ఆఫ్రికా

భూగోళంలో ఉన్న ఖండాల్లో ఒకటి

ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది.[2] 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.[3]ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. 54 పూర్తిగా గుర్తింపు పొందిన సార్వభౌమ రాజ్యాలు (దేశాలు), 9 ప్రాంతాలు, కొద్దిపాటి గుర్తింపు కానీ లేక గుర్తింపే లేకుండా కానీ ఉన్న రెండు డీ-ఫాక్టో స్వతంత్ర దేశాలు ఉన్నాయి.[4] అత్యధిక సంఖ్యలోని దేశాలు ఉత్తరార్థగోళంలోనే ఉన్నా చెప్పుకోదగ్గ భాగం, పలు దేశాలు దక్షిణార్థ గోళంలోనూ ఉన్నాయి.

ఆఫ్రికా

ఆఫ్రికా ఖండాన్ని చూపించే ప్రపంచ పటం.
ఆఫ్రికా ఖండాన్ని చూపించే ప్రపంచ పటం.
విస్తీర్ణం30221532 చ.కి.మీ.
జనాభా922,011,000[1] (2005, జనాభావారిగా ఖండాల జాబితా|2వది)
జనసాంద్రత30.51/కి.మీ.² (దాదాపు 80/చ.మై.)
దేశాలు
ఆధారిత దేశాలు
ప్రాంతీయతఆఫ్రికన్
భాషలుఆఫ్రికా భాషలు, అనేక ఇతరభాషలు
టైం జోన్లుUTC-1 (కేప్ వెర్డే) to UTC+4 (మారిషస్)

అన్ని ఖండాలతో పోలిస్తే ఆఫ్రికా సగటు జనాభా వయసు అతి తక్కువ;[5][6] 2012లో ఆఫ్రికా మధ్యగత (మీడియన్) వయసు 19.7 సంవత్సరాలు, అయితే ప్రపంచవ్యాప్తంగా మధ్యగత వయస్సు 30.4 సంవత్సరాలు.[7] విస్తీర్ణం పరంగా ఆల్గేరియా, జనాభా పరంగా నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద దేశాలు. ఆఫ్రికా, ప్రత్యేకించి మధ్య తూర్పు ఆఫ్రికా, మానవ జాతికి, హోమినిడే క్లాడే (పెద్ద తోకలేని కోతులు) జన్మస్థలంగా పేరొందింది.

భౌగోళికం

దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు

క్రింద ఇవ్వబడిన పట్టిక ఆఫ్రికా ఖండంలోని దేశాలు, ప్రాంతాలు, ఉప ప్రాంతాలను సూచిస్తుంది. వీటి వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి చే తయారు చేయబడిన ప్రణాళిక " భౌగోళిక ఉపప్రాంతాల కొరకు పథకం ".

ప్రాంతాలు ఆఫ్రికా:
  Northern Africa
  Western Africa
  Middle Africa
  Eastern Africa
  Southern Africa
ఆఫ్రికా భౌతిక చిత్రం.
ఆఫ్రికా ఉపగ్రహ చిత్రం.
ఆఫ్రికా రాజకీయ పటం.
ప్రాంతం పేరు[8],
ప్రదేశములు వాటి పతాకం
విస్తీర్ణం
(చ.కి.మీ.)
జనాభా
( 2002 జూలై 1 గణాంకాలు.)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.నకు)
రాజధాని
తూర్పు ఆఫ్రికా:
బురుండి27,8306,373,002229.0బుజుంబురా
కొమొరోస్2,170614,382283.1మొరోని
జిబౌటి23,000472,81020.6జిబౌటి
ఎరిట్రియా121,3204,465,65136.8అస్మారా
ఇథియోపియా1,127,12767,673,03160.0అద్దిస్ అబాబా
కెన్యా582,65031,138,73553.4నైరోబి
మెడగాస్కర్587,04016,473,47728.1అంతనానారివో
మలావి118,48010,701,82490.3లిలోంగ్వే
మారిషస్2,0401,200,206588.3పోర్ట్ లూయిస్
మయోట్టే (ఫ్రాన్సు)374170,879456.9మమౌద్‌జూ
మొజాంబిక్801,59019,607,51924.5మాపుటో
రేయూనియన్ (ఫ్రాన్స్)2,512743,981296.2సెయింట్ డెనిస్
రువాండా26,3387,398,074280.9en:కిగాలి
సిచెల్లెస్45580,098176.0విక్టోరియా
సోమాలియా637,6577,753,31012.2మొఘదిషు
టాంజానియా945,08737,187,93939.3డొడోమా
ఉగాండా236,04024,699,073104.6కంపాలా
జాంబియా752,6149,959,03713.2లుసాకా
జింబాబ్వే390,58011,376,67629.1హరారే
మధ్య ఆఫ్రికా:
అంగోలా1,246,70010,593,1718.5లువాండా
కామెరూన్475,44016,184,74834.0యౌందే
మధ్య ఆఫ్రికన్ రిపబ్లిక్622,9843,642,7395.8బాంగుయి
చాద్1,284,0008,997,2377.0నద్‌జమానే
కాంగో రిపబ్లిక్342,0002,958,4488.7బ్రజ్జావిల్లే
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో2,345,41055,225,47823.5కిన్షాసా
ఈక్వెటోరియల్ గినియా28,051498,14417.8మలాబో
గబోన్267,6671,233,3534.6లిబ్రెవిల్లే
సావో టోమె, ప్రిన్సైపె1,001170,372170.2సావో టోమే
ఉత్తర ఆఫ్రికా:
అల్జీరియా2,381,74032,277,94213.6అల్జీర్స్
ఈజిప్ట్[9]1,001,45070,712,34570.6కైరో
లిబియా1,759,5405,368,5853.1ట్రిపోలి
మొరాకో446,55031,167,78369.8రబాత్
సూడాన్2,505,81037,090,29814.8ఖార్తూమ్
ట్యునీషియా163,6109,815,64460.0ట్యూనిస్
పశ్చిమ సహారా[10]266,000256,1771.0అల్ అలైయున్
ఉత్తర ఆఫ్రికాలో స్పానిష్ ప్రాంతాలు:
కానరి దీవులు (స్పెయిన్)[11]7,4921,694,477226.2గ్రాన్ కెనేరియా,
సాంతాక్రజ్ డీ టెనెరైఫ్
సియూటా (స్పెయిన్)[12]2071,5053,575.2
మదీరా దీవులు (పోర్చుగల్)[13]797245,000307.4ఫుంచాల్
మెలిల్లా (స్పెయిన్)[14]1266,4115,534.2
దక్షిణ ఆఫ్రికా (ప్రాంతం):
బోత్సవానా600,3701,591,2322.7గబోరోన్
లెసోతో30,3552,207,95472.7మాసేరు
నమీబియా825,4181,820,9162.2వింఢోక్
దక్షిణ ఆఫ్రికా1,219,91243,647,65835.8బ్లీమ్ ఫౌంటీన్, కేప్ టౌన్, ప్రిటోరియా[15]
స్వాజీలాండ్17,3631,123,60564.7మబాబనే
పశ్చిమ ఆఫ్రికా:
బెనిన్112,6206,787,62560.3పోర్టో నోవో
బుర్కినాఫాసో274,20012,603,18546.0ఔగాడౌగో
కేప్ వెర్డే4,033408,760101.4ప్రైరా
కోటే డిఐవోరే322,46016,804,78452.1ఆబిద్‌జాన్, యామౌసొక్రో[16]
గాంబియా11,3001,455,842128.8బాంజుల్
ఘనా239,46020,244,15484.5en:Accra
గినియా245,8577,775,06531.6కొనాక్రీ
గినియా బిస్సూ36,1201,345,47937.3బిస్సూ
లైబీరియా111,3703,288,19829.5మొన్రోవియా
మాలి1,240,00011,340,4809.1బమకో
మారిటానియా1,030,7002,828,8582.7నవాక్‌చోట్
నైగర్1,267,00010,639,7448.4నియామీ
నైజీరియా923,768129,934,911140.7అబూజా
సెయింట్ హెలీనా (యు.కె.)4107,31717.8జేమ్స్‌టౌన్
సెనెగల్196,19010,589,57154.0డకార్
సియెర్రా లియోన్71,7405,614,74378.3ఫ్రీటౌన్
టోగో56,7855,285,50193.1లోమే
మొత్తం30,368,609843,705,14327.8


ఇవీ చూడండి

పాదపీఠికలు

మూలాలు

గ్రంధాలు