పాఠ్యపుస్తకము

పాఠ్యపుస్తకము అనేది విషయం యొక్క అధ్యయనం కోసం ఉపయోగించే ఒక పుస్తకం.[1] ప్రజలు ఒక నిర్దిష్ట విషయం గురించి వాస్తవాలు, తెలుసుకోవడానికి పాఠ్యపుస్తకాన్ని ఉపయోగిస్తారు. పాఠ్యపుస్తకాలు కొన్నిసార్లు అభ్యాసకుని యొక్క జ్ఞానాన్ని, అవగాహనను పరీక్షీంచుటకు ప్రశ్నలు కలిగి ఉంటాయి. వర్క్‌బుక్ అనేది అభ్యాస ప్రశ్నలు, సాధనలు మాత్రమే కలిగియుండే పాఠ్యపుస్తకము యొక్క ఒక రకం. వర్క్‌బుక్స్ బోధించడానికి రూపొందించినవికావు కానీ అభ్యాసాన్ని, హైలైట్ ప్రాంతాలను అందిస్తాయి వీటిని మరింత నేర్చుకోవడం అవసరం. పునశ్చరణ గైడ్ అనేది అభ్యాసకుడు విషయం గురించి, తన అదనపు సాధన గురించి ముఖ్యంగా పరీక్ష ముందు గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడే పాఠ్యపుస్తకము యొక్క ఒక రకం. పాఠ్యపుస్తకములు సాధారణంగా పాఠశాల బోధన కోర్సును అనుసరించి పాఠశాలల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయబడతాయి. కొన్నిసార్లు ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ అవసరాల కోసం పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేస్తారు లేదా లైబ్రరీ నుండి వాటిని అరువు తీసుకుంటారు. అధికభాగం పాఠ్యపుస్తకాలు అచ్చువేసిన ఫార్మాట్ లో మాత్రమే ప్రచురించబడుతున్నాయి. అయితే, కొన్ని ఇప్పుడు ఎలక్ట్రానిక్ పుస్తకాల వలె ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

పాఠ్యపుస్తకము

మూలాలు