జాన్ హ్యూస్టన్

అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత, నటుడు.

జాన్ మార్సెల్లస్ హ్యూస్టన్ (1906, ఆగస్టు 5 – 1987, ఆగస్టు 28) అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత, నటుడు.[1] తను దర్శకత్వం వహించిన 37 సినిమాలలో చాలా సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశాడు. ఇతను దర్శకత్వం వహించిన ది మాల్టీస్ ఫాల్కన్ (1941), ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రే (1948), ది అస్ఫాల్ట్ జంగిల్ (1950), ది ఆఫ్రికన్ క్వీన్‌ (1951), ది మిస్‌ఫిట్స్ (1961), ఫ్యాట్ సిటీ (1972), ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్ (1975), ప్రిజీస్ ఆనర్ (1985) వంటి సినిమాలు నేడు క్లాసిక్‌లుగా పరిగణించబడుతున్నాయి. తన 46 సంవత్సరాల సినీ జీవితంలో 15 అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యి, రెండు అవార్డులను గెలుచుకున్నాడు. తన తండ్రి వాల్టర్ హ్యూస్టన్, కుమార్తె అంజెలికా హస్టన్ ఇద్దరికీ ఆస్కార్ అవార్డులను అందించాడు.

జాన్ హ్యూస్టన్
జాన్ హ్యూస్టన్ (1974)
జననం(1906-08-05)1906 ఆగస్టు 5
నెవాడా, మిస్సౌరీ, యుఎస్
మరణం1987 ఆగస్టు 28(1987-08-28) (వయసు 81)
రోడ్ ఐలాండ్‌, మిడిల్‌టౌన్, యుఎస్
సమాధి స్థలంహాలీవుడ్ ఫరెవర్ స్మశానవాటిక
వృత్తి
  • దర్శకుడు
  • స్క్రీన్‌ప్లే రచయిత
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు1930–1987
జీవిత భాగస్వామి
  • డోరతీ హార్వే
    (m. 1925; div. 1933)
  • లెస్లీ బ్లాక్
    (m. 1937; div. 1945)
  • ఎవెలిన్ కీస్
    (m. 1946; div. 1950)
  • ఎన్రికా సోమ
    (m. 1950; died 1969)
  • సెలెస్టే షేన్
    (m. 1972; div. 1977)
భాగస్వామిజో సల్లిస్
పిల్లలు5, అంజెలికా, టోనీ, డానీ, అల్లెగ్రా
తల్లిదండ్రులువాల్టర్ హ్యూస్టన్
రియా (నీ గోర్)

జననం

జాన్ హ్యూస్టన్ 1906, ఆగస్టు 5న రియా (నీ గోర్) - వాల్టర్ హ్యూస్టన్ దంపతులకు మిస్సౌరీలోని నెవాడాలో జన్మించాడు. ఇతని తండ్రి ఒక నటుడు, మొదట్లో వాడేవిల్లే, తరువాత ఇతర సినిమాలలో నటించారు. ఇతని తల్లి వివిధ ప్రచురణలకు స్పోర్ట్స్ ఎడిటర్‌గా పనిచేసింది.

కళారంగం

పారిస్‌లో ఫైన్ ఆర్ట్ పెయింటర్‌గా చదువుకున్నాడు, పనిచేశాడు. మెక్సికోకు వెళ్ళి అక్కడ నాటకాలు, చిన్న కథలు రాయడం ప్రారంభించాడు. తరువాత హాలీవుడ్ స్క్రీన్ రైటర్‌గా లాస్ ఏంజిల్స్‌లో పనిచేశాడు. విలియం డైటెర్లే, హోవార్డ్ హాక్స్ దర్శకత్వం వహించిన సినిమాలకు అనేక అకాడమీ అవార్డుల రచనకు నామినేట్ అయ్యాడు. ది మాల్టీస్ ఫాల్కన్‌ అనే సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇది తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ వాణిజ్యపరంగా, విమర్శనాత్మకంగా విజయవంతమైంది. ప్రతి సన్నివేశాన్ని ముందుగా కాగితంపై గీసేవాడు, ఆపై షూటింగ్ సమయంలో తన పాత్రలను జాగ్రత్తగా రూపొందించాడు. చాలామంది దర్శకులు పోస్ట్-ప్రొడక్షన్ ఎడిటింగ్‌పై ఆధారపడుతుండగా, ఇతను తన సినిమాలను తీస్తున్న సమయంలోనే జాగ్రత్త వహించేవాడు, అందుకే ఇతని సినిమాలకు తక్కువ ఎడిటింగ్ అవసరం ఉంటుంది.

ప్రారంభంలో కొన్ని నాటకాలలో నటించినప్పటికీ, అప్పుడప్పుడు తన స్వంత సినిమాలలో బిట్ పార్ట్‌లలో నటించాడు. 1963లో ఒట్టో ప్రీమింగర్ తీసిన ది కార్డినల్‌ సినిమాలో నటించే వరకు అతను కెమెరా వెనుక పనిచేశాడు. ఈ సినిమాకు ఇతడు ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. 1974లో చైనాటౌన్ (రోమన్ పోలన్స్కి దర్శకత్వం వహించాడు) సినిమాతోపాటు తరువాతి రెండు దశాబ్దాలు ప్రముఖ సహాయక పాత్రలను పోషించాడు. అనేక ప్రముఖ చిత్రాలకు వాయిస్ యాక్టర్, వ్యాఖ్యాతగా తన బారిటోన్ వాయిస్‌ని అందించాడు. ఇతడు చివరిదశలో ఉన్నప్పుడు 1985లో ప్రిజీస్ ఆనర్, 1987లో ది డెడ్ అనే సినిమాలు తీశాడు. ఇవి రెండూ బహుళ అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడ్డాయి. తన చివరి చిత్రం పూర్తిచేసిన కొద్దిసేపటి తరువాత మరణించాడు.

హాలీవుడ్ సినిమారంగంలో ఇతడిని "టైటాన్", "తిరుగుబాటుదారుడు", "పునరుజ్జీవనోద్యమ వ్యక్తి" అని పిలుస్తారు. వివిధ సమయాల్లో ఫ్రాన్స్, మెక్సికో, ఐర్లాండ్‌లో స్థిరపడ్డాడు. ఇతడు పుట్టుకతో యుఎస్ పౌరుడు, కానీ 1964లో ఐరిష్ పౌరుడిగా, నివాసిగా మారాడు. అతను తరువాత యుఎస్ కి తిరిగి వచ్చి, తన జీవితాంతం గడిపాడు.[2] అమెరికన్ సినిమారంగానికి చేసిన కృషికి 1960 ఫిబ్రవరిలో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్‌ని అందుకున్నాడు.

సినిమాలు

స్క్రీన్ రైటర్‌గా

సంవత్సరంపేరుదర్శకుడుఇతర వివరాలు
1930ది స్ట్రోమ్విలియం వైలర్చార్లెస్ లోగ్, లాంగ్డన్ మెక్‌కార్మిక్, టామ్ రీడ్ & వెల్స్ రూట్‌తో సహ రచయిత
1931ఎ హౌజ్ డివైడెడ్జాన్ బి. క్లైమర్, ఆలివ్ ఈడెన్స్ & డేల్ వాన్ ప్రతితో సహ రచయిత
1932మర్డర్స్ ఇన్ ది ర్యూ మార్చురీరాబర్ట్ ఫ్లోరీటామ్ రీడ్ & డేల్ వాన్ ప్రతితో సహ రచయిత
లా అండ్ ఆర్డర్ఎడ్వర్డ్ ఎల్. కాహ్న్టామ్ రీడ్ & రిచర్డ్ షాయర్‌తో సహ రచయిత
1935డెత్ డ్రైవ్స్ త్రూకేథరీన్ స్ట్రూబీ & గోర్డాన్ వెల్లెస్లీతో సహ రచయిత
ఇట్స్ హప్పెండ్ ఇన్ పారిస్‌రాబర్ట్ వైలర్కేథరీన్ స్ట్రూబీ & హెచ్ఎఫ్ మాల్ట్బీతో సహ రచయిత
1938ది అమేజింగ్ డాక్టర్. క్లిట్టర్‌హౌస్అనటోల్ లిట్వాక్జాన్ వెక్స్లీతో సహ రచయిత
జెజెబెల్విలియం వైలర్క్లెమెంట్స్ రిప్లే, అబెమ్ ఫింకెల్ & రాబర్ట్ బక్నర్‌తో సహ రచయిత
1939జుయారెజ్విలియం డైటెర్లేఈనియాస్ మెకెంజీ & వోల్ఫ్‌గ్యాంగ్ రీన్‌హార్డ్‌తో సహ రచయిత
1940డాక్టర్ ఎర్లిచ్స్ మ్యాజిక్ బుల్లెట్నార్మన్ బర్న్‌స్టైన్ & హీంజ్ హెరాల్డ్‌తో సహ రచయిత
1941హై సియర్రారౌల్ వాల్ష్బర్నెట్‌తో సహ రచయిత
సార్జెంట్ యార్క్హోవార్డ్ హాక్స్అబెమ్ ఫింకెల్, హ్యారీ చాండ్లర్ & హోవార్డ్ కోచ్‌లతో సహ రచయిత
1946ది కిల్లర్స్రాబర్ట్ సియోడ్మాక్
త్రీ స్ట్రేంజర్స్జీన్ నెగులేస్కోహోవార్డ్ కోచ్‌తో సహ రచయిత
స్ట్రేంజర్ఓర్సన్ వెల్లెస్[3]
1988మిస్టర్ నార్త్డానీ హ్యూస్టన్జానెట్ రోచ్ & జేమ్స్ కోస్టిగాన్‌తో సహ రచయిత

అవార్డులు, సన్మానాలు

ప్రధాన అసోసియేషన్ అవార్డులు

అకాడమీ అవార్డులు

సంవత్సరంసినిమావిభాగంఫలితం
1941డాక్టర్ ఎర్లిచ్స్ మ్యాజిక్ బుల్లెట్ఉత్తమ రచన, ఒరిజినల్ స్క్రీన్ ప్లేనామినేట్
1942మాల్టీస్ ఫాల్కన్ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లేనామినేట్
సార్జెంట్ యార్క్ఉత్తమ రచన, ఒరిజినల్ స్క్రీన్ ప్లేనామినేట్
1949ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రేఉత్తమ దర్శకుడువిజేత
ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లేవిజేత
1951ది అస్ఫల్ట్ జంగిల్ఉత్తమ దర్శకుడునామినేట్
ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లేనామినేట్
1952ఆఫ్రికన్ క్వీన్ఉత్తమ దర్శకుడునామినేట్
ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లేనామినేట్
1953మౌలిన్ రోగ్ఉత్తమ దర్శకుడునామినేట్
1958హెవెన్ నోస్, మిస్టర్ అల్లిసన్ఉత్తమ రచన, మరొక మీడియం నుండి మెటీరియల్ ఆధారంగా స్క్రీన్ ప్లేనామినేట్
1964ది కార్డినల్ఉత్తమ సహాయ నటుడునామినేట్
1976ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్ఉత్తమ రచన, ఇతర అంశాల నుండి స్వీకరించబడిన స్క్రీన్‌ప్లేనామినేట్
1986ప్రిజ్జీస్ హానర్ఉత్తమ దర్శకుడునామినేట్

గోల్డెన్ గ్లోబ్స్

సంవత్సరంసినిమావిభాగంఫలితం
1949ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రేఉత్తమ దర్శకుడువిజేత
1951ది అస్ఫల్ట్ జంగిల్నామినేట్
ఉత్తమ స్క్రీన్ ప్లేనామినేట్
1963ఫ్రాయిడ్ఉత్తమ దర్శకుడునామినేట్
1964ది కార్డినల్ఉత్తమ సహాయ నటుడువిజేత
1965ది నైట్ ఆఫ్ ది ఇగ్వానాఉత్తమ దర్శకుడునామినేట్
1975చైనాటౌన్ఉత్తమ సహాయ నటుడునామినేట్
1986ప్రిజ్జీస్ హానర్ఉత్తమ దర్శకుడువిజేత

బ్రిటీష్ సినిమా అవార్డులు

సంవత్సరంసినిమావిభాగంఫలితం
1975చైనాటౌన్ఉత్తమ సహాయ నటుడునామినేట్
1980బ్రిటీష్ సినిమా ఫెలోషిప్విజేత

ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డులు

సంవత్సరంసినిమావిభాగంఫలితం
1988ది డెడ్ఉత్తమ దర్శకుడువిజేత

విమర్శకుల అవార్డులు

సంవత్సరంఅసోసియేషన్సినిమావిభాగంఫలితం
1948న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రేఉత్తమ దర్శకుడువిజేత
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూఉత్తమ స్క్రీన్ ప్లేవిజేత
1950న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ది అస్ఫల్ట్ జంగిల్ఉత్తమ దర్శకుడునామినేట్
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూఉత్తమ దర్శకుడువిజేత
1952న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ఆఫ్రికన్ క్వీన్ఉత్తమ దర్శకుడునామినేట్
1956మోబి డిక్విజేత
ఉత్తమ స్క్రీన్ ప్లేనామినేట్
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూఉత్తమ దర్శకుడువిజేత
1974కాన్సాస్ సిటీ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్చైనాటౌన్ఉత్తమ సహాయ నటుడువిజేత
1979లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డువిజేత
1984నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూకెరీర్ అచీవ్‌మెంట్ అవార్డువిజేత
1985న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ప్రిజ్జీస్ హానర్ఉత్తమ దర్శకుడువిజేత
1986బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ఉత్తమ దర్శకుడువిజేత
నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ఉత్తమ దర్శకుడువిజేత
1987న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ది డెడ్ఉత్తమ దర్శకుడునామినేట్
1988నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ఉత్తమ దర్శకుడునామినేట్
1989ఫ్రెంచ్ సిండికేట్ ఆఫ్ సినిమా క్రిటిక్స్ఉత్తమ విదేశీ చిత్రంవిజేత
లండన్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్విజేత

ఫిల్మ్ ఫెస్టివల్స్

సంవత్సరంఫెస్టివల్స్సినిమావిభాగంఫలితం
1948వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రేగ్రాండ్ ఇంటర్నేషనల్ అవార్డునామినేట్
1950ది అస్ఫల్ట్ జంగిల్గోల్డెన్ లయన్నామినేట్
1953మౌలిన్ రోగ్నామినేట్
సిల్వర్ లయన్విజేత
1963బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ఫ్రాయిడ్గోల్డెన్ బేర్నామినేట్
1979చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్వైజ్ బ్లడ్గోల్డ్ హ్యూగోనామినేట్
శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్గోల్డెన్ షెల్నామినేట్
1981మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్విక్టరీగోల్డెన్ ప్రైజ్నామినేట్
1984కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్అండర్ ది వోల్కనోపామ్ డి'ఓర్నామినేట్
1985వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ప్రిజ్జీస్ హానర్గోల్డెన్ లయన్నామినేట్
గోల్డెన్ సియాక్విజేత
మొత్తం పని కోసం ప్రత్యేక సింహంవిజేత
1987టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ది డెడ్టోక్యో గ్రాండ్ ప్రిక్స్నామినేట్
ప్రత్యేక సాఫల్య పురస్కారంవిజేత

గిల్డ్ అవార్డులు

సంవత్సరంగిల్డ్సినిమావిభాగంఫలితం
1949రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రేఉత్తమ రచన అమెరికన్ డ్రామానామినేట్
ఉత్తమ పాశ్చాత్య రచనవిజేత
కీ లార్గోఉత్తమ రచన అమెరికన్ డ్రామానామినేట్
1951డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాది అస్ఫల్ట్ జంగిల్చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయంనామినేట్
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికారాబర్ట్ మెల్ట్జర్ అవార్డునామినేట్
ఉత్తమ రచన అమెరికన్ డ్రామానామినేట్
1953మౌలిన్ రోగ్ఉత్తమ రచనా నాటకంనామినేట్
1957డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికామోబి డిక్చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయంనామినేట్
1958హెవెన్ నోస్, మిస్టర్ అల్లిసన్నామినేట్
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాఉత్తమ రచనా నాటకంనామినేట్
1962డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాది మిస్‌ఫిట్స్చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయంనామినేట్
1963ఫ్రాయిడ్నామినేట్
1964రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాస్క్రీన్ రైటింగ్ అచీవ్‌మెంట్ కోసం లారెల్ అవార్డువిజేత
1965డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాది నైట్ ఆఫ్ ది ఇగ్వానాచలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయంనామినేట్
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాఉత్తమ రచనా నాటకంనామినేట్
1976ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్మరొక మాధ్యమం నుండి స్వీకరించబడిన ఉత్తమ నాటకంనామినేట్
1983డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - ఫీచర్ ఫిల్మ్విజేత
1986ప్రిజ్జీస్ హానర్చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయంనామినేట్

ఇతర అవార్డులు

సంవత్సరంఅసోసియేషన్సినిమావిభాగంఫలితం
1957ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ జర్నలిస్ట్స్మోబి డిక్ఉత్తమ విదేశీ చిత్రంవిజేత
1966అకాడెమియా డెల్ సినిమా ఇటాలియన్ది బైబిల్ఉత్తమ విదేశీ దర్శకుడువిజేత
1979రికార్డింగ్ అకాడమీది హాబిట్పిల్లల కోసం ఉత్తమ రికార్డింగ్నామినేట్
1981సొసైటీ ఆఫ్ కెమెరా ఆపరేటర్స్గవర్నర్స్ అవార్డువిజేత
1983గోల్డెన్ రాస్ప్బెర్రీ అవార్డు ఫౌండేషన్అన్నీవరస్ట్ దర్శకుడునామినేట్
అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్జీవిత సాఫల్య పురస్కారంవిజేత
1986ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ప్రిజ్జీస్ హానర్ఉత్తమ విదేశీ దర్శకుడునామినేట్
అకాడెమియా డెల్ సినిమా ఇటాలియన్ఉత్తమ విదేశీ దర్శకుడునామినేట్
1988కాహియర్స్ డు సినిమాది డెడ్వార్షిక టాప్ 10 జాబితాలు3వ స్థానం
అకాడెమియా డెల్ సినిమా ఇటాలియన్ఉత్తమ విదేశీ దర్శకుడునామినేట్
ఉత్తమ విదేశీ చిత్రంనామినేట్
1989బోడిల్ అవార్డులుది డెడ్ఉత్తమ నాన్-యూరోపియన్ చిత్రంగా బోడిల్ అవార్డువిజేత

మరణం

అధికంగా ధూమపానం చేయడం వల్ల 1978లో హ్యూస్టన్ కు ఎంఫిసెమా నిర్ధారణ అయింది. తన జీవితంలో చివరి సంవత్సరం నాటికి, ఇతడు ఆక్సిజన్ అవసరం లేకుండా ఇరవై నిమిషాల కంటే ఎక్కువ శ్వాస తీసుకోలేకపోయేవాడు.[4]

తన 81 సంవత్సరాల వయస్సులో ఊపిరితిత్తుల వ్యాధి న్యుమోనియాతో 1987, ఆగస్టు 28న మిడిల్‌టౌన్, రోడ్ ఐలాండ్‌లోని తన అద్దె ఇంటిలో మరణించాడు.[5][6] హాలీవుడ్‌లోని హాలీవుడ్ ఫరెవర్ స్మశానవాటికలో అంత్యక్రియలు చేయబడ్డాయి.

మూలాలు

బయటి లింకులు