ల్యాప్‌టాప్

ల్యాప్‌టాప్ అనేది సులభంగా తీసుకెళ్లగల ఒక కంప్యూటర్. దీని వినియోగదారు ల్యాప్‌టాప్‌ను దాని కీలు వద్ద మడచి వెంట తీసుకెళ్లవచ్చు. ల్యాప్‌టాప్ ప్రధానంగా ఈ ప్రత్యేక కారణంతో సృష్టించబడింది. కంప్యూటర్‌కి సంబంధించిన ముఖ్యమైన భాగాలన్నింటిని చిన్న పరిమాణంలో చేసి పుస్తకం వంటి రూపంలోకి ఇమడ్చగలిగారు. పుస్తకం యొక్క అట్టను పైకి లేపినట్టుగా దీని యొక్క తెరను మనం పైకి లేపి వాడుకోవచ్చు. ఆధునిక ల్యాప్‌టాప్ అంతర్నిర్మిత రీఛార్జిబుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ల్యాప్‌టాఫ్‌కి రీఛార్జిబుల్ బ్యాటరీ ఉంటుంది కనుక కరెంటు పోయినప్పుడు కూడా వాడుకోవచ్చు. అయితే ఛార్జింగ్ తగ్గినప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొనుటకు ఛార్జర్‌ను కూడా వెంట ఉంచుకోవాలి.

IBM vari ల్యాప్‌టాప్

ల్యాప్‌టాప్‌లో ఒక కంప్యూటర్‌కు ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయి:

ల్యాప్‌టాప్‌లకు ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి:

  • ల్యాప్‌టాప్‌ను ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి సులభంగా తీసుకెళ్లవచ్చు.
  • వీటిని డెస్క్‌టాప్ కంప్యూటర్ కంటే చిన్న స్థలంలో ఉపయోగించవచ్చు.
  • దీనిని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనతోనే భద్రంగా ఉంచుకోవచ్చు.

ల్యాప్‌టాప్‌ యొక్క ప్రతికూలతలు:

  • ధర ఎక్కువ
  • సులభంగా దొంగిలించబడవచ్చు
  • ల్యాప్‌టాప్ కారులో ఉపయోగించవచ్చు, ఫలితంగా అపసవ్య డ్రైవింగ్ జరుగుతుంది
  • ల్యాప్‌టాప్‌ను తరచుగా కదిలిస్తుండటం వలన, లేదా ప్రయాణాలలో కుదుపుల వలన త్వరగా పాడైపోవచ్చు లేదా మరమ్మతులకు గురికావచ్చు.
  • కొన్ని ల్యాప్‌టాప్‌లు సాధారణంగా తక్కువ సాంకేతిక లక్షణాలను కలిగి ఉంటాయి, తక్కువ ధరలలో లభిస్తాయి.[1]
  • గేమింగ్, వీడియో ఎడిటింగ్ లేదా గ్రాఫిక్ డిజైన్ వంటి భారీ పనులలో డెస్క్‌టాప్ కంప్యూటర్ల కంటే ఇవి చాలా నెమ్మదిగా ఉంటాయి.[2]

మూలాలు