సర్వోదయ

మహాత్మా గాంధీ ఆర్థిక ప్రణాలిక మీద వ్యాసం

సర్వోదయ అనే సంస్కృత పదానికి అర్థం అందరూ ఎదగాలి. 1908 లో మహాత్మా గాంధీ జాన్ రస్కిన్ రాజకీయ ఆర్థిక శాస్త్రం మీద రాసిన అన్ టు దిస్ లాస్ట్ (Unto this last) అనే పుస్తకాన్ని అనువాదం చేస్తూ దానికి సర్వోదయ అని పేరు పెట్టాడమే కాక తన రాజకీయ తత్వాన్ని సూచించడానికి ఈ పేరు వాడుకున్నాడు.[1] ఆయన తర్వాతి అహింసా వాదులు, గాంధేయువాదులైన వినోబా భావే లాంటి వారు, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సామాజికి ఉద్యమాలలో కూడా ఈ భావనను విస్తృతంగా వాడుకున్నారు.

సా.శ 2వ శతాబ్దానికి చెందిన పేరు పొందిన దిగంబర సన్యాసి సమంతభద్రుడు, 24వ జైన తీర్థంకరుని సర్వోదయ అని వ్యవహరించాడు.[2]

గాంధీ రాజకీయ ఆదర్శాలకు మూలం

1904 లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తున్నపుడు ఆయన ఆంగ్ల స్నేహితుడు హెన్రీ పొలాక్ ఆయనకు జాన్ రస్కిన్ రాసిన అన్ టు దిస్ లాస్ట్ (Unto this last) అనే పుస్తకాన్ని ఇచ్చాడు. ఒకసారి డర్బనుకు 24 గంటల సేపు ప్రయాణిస్తున్నపుడు ఈ పుస్తకం చదవడం ప్రారంభించానని, అందులో భావాలు తనకు నిద్రపట్టనీయకుండా చేశాయని గాంధీ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.[3] అంతే కాదు ఆ పుస్తకాల్లోని ఆదర్శాలకు తగినట్టు తన జీవితాన్ని మలుచుకోవాలని అనుకున్నాడు.

నాలుగు సంవత్సరాల తర్వాత గాంధీ ఈ పుస్తకాన్ని తన మాతృభాష గుజరాతీ లోకి అనువాదం చేశాడు. ఈ పుస్తకానికి సర్వోదయ అని నామకరణం చేశాడు. సంస్కృతంలో సర్వ అనే పదానికి అర్థం "అందరూ", "ఉదయ" అనే పదానికి అర్థం "ఉన్నతి" లేదా "ఉద్ధరణ". రెండింటినీ కలిసి సకల జనోద్ధరణ అని భావం వచ్చేలా ఆ పేరు పెట్టాడు.

గాంధీ ఈ భావనను రస్కిన్ నుంచి గ్రహించినా, అది మాత్రం ఆయన రాజకీయ జీవితంపై చెరపలేని ముద్ర వేసింది. అంతే కాకుండా గాంధీ రస్కిన్ ప్రతిపాదించిన కొన్ని సాంప్రదాయ వాదాలకు దూరంగా ఉన్నాడు.

మూలాలు