ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం (ప్రపంచ పత్రికా దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం 2017 పోస్టర్
జరుపుకొనే రోజుమే 3
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

చరిత్ర

ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి.

ఆఫ్రికన్‌ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది.

అప్పటినుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను జరుపుకుంటున్నారు.[1]

ఉద్దేశ్యం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం లక్ష్యాలు

అవార్డులు

కొలంబియన్‌లోని ఒక పత్రికకు ఎడిటర్‌ గా పనిచేస్తున్న గుల్లెర్మోకేనో అనే వ్యక్తిని 1986 డిసెంబర్‌ 17న డ్రగ్‌ మాఫియా హత్య చేసింది. పత్రికా స్వేచ్ఛకు స్ఫూర్తిగా ఆయన పేరుమీద యునెస్కో 1997 నుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన గుల్లెర్మోకేనో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ అవార్డులను ఇస్తుంది.[2]

ఎన్ని అవరోధాలు, ఇబ్బందులు ఎదురైనాకానీ పత్రికా స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన జర్నలిస్టులకు ఈ అవార్డుతో 25,000 అమెరికన్‌ డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు.

కార్యక్రమాలు

మూలాలు

ఇతర లంకెలు