సాలిడ్-స్టేట్ డ్రైవ్

సాలిడ్-స్టేట్ డ్రైవ్ (Solid-state drive లేదా solid-state disk - SSD) అనేది ఒక డేటా నిల్వ పరికరం, సాధారణంగా దీనిని కంప్యూటర్ లో ఉపయోగిస్తారు. ఇది డేటా నిల్వ కోసం ఫ్లాష్ మెమరీ ఉపయోగిస్తుంది పవర్ టర్న్‌డ్ ఆఫ్ తర్వాత కూడా. సాలిడ్-స్టేట్ డ్రైవ్‌లు సాంప్రదాయ హార్డు డిస్కు డ్రైవుల (HDDs) లాగానే డేటా యాక్సెస్ కొరకు రూపొందించబడ్డాయి. హార్డు డిస్కు డ్రైవ్ స్థానంలో సాధారణంగా నేరుగా సాలిడ్-స్టేట్ డ్రైవ్ తో భర్తీ చేయవచ్చు. సాలిడ్ స్టేట్ డ్రైవ్‌ల గొప్పదనం గురించి చెప్పాలంటే హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల వేగం కంటే చదవడం/వ్రాయడం లో చాలా వేగాన్ని కలిగివుంటాయి. ఇవి ఎటువంటి కదిలే భాగాలు కూడా కలిగి ఉండవు, అంటే ఇవి శబ్దం చేయవు, అంత సులభంగా విచ్ఛినం కావు. అయితే ఎస్‌ఎస్‌డిలు హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల కంటే చాలా ఖరీదుగా ఉన్నాయి. మరొలా చెప్పాలంటే దీని కొనుగోలుకు పెట్టే ధరలో దీని కంటే చాల ఎక్కువ కెపాసిటీ ఉన్న HDD పొందవచ్చు. హైబ్రిడ్ డ్రైవ్ నందు ఒకే యూనిట్ లో HDD, SSD లక్షణాలు మిళితమైవుంటాయి. హైబ్రిడ్ డ్రైవ్ ఎక్కువ కెపాసిటి ఉన్న HDDని, తరచూ సౌలభ్యంగా ఫైళ్ల కాష్ పనితీరును మెరుగుపరచడానికి తక్కువ కెపాసిటి ఉన్న SSDని కలిగివుంటుంది.[1][2]

2.5-అంగుళాల SSD, సాధారణంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో బిగిస్తారు.
DDR SDRAM కు ఆధారంగా ఒక రాక్‌మౌంట్ SSD నిల్వ ఉపకరణం
బయట, లోపలతో ఒక mSATA SSD

మూలాలు