మిలోస్ ఫోర్‌మన్

చెక్-అమెరికన్ నాటకరంగ, టివి, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, ప్రొఫెసర్

మిలోస్ ఫోర్‌మన్ (1932, ఫిబ్రవరి 18 - 2018, ఏప్రిల్ 13) చెక్-అమెరికన్ నాటకరంగ, టివి, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, ప్రొఫెసర్. 1968లో యునైటెడ్ స్టేట్స్‌కు వలస వెళ్ళేముందు తన స్వస్థలమైన చెకోస్లోవేకియాలో పేరు గడించాడు.

మిలోస్ ఫోర్‌మన్
మిలోస్ ఫోర్‌మన్ (2009)
జననం(1932-02-18)1932 ఫిబ్రవరి 18
చెకోస్లోవేకియా
మరణం2018 ఏప్రిల్ 13(2018-04-13) (వయసు 86)
డాన్‌బరీ హాస్పిటల్‌, యుఎస్
జాతీయత
  • అమెరికన్ (1977 నుండి)
  • చెక్
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1953–2011
జీవిత భాగస్వామి
  • జానా బ్రెజ్చోవా
    (m. 1958; div. 1962)
  • వేరా క్రేసాద్లోవా
    (m. 1964; div. 1999)
  • మార్టినా జ్బోరిలోవా
    (m. 1999)
పిల్లలు4
సంతకం

జననం

మిలోస్ 1932, ఫిబ్రవరి 18న రుడాల్ఫ్ ఫోర్‌మన్ - అన్నా ఫోర్‌మనోవా దంపతులకు చెకోస్లోవేకియాలో జన్మించాడు. ఇతని తల్లి 1943లో ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలోనూ, తండ్రి 1944లో మిట్టెల్‌బౌ-డోరా నిర్బంధ శిబిరంలో హత్య చేయబడ్డారు.[1] దాంతో ఇతని తల్లిదండ్రుల దగ్గరి బంధువులు, స్నేహితుల దగ్గర పెరిగాడు.[2]

సినిమారంగం

1967లో తీసిన ది ఫైర్‌మెన్స్ బాల్‌ను అనే సినిమాను చెకోస్లోవాక్ అధికారులు తూర్పు యూరోపియన్ కమ్యూనిజంపై తీసిన సినిమాగా భావించారు. ఈ సినిమా మొదట్లో ప్రేగ్ స్ప్రింగ్సంస్కరణవాద వాతావరణంలో అతని స్వదేశంలోని థియేటర్లలో ప్రదర్శించబడింది. అయితే, 1968లో వార్సా ఒప్పంద దేశాల దాడి తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వంచే నిషేధించబడింది.[3]

ఆ తరువాత చెకోస్లోవేకియాను విడిచి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్ళి, అక్కడ సినిమాలు తీసి విజయాన్ని సాధించాడు. 1975లో వన్ ఫ్లూ ఓవర్ ది కోకిల నెస్ట్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రధాన పాత్రలో నటుడు, ప్రధాన పాత్రలో నటి మొదలైన ఐదు ప్రధాన అకాడమీ అవార్డులను గెలుచుకొని, ఇన్ని అవార్డులు గెలుచుకున్న రెండవ సినిమాగా నిలిచింది.

1978లో హెయిర్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది 1979 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 1981లో రాగ్‌టైమ్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎనిమిది విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. 1984లో ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసుడు వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ జీవితం ఆధారంగా అమేడియస్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా పదకొండు విభాగాల్లో నామినేషన్ పొంది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు ఎనిమిది విభాగాల్లో అవార్డులు అందుకుంది. 1996లో ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లైంట్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా మరోసారి అకాడమీ అవార్డు నామినేట్ అయ్యాడు.

దర్శకత్వం

సినిమాలు

సంవత్సరంపేరు[4]దర్శకుడురచయితమూలాలు
1955లీవ్ ఇట్ టు మీకాదుఅవును[5]
1964బ్లాక్ పీటర్అవునుఅవును[6]
1964ఆడిషన్అవునుఅవును
1965లవ్స్ ఆఫ్ ఏ బ్లోండేఅవునుఅవును
1967ఫైర్‌మెన్స్ బాల్అవునుఅవును[7]
1971టేకింగ్ ఆఫ్అవునుఅవును
1975వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్అవునుకాదు
1979హెయిర్అవునుకాదు
1981రాగ్‌టైమ్అవునుకాదు
1984అమేడియస్అవునుకాదు
1989వాల్మాంట్అవునుఅవును
1996ద పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్అవునుకాదు
1999మ్యాన్ ఆన్ ది మూన్అవునుకాదు
2006గోయాస్ గోస్ట్స్అవునుఅవును

డాక్యుమెంటరీ

సంవత్సరంపేరుదర్శకుడురచయితమూలాలు
1960మేజిక్ లాంటెర్న్ IIఅవునుఅవును
1964ఇఫ్ ఓన్లీ దే ఎయింట్ హాడ్ దెమ్ బ్యాండ్స్అవునుఅవును[8]
ఆడిషన్అవునుఅవును
1973విజన్స్ ఆఫ్ ఐట్అవునుకాదు[6]

షార్ట్ ఫిల్మ్స్

సంవత్సరంపేరుదర్శకుడురచయితమూలాలు
1971ఐ మిస్ సోనియా హెనీఅవునుకాదు[9]

టెలివిజన్

సంవత్సరంపేరుదర్శకుడురచయితమూలాలు
1966ఎ వెట్ పెయిడ్ వాక్అవునుకాదు[10]

నటించినవి

సినిమాలు

సంవత్సరంసినిమామూలాలు
1953ఎ వుమెన్ ఆజ్ గుడ్ ఆజ్ హర్ వర్డ్
1954సిల్వర్ విండ్
1986హార్ట్ బర్న్
1989న్యూ ఇయర్స్ డే
2000కీపింగ్ ది ఫెయిత్
2008చెల్సియా ఆన్ ది రాక్స్
2009హెల్ విత్ ఎ ప్రిన్సెస్
2011బిలవుడ్

నాటకాలు

సంవత్సరంపేరుదర్శకుడురచయితమూలాలు
1958లేటర్నా మాజికాకాదుఅవును[11]
1960లాటర్నా మాజికా IIకాదుఅవును[11]
1972ది లిటిల్ బ్లాక్ బుక్అవునుకాదు[11]
2007ఎ వాక్ వర్త్ వైట్అవునుకాదు[11]

అవార్డులు, నామినేషన్లు

ఇతడు తన సినీ జీవితంలో రెండు అకాడమీ అవార్డులు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ బేర్, బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు, సీజర్ అవార్డు, డేవిడ్ డి డోనాటెల్లో అవార్డు, చెక్ లయన్‌లను గెలుచుకున్నాడు.[12]

సంవత్సరంఅవార్డువిభాగంపేరుఫలితంమూలాలు
1976అకాడమీ అవార్డులుఉత్తమ దర్శకుడువన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్విజేత[13]
1985అమేడియస్విజేత
1997ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్నామినేట్
1972బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ దర్శకత్వంటేకింగ్ ఆఫ్నామినేట్[14]
ఉత్తమ చిత్రంనామినేట్[14]
ఉత్తమ స్క్రీన్ ప్లేనామినేట్[14]
1977ఉత్తమ దర్శకత్వంవన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్విజేత[14]
1986ఉత్తమ చిత్రంఅమేడియస్నామినేట్[14]
1976గోల్డెన్ గ్లోబ్ అవార్డులుఉత్తమ దర్శకుడువన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్విజేత[15]
1982రాగ్‌టైమ్నామినేట్[15]
1985అమేడియస్విజేత[15]
1997ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్విజేత[15]
1971కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్గ్రాండ్ ప్రిక్స్టేకింగ్ ఆఫ్విజేత[16]
పామ్ డి ఓర్నామినేట్[16]
1997బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్గోల్డెన్ బెర్లిన్ బేర్ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్విజేత[17]
2000మ్యాన్ ఆన్ ది మూన్నామినేట్[18]
సిల్వర్ బేర్ ఉత్తమ దర్శకుడువిజేత[18]
1977సీజర్ అవార్డులుఉత్తమ విదేశి చిత్రంవన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్నామినేట్[19]
1980హెయిర్నామినేట్[19]
1985అమేడియస్విజేత[19]
1990ఉత్తమ దర్శకుడువాల్మాంట్నామినేట్[19]
1976డేవిడ్ డి డోనాటెల్లో అవార్డులుఉత్తమ విదేశి దర్శకుడువన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్విజేత[20]
1980హెయిర్విజేత[21]
1985అమేడియస్విజేత[22]
ఉత్తమ విదేశి చిత్రంవిజేత[22]

ఇతర సినిమాల అవార్డులు

ఫోర్‌మన్ సినిమాలకు వచ్చిన అవార్డులు, నామినేషన్లు
సంవత్సరంశీర్షికఅకాడమీ అవార్డులుబ్రిటీష్ అవార్డులుగోల్డెన్ గ్లోబ్ అవార్డులు
నామినేషన్విజేతనామినేషన్విజేతనామినేషన్విజేత
1965లవ్స్ ఆఫ్ ఎ బ్లోండే11
1967ది ఫైర్‌మెన్స్ బాల్1
1971టేకింగ్ ఆఫ్6
1973విజన్స్ ఆఫ్ ఐట్11
1975వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్9510666
1979హెయిర్2
1981రాగ్‌టైమ్817
1984అమేడియస్1189464
1989వాల్మాంట్11
1996ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్252
1999మ్యాన్ ఆన్ ది మూన్21
మొత్తం331327103014

గౌరవాలు

1977లో ఇతనికి యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం వచ్చింది.[23] 1985, 2000 సంవత్సరాలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నాయకత్వం వహించాడు. 1988లో సీజర్ అవార్డు వేడుకకు అధ్యక్షత వహించాడు.[24] 2007 ఏప్రిల్ లో జాజ్ ఒపెరా డోబ్రే ప్లేస్నా ప్రోచాజ్కాలో పాల్గొన్నాడు. 1966లో రూపొందించిన టివి సినిమాకు ప్రేగ్ నేషనల్ థియేటర్‌లో ప్రదర్శించబడింది. దీనికి ఇతని కుమారుడు కుమారుడు పీటర్ దర్శకత్వం వహించాడు.

  • 1965: లవ్స్ ఆఫ్ ఎ బ్లోండ్[25] కొరకు క్లెమెంట్ గాట్‌వాల్డ్ రాష్ట్ర బహుమతి
  • 1997: కార్లోవీ వేరీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ సినిమాకి అత్యుత్తమ కళాత్మక సహకారం అందించినందుకు క్రిస్టల్ గ్లోబ్ అవార్డు[26]
  • 1998: చెక్ సినిమాకి చేసిన సేవలకు చెక్ లయన్ అవార్డ్స్ ద్వారా జీవితకాల సాఫల్య పురస్కారం[27]
  • 1995: చెక్ మెడల్ ఆఫ్ మెరిట్[27]
  • 2006: హన్నో ఆర్. ఎలెన్‌బోజెన్ పౌరసత్వ పురస్కారం
  • 2009: యుఎస్ లోని మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని ఎమర్సన్ కాలేజీ నుండి గౌరవ డిగ్రీ[28]
  • 2015: కొలంబియా విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టర్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ డిగ్రీ[29]

ఇతర వివరాలు

మిలోస్ ఫోర్‌మన్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎమెరిటస్ ఫిల్మ్ ప్రొఫెసర్ గా పనిచేవాడు.[30] 1996లో గ్రహశకలానికి 11333 ఫోర్‌మన్ అని ఇతని పేరు పెట్టారు.[31] కవితలు వ్రాసాడు, 1994లో టర్నరౌండ్ అనే ఆత్మకథను ప్రచురించాడు.[31]

మరణం

మిలోస్ ఫోర్‌మన్ తన 86 సంవత్సరాల వయస్సులో 2018, ఏప్రిల్ 13న కనెక్టికట్‌లోని వారెన్‌లోని తన ఇంటికి సమీపంలోని డాన్‌బరీ హాస్పిటల్‌లో మరణించాడు.[32][33][34][35] అతను కనెక్టికట్‌లోని వారెన్‌లోని న్యూ వారెన్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.

మూలాలు

ది మిలోస్ ఫార్మన్ స్టోరీస్ వాన్ ఆంటోనిన్ జె. లిహెమ్ (ISBN 978-1-138-65829-5)

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.