మన్నీ పాక్వియావో

మన్నీ పాక్వియావో పిలిప్పీన్స్ దేశానికి చెందిన బాక్స‌ర్, మాజీ బాక్సింగ్ వ‌రల్డ్ చాంపియ‌న్‌, సినీ నటుడు & రాజకీయ నాయకుడు. ఆయన 26 ఏళ్ల బాక్సింగ్ కెరియర్‌లో 72 బౌట్లలో 62 విజయాలు సాధించి, 8 డివిజన్‌ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా నిలిచాడు.[3]

మన్నీ పాక్వియావో
మన్నీ పాక్వియావో


ఫిలిప్పీన్స్ సెనేటర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
జూన్ 30, 2016

సెనెట్ ఎథిక్స్ అండ్ ప్రివిలేజెస్ కమిటీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
సెప్టెంబర్ 18, 2018
ముందుటిటో సోట్టో

సెనెట్ పబ్లిక్ వర్క్స్ కమిటీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
జులై 25, 2016
ముందుబోంగ్ బోంగ్ మరికోస్

సారంగాని ప్రావిన్స్ శాసనసభ్యుడు
పదవీ కాలం
జూన్ 30, 2010 – జూన్ 30, 2016
ముందుఎర్విన్ చిఒంగిబియాన్
తరువాతరోగెలీయో పాక్వియావో

వ్యక్తిగత వివరాలు

జననం (1978-12-17) 1978 డిసెంబరు 17 (వయసు 45)
కిబావా, ఫిలిప్పీన్స్ ప్రావిన్స్
జాతీయతఫిలిపినో
రాజకీయ పార్టీపీడీపీ (2012–2014; 2016–ప్రస్తుతం)
జీవిత భాగస్వామిజింకీ జామోర్ [1][2]
బంధువులుబాబీ పాక్వియావో (సోదరుడు)
సంతానం5 (3 కుమారులు , 2 కుమార్తెలు)

జననం

మన్నీ పాక్వియావో 1978 డిసెంబరు 17న ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ కిబావాలో రోసాలియో పాక్వియావో, డియోనిసియా డాపిడ్రాన్ దంపతులకు జన్మించాడు. ఆయన ఆరుగురు పిల్లలలో నాల్గవ సంతానం.

క్రీడా జీవితం

మన్నీ పాక్వియావో బ్రూస్ లీ, మహ్మద్ అలీ అతడు ఆదర్శముగా చిన్న వయస్సు నుండే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన 1999 ప్రారంభంలో, మానీ అమెరికన్ ప్రమోటర్ మురాద్ మొహమ్మద్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు.

రాజకీయ జీవితం

మన్నీ పాక్వియావో 2010లో రాజ‌కీయ ప్ర‌వేశం చేసి సేనేట్‌కు ఎన్నిక‌య్యాడు. మన్నీ పాక్వియావో 2022లో జ‌రిగే పిలిప్పీన్స్ దేశాధ్య‌క్ష ప‌ద‌వి కోసం జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు.[4][5]

సేవా కార్యక్రమాలు

మానీ పాక్వియావో 2016లో, పాక్వియావో పేదల కోసం నిర్మించాల్సిన 1,000 గృహాలకు తన సొంత నిధులతో నిర్మించాడు. ఆయన 2015లో జరిగిన ఫైట్ లో వచ్చిన వంద మిలియన్ డాలర్లను ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేశాడు.[6]

వివాదాలు

మానీ పాక్వియావో 2016లో స్వలింగ సంబంధాలలో ఉన్నవారు “జంతువులకన్నా అధ్వాన్నంగా” ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.[7]

మూలాలు