గాబ్రియేల్ బోరిక్

గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ (జ.1986 ఫిబ్రవరి 11), [1] చిలీ దేశానికి చెందిన లిబర్టేరియన్ సోషలిస్టు నాయకుడు[2], రాజకీయ నాయకుడు. అతను 2021 లో జరిగిన చిలీ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి అధ్యక్షునిగా ఉన్నాడు. అతను దేశ చరిత్రలో అత్యధిక ఓట్లను సాధించిన అభ్యర్థిగా గుర్తింపు పొందాడు. తద్వారా తన ప్రత్యర్థి అయిన జోస్ ఆంటోనియో కాస్ట్‌ను ఓడించాడు.[3][4]

అతను చిలీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించాడు. 2012 లో అతను యూనివర్శిటీ ఆఫ్ చిలీ స్టూడెంట్ ఫెడరేషన్ కు అధ్యక్షునిగా ఉన్నాడు.[5][6] మాంగలేన్స్, అంటార్కిటిక్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ కు రెండు సార్లు ఎన్నికయ్యాడు.

మూలాలు