ పద్ధతులు

బ్యాలెట్ ఓటింగ్

ఒక ప్రజాస్వామ్యంలో ఓటు చేయడం ద్వారా ప్రభుత్వం ఎంపిక చేయబడుతుంది. ఎన్నుకునే విధానంలో పలువురు అభ్యర్థుల్లో ఎంపిక చేసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, ఓటింగ్ పద్ధతి ప్రకారం ఓటర్లు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎంపిక విధానం ఎన్నికల సంఘం గోప్యతా ఉంచుతుంది ఒక రహస్య బ్యాలెట్ ఉపయోగిస్తారు. ఓటర్లు తమ రాజకీయ గోప్యతను కాపాడటానికి ఈ బ్యాలెట్ ఉపయోగ పడుతుంది.

మెషిన్ ఓటింగ్

ఓటింగ్ యంత్రం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యంత్రాలను ఉపయోగిస్తుంది

ఆన్లైన్ ఓటింగ్

కొన్ని దేశాల్లో ప్రజలు ఆన్లైన్ ఓటు అనుమతి. ఆన్లైన్ ఓటింగ్ను ఉపయోగించిన మొట్టమొదటి దేశాలలో ఎస్టోనియా ఒకటి: ఇది 2005 స్థానిక ఎన్నికలలో మొదట ఉపయోగించబడింది.

పోస్టల్ ఓటింగ్

అనేక దేశాలు పోస్టల్ ఓటింగ్ ను అనుమతిస్తాయి, ఇక్కడ ఓటర్లు బ్యాలెట్ ను పంపించి పోస్ట్ ద్వారా దానిని తిరిగి పొందుతారు.

భారతదేశంలో పోస్టల్ ఓటింగ్ అనేది భారత ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ (ETPB) వ్యవస్థ ద్వారా చేపడుతుంది. ఈ విధానంలో నమోదు చేయబడిన అర్హులైన ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయబడతాయి. వారు పోస్ట్ ద్వారా ఓట్లను తిరిగి పంపుతారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు, ఈ పోస్టల్ ఓట్లను ఇతర ఓటర్లందరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల నుండి ఓట్ల లెక్కింపుకు ముందుగా లెక్కించబడుతుంది. కొన్ని కేటగిరీల వ్యక్తులు మాత్రమే పోస్టల్ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. యూనియన్ సాయుధ దళాలు, రాష్ట్ర పోలీసులతో పాటు వారి భార్యలు, అధికారికంగా విదేశాలలో పోస్ట్ చేయబడిన భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, మీడియా వ్యక్తులు మొదలైన వారు పోస్టల్ ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు, వీరిని సేవా ఓటర్లు అని కూడా పిలుస్తారు. అదనంగా, వికలాంగులు, 65 ఏళ్లు పైబడిన వారు పోస్టల్ ఓటును ఉపయోగించవచ్చు. ఖైదీలు అస్సలు ఓటు వేయలేరు.[1][2][3][4]

ఓట్ ఫ్రం హోం

2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల నుంచి కొత్తగా ఓట్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేసారు. ఈ విధానంలో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించారు. అయితే, ముందస్తుగా సదరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.[5] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలోను ఈ తరహాలో 28వేల 57 మంది తమ ఓటు హక్కును బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకున్నారు [6]

నోటా ఓటింగ్

నోటా నన్‌ ఆఫ్‌ ది ఎబో అభ్యర్థులు నచ్చని వారు ఓటర్లు ప్రయోగించే అస్త్రం నోటా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈవీఎం మెషిన్లలో అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు నోటాను కూడా ఏర్పాటుచేసింది. ఓటరు ఈ బటన్‌ నొక్కితే ఓటు హక్కును వినియోగించుకున్నట్లే. 2014 ఎన్నికల నుంచి నోటాను అందుబాటులోకి తేసుకోచ్చారు.

టెండర్ ఓటు / ఛాలెంజ్ ఓటు

దొంగ ఓట్ల వల్ల లేక ఇతర కారణాలతో మన ఓటుహక్కు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి దాన్ని పొందేందుకు హక్కును భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్‌ 49(పి) అవకాశం కల్పిస్తోంది.[7] దీని ద్వారా ఓటు పొందాలనుకునేవారు ముందుగా ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి తానే అని ఆయన ముందు నిరూపించుకోవాలి. దీనికోసం ఓటర్ గుర్తింపు కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాల్సిఉంటుంది. అలాగే ఎన్నారైలు అయితే పాస్‌పోర్టు చూపించాలి. ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బీ) పూర్తిచేసి టెండర్ బ్యాలెట్ పేపర్‌ను పొందాలి. ప్రత్యేక కవరులో ఈ ఓటును భద్రపరిచి కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(పీ) ద్వారా పొందే ఓటు హక్కును టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు అంటారు.

ప్రాక్సీ ఓటు

ప్రాక్సీ ఓటు అనేది తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయడం. పోలీసు, రక్షణ శాఖల్లోని ఇంటెలిజెన్స్‌, గూఢచారి సిబ్బంది తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. 2003లో, తమ తరపున ఓటు వేయడానికి ప్రాక్సీని నియమించుకునేందుకు వీలుగా భారతదేశ ప్రజాప్రతినిధి చట్టం సవరించబడింది.[8]

ఓటుహక్కు గుర్తింపు పత్రాలు

  1. ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు,
  2. భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్‌ పోర్టు,
  3. డ్రైవింగ్‌ లైసెన్స్‌,
  4. పాన్‌ కార్డు,
  5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
  6. బ్యాంకు, కిసాన్‌, పోస్టాఫీస్‌ పాసుబుక్కులు,
  7. విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
  8. పట్టాదారు పాసు పుస్తకాలు,
  9. రిజిస్టర్డ్‌ డీడ్‌ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
  10. రేషన్‌ కార్డు,
  11. ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
  12. పెన్షన్‌ మంజూరు పత్రాలు,
  13. రైల్వే గుర్తింపు కార్డు,
  14. స్వాతంత్రం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
  15. ఆయుధ లైసెన్స్‌లు,
  16. వికలాంగుల పత్రాలు.

ప్రవాస భారతీయులకు (ఎన్నారైలకు) ఓటు హక్కు

ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల మందికి పైగా ఎన్నారైలు ఉన్నట్లు అంచనా.ఎన్నారైలకు ఓటు హక్కు కల్పిస్తూ త్వరలోనే ఒక చట్టం తెస్తారు. ఎన్నికల సమయంలో వారు భారత్‌ను సందర్శించాల్సి ఉంటుంది.ఇతర దేశాల పౌరసత్వం పొందిన వారికి మాత్రం ఓటు హక్కు కల్పించరు.

ఇవీ చదవండి

మూలాలు

వెలుపలి లంకెలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=ఓటు&oldid=4041632" నుండి వెలికితీశారు