రసవాదం

పురాతన తత్త్వం మరియు శాస్త్రం

రసవాదం (ఆంగ్లం: Alchemy) ఒక పురాతన శాస్త్రం. ఇది ప్రకృతి తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది. ఇది ముఖ్యంగా భారత దేశం, చైనా, ముస్లిం దేశాలు, ఇంకా యూరప్ లో ఆచరిస్తూ ఉండేవారు.[1] దీన్ని ఆచరించే వారిని రసవాదులు అంటారు. వీరు కొన్ని పదార్థాలను అమలినం చేసి, మెరుగు పరచి వాటిని పరిపూర్ణమైన వాటిగా చేయడానికి ప్రయత్నించేవారు.[1][2][3] వీరి ప్రధాన లక్ష్యం నీచ ధాతువుల్ని లేదా బేస్ మెటల్స్ ని (ఉదాహరణకు సీసం) శ్రేష్ఠ ధాతువు లేదా నోబుల్ మెటల్స్ (ఉదాహరణకు బంగారం) గా మార్చడం; అమృతాన్ని తయారు చేయడం; [1] ఏ రోగాన్నయినా నయం చేయగల ఔషధం తయారు చేయడం.[4]

చార్లెస్ మెకాలే రాసిన " ఎక్ట్రార్డినరీ పాపులర్ డెలుసియస్ అండ్ ద మాడ్ నెస్ ఆఫ్ క్రౌడ్స్" లో రసవాది

రసవాదానికి సంబంధించి ఆధునిక చర్చల గురించి ఎరిక్ జె. హోల్మియార్డ్, మేరీ-లూయిస్ వాన్ ఫ్రాంజ్ వంటి పండితులు విమర్శించినప్పటికీ, వాటిని ప్రధానంగా ఎవరైనా లోకజ్ఞానంతో చేసే పరిశీలనలు, రహస్య ఆధ్యాత్మిక అంశాల పరిశీలనలుగా విభజించబడ్డాయి.

పద వ్యుత్పత్తి

ఆంగ్ల పదం ఆల్కెమీ పాత ఫ్రెంచి భాష నుంచి వచ్చింది. మధ్యయుగపు లాటిన్ లో దీన్ని ఆల్కిమియా అని ప్రస్తావించారు. ఈ పదం అరబిక్ భాష నుంచి వచ్చింది. అరబిక్ భాషలో దాని అర్థం దైవిక లేదా అసలు రూపంతో తిరిగి కలిసే పరివర్తన ప్రక్రియ.

మూలాలు