రాయల్ సొసైటీ

రాయల్ సొసైటీ (అధికారికంగా ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఫర్ ఇంప్రూవింగ్ న్యాచురల్ నాలెడ్జ్[1]) యునైటెడ్ కింగ్‌డమ్ కి చెందిన విజ్ఞాన సమాజం, జాతీయ విజ్ఞాన పీఠం (నేషనల్ సైన్స్ అకాడమీ). ఈ సమాజం అనేక పాత్రలు పోషిస్తుంది: విజ్ఞాన శాస్త్రం, దాని ప్రయోజనాలను ప్రోత్సహించడం, విజ్ఞానంలో శ్రేష్ఠతను గుర్తించడం, అత్యుత్తమ విజ్ఞానానికి మద్దతు ఇవ్వడం, విధానం, విద్య, ప్రజల భాగస్వామ్యం కోసం శాస్త్రీయ సలహాలను అందించడం, అంతర్జాతీయ ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం. దీనిని ఇంగ్లండ్ రాజు అయిన రెండవ కింగ్ ఛార్లెస్ రాయల్ చార్టర్ కింద ది రాయల్ సొసైటీ అనే పేరుతో మంజూరు చేశాడు. ఇది 28 నవంబర్ 1660న స్థాపించబడింది. ఇది ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం ఇప్పటికీ ఉనికిలో ఉన్న విజ్ఞాన సమాజం.[2]

ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఫర్ ఇంప్రూవింగ్ న్యాచురల్ నాలెడ్జ్
Sketch of the coat of arms; refer to article text for description
చిహ్నం
స్థాపన28 నవంబరు 1660; 363 సంవత్సరాల క్రితం (1660-11-28)
ప్రధాన
కార్యాలయాలు
లండన్, మూస:Postcode
యునైటెడ్ కింగ్‌డమ్
భౌగోళికాంశాలు51°30′22″N 00°07′56″W / 51.50611°N 0.13222°W / 51.50611; -0.13222
సభ్యులు
  • ~1600 సభ్యులు
  • ~140 విదేశీ సభ్యులు
  • 6 రాయల్ ఫెలోస్
పేట్రన్మూడవ ఛార్లెస్
అధ్యక్షుడుసర్ ఆడ్రియన్ స్మిత్
విదేశాంగ కార్యదర్శిసర్ రాబిన్ విలియం గ్రిమ్స్
కోశాధికారిసర్ ఆండ్రూ హోపర్
ప్రధానభాగంకౌన్సిల్
సిబ్బంది~225
రిమార్కులుMotto: Nullius in verba
("Take nobody's word for it")

సమాజ చట్టాలు, నియమాల ప్రకారం ఈ సమాజ అధ్యక్షుడు నేతృత్వం లోని కౌన్సిల్ నిర్వహిస్తుంది. కౌన్సిల్ సభ్యులు, అధ్యక్షులు దాని సభ్యుల నుండి, వారే ఎన్నుకుంటారు. సమాజంలోని ప్రాథమిక సభ్యులు, వారు ఇప్పటికే ఉన్న సభ్యులచే ఎన్నుకోబడతారు. ఈ సమాజంలో 2020 నాటికి, దాదాపు 1,700 మంది సభ్యులు ఉన్నారు. ఇందులోని సభ్యులు FRS (ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ)ని ఉపయోగించడానికి అర్హులు. దాదాపు 800 మంది అభ్యర్థుల నుండి ప్రతి సంవత్సరం 73 మంది కొత్త సభ్యులు నియమితులవుతూ ఉంటారు.

మూలాలు