రామచంద్ర గుహ

భారతదేశం నుండి చరిత్రకారుడు మరియు రచయిత

రామచంద్ర గుహ (జననం 29 ఏప్రిల్ 1958) ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, కాలమిస్ట్ రచయిత. ఆయన ఆసక్తులు పర్యావరణ, సామాజిక, రాజకీయ, క్రికెట్ చరిత్రలకు విస్తరించి ఉన్నాయి. టెలిగ్రాఫ్, హిందుస్తాన్ టైమ్స్ వంటి పత్రికల్లో కాలమ్స్ రాస్తున్నారు..[1][2][3] వివిధ అకడమిక్ జర్నల్స్ కు తరచు రాస్తూంటారు. కారవాన్, అవుట్ లుక్ వంటి పత్రికలకు కూడా రచన చేశారు. 2011-12 సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో ఫిలిప్పీ రోమన్ ఛైర్ ఆఫ్ హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కు విజిటింగ్ పొజిషన్ చేపట్టారు.[4] ఆయన విస్తృతమైన విస్తృతమైన రచనలు, వివిధ రంగాలను స్పృశిస్తూ, అనేక తర్కబద్ధమైన నిశిత ఆలోచనలు అందించడంతో భారతీయ చరిత్ర అధ్యయన రంగంలో ప్రాముఖ్యత సంపాదించుకున్నారు, గుహా 20వ శతాబ్ది అంతం, 21వ శతాబ్ది తొలినాళ్ళకు చెందిన భారతీయ చరిత్రకారుల్లో ప్రధానమైన వ్యక్తిగా పేరుపొందారు.

రామచంద్ర గుహా
2017లో రామచంద్రగుహా
జననం (1958-04-29) 1958 ఏప్రిల్ 29 (వయసు 66)
డెహ్రాడూన్, ఉత్తర ప్రదేశ్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉంది)
నివాసంబెంగళూరు
రంగములుచరిత్ర, మానవ విజ్ఞాన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం
చదువుకున్న సంస్థలుద డూన్ స్కూల్
సెయింట్ స్టీఫెన్ కళాశాల, న్యూఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్ కతా

పురస్కారాలు

  • 2009లో భారత ప్రభుత్వం ఇతనికి మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్ అవార్డ్‌ను ప్రదానం చేసింది.[5]

మూలాలు