బ్యాచిలర్స్ డిగ్రీ

బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కళాశాలలు, లేదా విశ్వవిద్యాలయాలు మూడు నుంచి ఆరు సంవత్సరాల పాటు (విద్యా సంస్థ, చదువును బట్టి) కోర్సు చదివిన వారికి ప్రధానం చేసే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనేవి చాలామందికి తెలిసిన బ్యాచిలర్ డిగ్రీలు.

బ్యాచిలర్స్ అనే పదం లాటిన్ లోని baccalaureus అనే పదం నుంచి వచ్చింది.

బ్రిటిష్ విద్యావిధానంలోనూ, దానిచేత ప్రభావితమైన విద్యావిధానాల్లోనూ అండర్ గ్రాడ్యుయేట్ అకాడమిక్ డిగ్రీలను ఆనర్స్ డిగ్రీ, సాధారణ డిగ్రీ అని రెండు రకాలుగా విభజిస్తారు.[1] ఆనర్స్ డిగ్రీ సాధారణ డిగ్రీతో పోలిస్తే సాధారణంగా కొంత ఉన్నత ప్రమాణాలతో కూడుకుని ఉంటుంది. చాలా విద్యావిధానాల్లో మాస్టర్స్, లేదా డాక్టరేట్ చేయాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ తప్పనిసరి.

దేశాలవారీగా బ్యాచిలర్స్ డిగ్రీ కాలపరిమితి

  3 years
  4 years
  5 years
  6 years

ఈ పటంలో వివిధ దేశాలలో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించడానికి పట్టే కాలం సూచించబడింది. ఇది సాధారణంగా 3 నుంచి 6 సంవత్సరాలు.

భారతదేశంలో బ్యాచిలర్స్ డిగ్రీ సాధారణంగా మూడు సంవత్సరాలలో పూర్తవుతాయి. అయితే బి.టెక్, బి.ఇ, ఎంబిబిఎస్, బివిఎస్సీ, బి.ఆర్క్ డిగ్రీలు ఇందుకు మినహాయింపు. బి.ఇ లేదా బి.టెక్ డిగ్రీ నాలుగు సంవత్సరాలు చదవాలి. ఎంబిబిఎస్, బివిఎస్సీ చదవడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది. సాధారణంగా విద్యార్థుల జాతీయ బోర్డు కానీ స్టేట్ బోర్డులోగానీ 12 వ తరగతి (పదవ తరగతి తర్వాత రెండేళ్ళు) చదివిన తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీల్లో చేరుతుంటారు.

చాలా ఆఫ్రికా దేశాలలో ఆయా దేశాలను పరిపాలించిన వలస దేశాల విద్యా విధానం కనిపిస్తుంది. ఉదాహరణకు నైజీరియా విద్యా విధానం బ్రిటిష్ విద్యా విధానానికి దగ్గరగా ఉంటుంది. ఐవరీ విద్యావిధానం ఫ్రెంచి విద్యా విధానానికి దగ్గరగా ఉంటుంది.

అమెరికా దేశాల్లో అసోసియేట్, బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టరేటు, పోస్ట్ డాక్టరేటు డిగ్రీలు ఉంటాయి.

మూలాలు