గ్రాము

గ్రాము (ఇతర ఉచ్ఛారణ: గ్రామ్మ్[1]‌ ;ఎస్.ఐ.ప్రమాణ గుర్తు: g) అనేది మెట్రిక్ ప్రమాణాల వ్యవస్థలో ద్రవ్యరాశికి ప్రమాణం.

గ్రాము
ఈ కలము ద్రవ్యరాశి సుమారు 1 గ్రాము
ప్రమాణం యొక్క సమాచారం
ప్రమాణ వ్యవస్థసి.జి.ఎస్. ప్రమాణం
ఏ బౌతికరాశికి ప్రమాణంద్రవ్యరాశి
గుర్తుg 
ప్రమాణాల మధ్య సంబంధాలు
1 g in ...... is equal to ...
   ఎస్.ఐ.ప్రమాణాలు   10−3 కిలోగ్రాములు
   సి.జి.ఎస్.ప్రమాణాలు   1 గ్రాము
   ఇంపీరియల్ ప్రమాణాలు
యు.ఎస్.కస్టమరీ ప్రమాణాలు
   0.0353 ఔన్సులు

వాస్తవంగా " మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు1 ఘనపు సెంటీమీటరు ఘనపరిమాణంలో గల శుద్ధ జలం బరువు 1 గ్రాముకు సమానం;[2] ప్రస్తుతం గ్రాము అనేది ఎస్.ఐ ప్రమాణాల వ్యవస్థలో ఒక కిలోగ్రాము ద్రవ్యరాశిలో 1000 వ వంతు ద్రవ్యరాశి. ఈ ప్రమాణాన్ని ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ బెయిట్స్ అండ్ మెజర్స్ సంస్థ నిర్థారించింది. ఈ సంస్థ కిలోగ్రాము ద్రవ్యరాశిని గ్రాములలో నిర్థారించలేదు. కానీ ప్లాంక్ స్థిరాంక సంఖ్యాత్మక విలువ 6.62607015×10−34 kg⋅m2⋅s−1.[3][4] ఆధారంగా నిర్థారించింది.

అధికారిక ఎస్.ఐ. సంజ్ఞ

అతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ (ఇంటర్నేషనల్ సిస్టం ఆఫ్ యూనిట్స్) గ్రాము గుర్తును "g" గా గుర్తించింది. అంతరాళంలో ఈ విలువను "640 g" గా, సంప్రదాయకంగా ఆంగ్ల భాషలో "640 grams" గా సూచిస్తారు. ఎస్.ఐ ప్రమాణాల వ్యవస్థ గ్రాము గుర్తును ""gr" (గ్రెయిన్ కు గుర్తు)[5]: C-19 , "gm" (ఇది గ్రామ్-మీటరుకు గుర్తు), లేదా "Gm" (ఎస్.ఐ పద్ధతిలో గిగామీటరుకు గుర్తు) లను అంగీకరించదు

చరిత్ర

గ్రామ్మ్‌ (gramme) అనే ప్రమాణం ను ఫ్రెంచ్ నేషనల్ కన్వెన్షన్ 1795 డిక్రీ ఆధారంగా తీసుకుంది. దీనిని మెట్రిక్ వ్యవస్థలో 1793లో గ్రావెట్ పరిచయం చేసాడు. వారు ఒక ఘనపు సెంటీమీటరు నీటి బరువును ఒక గ్రాముగా నిర్వచించారు[6][7].

ఫ్రెంచ్ పదమైన గ్రామ్మ్‌ ను లాటిన్ పదం "గ్రామ్మా" నుంటి తీసుకున్నారు. తరువాత ఈ పదం గ్రీకు పదమైన γράμμα (grámma) నుండి తీసుకున్నారు. దీనిని "ఒక ఔన్సు ద్రవ్యరాశిలో 24వ వంతు" గా తీసుకున్నారు. [8] ఇది నవీన వ్యవస్థలో సుమారు 1.14 గ్రాములకు సమానం.

ఈ పదం 400 AD లో కూర్చబడిన "కార్మెన్ డి పొండెరిబస్ ఎట్ మెన్సురిస్" (బరువులు, కొలతలకు సంబంధించిన పద్యం) లో కూడా ప్రస్థావించబడినది.[a] అదే కాలంలో గ్రీకు γράμμα (grámma) కూడా అదే అర్థంతో ఉపయోగించబడినట్లు సాక్ష్యాలున్నాయి.

19వ శతాబ్దంలో సి.జి.ఎస్. ప్రమాణాలు (సెంటీమీటరు - గ్రాము - సెకను) వ్యవస్థలో మూల ప్రమాణంగా నిర్థారించారు. ఈ సి.జి.ఎస్. వ్యవస్థ 1901లో ప్రతిపాదించబడిన ఎం.కె.ఎస్ వ్యవస్థతో సహసంబంధం కలిగి ఉంది. 20 వశతాబ్దంలో గ్రాము స్థానంలో కిలోగ్రామును ద్రవ్యరాశికి మూల ప్రమాణంగా తీసుకున్నారు. దీనిని 1960 లో ఎస్.ఐ. ప్రమాణాల వ్యవస్థ వచ్చిన తరువాత జరిగింది.

ఉపయోగాలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గ్రాము ను వంటలు, షాపింగ్ లో ద్రవాలు కాని పదార్థాల ద్రవ్యరాశిని కొలిచే ప్రమాణంగా ఉపయోగిస్తున్నారు. [10][11]

చట్టబద్ద అవసరాలకు ఆహార ఉత్పత్తులపై పోషకాహార లేబుళ్ళకు చాలా ప్రమాణాలు 100 గ్రాములకి సాపేక్ష విషయాలను పేర్కొనడం అవసరం, ఫలితంగా వచ్చే సంఖ్యను బరువు ద్వారా శాతంగా చదవవచ్చు.

ఇతర ప్రమాణాలలోకి మార్పులు

  • 1 గ్రాము (g) = 15.4323583529 గ్రెయిన్ (gr)
  • 1 గ్రెయిన్ (gr) = 0.06479891గ్రాములు (g)
  • 1 అవాయిదుపోయిస్ ఔన్సు (oz) = 28.349523125 గ్రాములు (g)
  • 1ట్రాయ్ ఔన్సు (ozt) = 31.1034768 గ్రాములు (g)
  • 100 గ్రాములు (g) = 3.527396195 ఔన్సులు
  • 1 గ్రాము (g) = 5 కారట్లు (ct)
  • 1 గ్రాము (g) = 8.98755179×1013జౌళ్ళు (J) ( ద్రవ్యరాశి-శక్తి సమతుల్యం ప్రకారం)
  • 1 అన్‌డేసిమోగ్రామ్మ్‌ = 1/11 గ్రాములు = 10−11 గ్రాములు. [12]
  • 500 గ్రాములు (g) = 1 జెన్ (చైనా ప్రమాణాల వ్యవస్థ ప్రకారం) .

నోట్సు

మూలాలు

బాహ్య లంకెలు