వినియోగదారుడు

వినియోగదారుడు (Consumer) సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే, దానివలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది. వినియోగదారుడు అనగా " వారి స్వంత ఉపయోగం కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసే వ్యక్తి".[1]

వినియోగదారుడు

చరిత్ర

ఒక దేశం ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు కీలక పాత్ర వహిస్తారు . ఎందుకంటే తయారు అయ్యే వస్తువులు కానీ, సేవలను వినియోగదారులు వాడకుంటే , ఉత్పత్తిదారులకు ఉత్పత్తి చేయడానికి ప్రేరణనే ఉండదు. ఆర్ధిక రంగం, వ్యాపార రంగం , ప్రచార రంగాలలో, వినియోగదారుడు కంపెనీ, సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు, వారి సేవలను వినియోగించుకునే వ్యక్తిగా నిర్వచించబడతాడు. వినియోగదారుడు ఒక వ్యక్తి (వ్యక్తుల సమూహం, సంస్థలు ) కావచ్చు, సాధారణంగా తుది వినియోగదారుని గా వర్గీకరించబడుతుంది . వారి వస్తువుల లేదా ఉత్పత్తి, సేవల కోసం సమర్థవంతంగా పంపిణి చేయుటకు వ్యాపార నైపుణ్యత (మార్కెటింగ్) , విక్రయించడానికి ఒక లక్ష్యం ను కలిగి ఉండాలి. వ్యాపారాన్ని ఆరు రకాలుగా పేర్కొనవచ్చును . వినియోగదారుల మార్కెట్లు, పారిశ్రామిక మార్కెట్లు (పారిశ్రామిక సంస్థలతో రూపొందించబడ్డాయి),వాణిజ్య మార్కెట్లు (సేవా సంస్థలు, నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, లాభాపేక్షలేని సంస్థలు, ప్రభుత్వ మార్కెట్లు (ప్రభుత్వ సంస్థలతో రూపొందించబడ్డాయి) , ఇవియే గాక అంతర్జాతీయ (గ్లోబల్) మార్కెట్లు గా చెప్పవచ్చును[2]. భారతదేశంలో వినియోగదారుని ప్రయోజనాల కొరకు వినియోగ దారుల రక్షణ చట్టం ( కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్) , 1986,1987 ను అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థ ( కమిషన్ ), జిల్లా స్థాయిలో వినియోగ దారుల ఫోరమ్ గా ఉండే స్థాయిలో చట్టాలు , ముఖ్యంగా వస్తువులు , సేవల విషయములో తలెత్తే ఫిర్యాదులను అప్పగించడం వీటికి అప్పగించబడింది[3]. జూలై 20, 2020 న, కొత్త వినియోగదారుల రక్షణ చట్టం, 2019 భారతదేశంలో అమల్లోకి వచ్చింది. , 1986 నాటి చట్టాన్ని మార్పు చేస్తూ ఇవ్వబడినది . కొత్త చట్టం ప్రకారం భారతదేశంలో వినియోగదారుల వివాదాల పరిపాలన, పరిష్కారాన్ని సరిచేస్తుంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం -2019 ల్లో ఏడు ముఖ్య రక్షణలను కలిపించారు, అవి అకర్మ పధ్దతులు , కల్తీకి, ఇతర తప్పుదోవ పట్టించే ప్రకటనలకు జైలు శిక్షతో సహా కఠినమైన జరిమానాలతో , ముఖ్యంగా, అంతర్జాలం ద్వారా ( ఆన్ లైన్ ,ఇ-కామర్స్, టెలిషాపింగ్ , మల్టి మార్కెట్ వంటివి ) , ఇళ్ళ నిర్మాణాలు , ప్లాట్స్ అమ్మకాల వంటివి , ద్వారా వస్తువుల సేవలు , అమ్మకం కోసం నియమాలను పొందుపరిచడం తో పాటు , ఈ వివాదల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాగం కూడా 2019 - వినియోగ దారుల రక్షణ చట్టం లో పొందుపరచారు [4]. వినియోగదారుల ఉద్యమం వినియోగదారుల హక్కులు, అవసరాల గురించి ప్రపంచ అవగాహన పెంచేదిశ గా ప్రతి సంవత్సరం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంతో మార్చి 15 .ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ స్ఫూర్తితో 1962 మార్చి 15 న అమెరికన్ కాంగ్రెస్‌కు ప్రత్యేక సందేశం పంపారు, దీనిలో వినియోగదారుల హక్కుల సమస్యను అధికారికంగా పరిష్కరించాడు . అలా చేసిన మొదటి ప్రపంచ నాయకుడు. వినియోగదారుల ఉద్యమం మొదట 1983 లో గుర్తించి , ప్రతి సంవత్సరం ఈరోజు వినియోగ దారుల సమస్యలు, ప్రయోజనాలు సమీక్షిస్తారు.[5]

భారతదేశములో వినియోగ దారుని హక్కులు

వినియోగ దారుడు అన్ని రకాల ప్రమాదకర వస్తువులు,సేవల నుండి రక్షించబడే హక్కు,అన్ని వస్తువులు, సేవల పనితీరు, నాణ్యత గురించి పూర్తిగా తెలియజేసే హక్కు. వస్తువులు, సేవల ఉచిత ఎంపిక హక్కు, వినియోగదారు ప్రయోజనాలకు సంబంధించిన అన్ని నిర్ణయాత్మక ప్రక్రియలలో వినడానికి హక్కు,వినియోగదారుల హక్కులు ఉల్లంఘించినప్పుడల్లా పరిష్కారాన్ని పొందే హక్కు, వినియోగదారుడు తయారు చేసిన వస్తువు గురించి సమాచారం ఉండే హక్కు.[6]

భారతదేశములో వినియోగ దారుల జాతీయ దినం

వినియోగదారుల ప్రయోజనాలు , వారి హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడానికి భారతదేశం లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. డిసెంబర్ 24, 1986 న, వినియోగదారుల రక్షణ చట్టం 1986 భారత రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రధాన లక్ష్యం లోపభూయిష్ట వస్తువులు, అసంతృప్తికరమైన సేవలు, మోసపూరితమైన వాణిజ్య పద్ధతులు వంటి వివిధ రకాల దోపిడీకి వ్యతిరేకంగా వినియోగదారులకు సమర్థవంతమైన భద్రతలను అందించడం ఈ చట్టం ఉదేశ్యం . మహాత్మా గాంధీ మాటలలో వినియోగదారుడు " వినియోగదారులు ముఖ్యమైన సందర్శకులు, వారు మాపై ఆధారపడరు, మేము వారిపై ఆధారపడతాము. వారు మా పనిలో అంతరాయం కాదు. వినియోగదారులు మా వ్యాపారంలో బయటి వ్యక్తులు కారు , వారు మాకు భాగం, మేము వారికి సేవ చేయడం ద్వారా వారికి సహాయం చేయడం లేదు, అలా చేయడానికి మాకు అవకాశం ఇవ్వడం ద్వారా వినియోగ దారులు మాకు సహాయం చేస్తున్నారు. ".[7]

తెలంగాణ రాష్ట్రములో

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ లో డిసెంబర్ 31, 2020 నాటికి 8715 వినియోగదారుల కేసులు నమోదు అయితే , 4452 కేసులను పరిష్కరించారు . రాష్ట్రములో లోని 12 కమిషన్ పరిధిలో 98240 కేసులు నమోదు అయితే, 93278 ల కేసులకు తీర్పు వెలువడింది [8] .

చెల్లించ వలసిన రుసుము

వినియోగదారుడు తమ వస్తువుల విలువలను పట్టి జిల్లా స్థాయినుంచి జాతీయ స్థాయి వినియోగదారుల కమిషన్ కు తమ కేసులను పెట్టవచ్చును లేదా తనకు పరిష్కారం కాకపొతే వినియోగదారుడు జాతీయ కమిషన్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. క్రింది స్థాయి కమిషన్ తనకు తీర్పు ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు రాష్ట్ర కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు. దీనికి వినియోగదారుడు కోర్టు రుసుము క్రింద 5,000 రూపాయలు ఫీజును చెల్లించవలెను . రాష్ట్ర స్థాయి , జాతీయ కమిషన్ ముందు అప్పీల్ దాఖలు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. జాతీయ కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా వినియోగదారుడు , సుప్రీంకోర్టులో 30 రోజుల లోపు కేసును పెట్ట వచ్చును.[9]

వినియోగదారుడు చెల్లించ వాల్సిన రుసుము
క్రమసంఖ్యవిలువకట్ట వలసిన రుసుము
జిల్లా స్థాయి కమిషన్ లో
1Rs 0- 1,00,000-00 ( అంత్యోదయ , అన్నా కార్డులు కలిగియున్న వారికి )Nil
2Rs 0- 1,00,000-00Rs.100/-
3Rs. 1,00,000-00 to Rs. 5,00,000-00Rs.200/-
4Rs.5,00,000-00 to Rs.10,000,00-00Rs.400/-
5Rs.10,000,00 to Rs.20,00,000-00Rs.500/-
రాష్ట్ర స్థాయి కమిషన్ లో
6Rs.20,000,00 to Rs.50,00,000-00Rs.2000/-
7Rs.50,00,000-00 to 1,00,00000-00Rs.4000/-
జాతీయ స్థాయి కమిషన్ లో
8Rs.1,00,00000/- తర్వాతRs.5000/-

మూలాలు

వెలుపలి లంకెలు