హాస్యము

నవరసలలో ఒకటి

హాస్యము అనేది జీవితములో చాలా ప్రధానమైన రసం. హాస్యము (Humour or humor) అనగా వినోదం కలిగించి నవ్వు పుట్టించే లక్షణం కలిగిన ఒక భావానుభవం. హాస్యం అంటే ఏమిటి, అది ఎలా సంభవిస్తుంది, దాని వలన ప్రయోజనాలు ఇబ్బందులు ఏమిటి అనే విషయాలపై పలు అభిప్రాయాలున్నాయి. దైనందిన జీవితంలోను, సినిమాలలోను, సాహిత్యంలోను, వ్యక్తుల వ్యవహారాలలోను హాస్యం ఒక ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటుంది.

"నవ్వు" అనేది హాస్యాన్ని వ్యక్తీకరించే ఒక ముఖ లక్షణం- ఎడ్వార్డ్ వాన్ గ్రూజనర్ చిత్రం.

హాస్యం గురించి సిద్ధాంతాలు

హాస్యం ఉత్పన్నమయ్యే పరిస్థితులు

  • ఒక సందర్భంలో ఉన్న దృక్పథానికి అనుకోని మార్పు సంభవించి (shift in perception or answer), అయినా గాని పాత "మూడ్"కు సంబంధం కలిగి ఉండడం వలన.
  • టెన్షన్‌గా ఉన్న స్థితినుండి ఆకస్మికంగా ఊరట లభించడం - ఈ ఊరట నిజమైనది కావచ్చును. లేదా కేవలం మాటలలే పరిమితమై ఉండవచ్చును.
  • రెండు ఐడియాలు లేదా విషయాలు కలగాపులగం కావడం - అయినా వాటిమధ్య అంతరంతోపాటు సంబంధం కూడా మిగిలి ఉండడం.
  • వేరొకరి పొరపాటు లేదా అజ్ఞానం లేదా దుస్థితి పట్ల మరొకరు నవ్వి నివోదం పొందడం. ఇందులో ఒకరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మరొకరికి ఆధిక్యత కనపరచే భావం ఉంటుంది.

హాస్యం గురిచి ప్లేటో ఇలా అన్నాడు (సోక్రటీస్ చెప్పినట్లుగా) - ఒకరిపట్ల వ్యంగ్యంగా ప్రవర్తించినపుడు రెండవవారు దానిని త్రిప్పికొట్టలేని పరిస్థితి ఉంటుంది. దానిని అర్ధం చేసుకోలేకపోవడమే వ్యంగ్యం. అరిస్టాటిల్ ఇలా అన్నాడు - జుగుప్స కలిగించని అందవిహీనత హాస్యానికి ప్రాథమిక ఉపకరణం.

హాస్యానికి అసంబద్ధత (Incongruity Theory) కారణం అని కాంట్ అభిప్రాయం. ఒక నిశ్చితమైన ఫలితం లేని పరిస్థితి హాస్యం అవుతుంది అని. దీనినే హెన్రీ బెర్గ్‌సన్ మరింత విపులీకరించాడు.[1] ఈ సిద్ధాంతాలపై అనేక పొడిగింపులు, వివరణలు ఉన్నాయి.[2] మోరియల్ అనే విశ్లేషకుడు "ఏకకాలపు కలగాపులగం" (simultaneous juxtapositions) అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు[3]. లాట్టా (Latta) అనే శాస్త్రజ్ఞుడు మాత్రం ఒక పరిస్థితిలో ఒక పజిల్‌కు సమాధానం లభించినపుడు కలిగే దృక్పథపు మార్పు హాస్యానికి ప్రధానమైన అంశం అన్నాడు. ఇంకా ఇలాంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు మాత్రం అసలు హాస్యాన్ని ఇలా విశ్లేషించడం తగదన్నారు.

హాస్యం కలిగించే సందర్భాలు

హస్యం "పండించే" విషయాలు

  • భావాలకు, ఉద్వేగాలకు ఆ విషయం అతుకుకోవాలి.
  • వాస్తవానికి కొంత పోలిక ఉండాలి కాని వాస్తవం కాకూడదు.
  • అనుకోని మలుపు ( surprise, misdirection, contradiction, ambiguity or paradox).
హాస్యం కలిగించే సంభాషణాంశాలు

రోవాన్ అట్కిన్సన్ (Rowan Atkinson) అనే ప్రసిద్ధ హాస్య నటుడు ఒక ఉపన్యాసంలో హాస్యాన్ని కలిగించే హావభావాలు ఇవి అని చెప్పాడు [4]

  • అసాధారణంగా ప్రవర్తించడం
  • ఉండకూడని స్థలంలో ఉండడం
  • ఉండకూడని సైజులో ఉండడం

తెలుగు సినిమాలలో హాస్య

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు