బ్యాచిలర్ ఆఫ్ సైన్స్

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బిస్సీ - BSc) సాధారణంగా మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు పూర్తి చేయగల డిగ్రీ.[1]

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
Cesar Roberto Merino Ortega Bachelor of Science Psychology.jpg
అరిజోనా స్టేట్ యూనివర్శిటీ విశ్వవిద్యాలయపు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ
AcronymBSc
BS
B. sc.
SB
ScB
Typeబ్యాచిలర్స్ డిగ్రీ
Duration3 to 5 సంవత్సరాలు

1860 లో మొదటిసారిగా లండన్ విశ్వవిద్యాలయం బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలో ప్రవేశం కల్పించింది.[2]

భారతదేశంలో

భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఇచ్చే బిఎస్సీ డిగ్రీ సాధారణంగా మూడు సంవత్సరాలు ఉంటుంది. కొన్ని స్వతంత్ర కళాశాలలు కూడా సిలబస్ లో కొద్దిపాటి మార్పులతో బిఎస్సీ డిగ్రీ అందిస్తున్నాయి. బిఎస్సీ డిగ్రీ బి.టెక్ లేదా బి.ఇ డిగ్రీలకంటే వేరైనది. బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అందించే బి.ఎస్సీ (రీసెర్చ్), ఐఐటి మద్రాసు వారు అందించే బి.ఎస్ డిగ్రీ, ఐసర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) అందించే బీఎస్-ఎమ్మెస్ కోర్సు ఇందుకు మినహాయింపులు. ఇవి నాలుగేళ్ళు వ్యవధి కలిగిన కోర్సులు. వీటిలో ఎక్కువగా పరిశోధన, బహుశాస్త్రాంతర (Interdisciplinery) విషయాల మీద ఎక్కువ దృష్టి ఉంటుంది.[3]

మూలాలు