హోమినిని

హోమినిని లేదా హోమినిన్‌లు, హోమినినే ఉప కుటుంబంలోని ఒక తెగ. హోమినినిలో హోమో జీనస్ (మానవులు) జాతి ఒక భాగం. కానీ గొరిల్లా జీనస్ (గొరిల్లాలు) ఇందులో భాగం కాదు. పాన్ జీనస్‌ (చింపాంజీలు, బోనోబోసు) ఇందులో భాగమా కాదా అనే విషయమై 2019 నాటికి ఇంకా ఏకాభిప్రాయం లేదు. ఇది మానవులను, చింపాంజీలను కలిపే సంక్లిష్ట జాతినిర్ణయ ప్రక్రియతోను, ఆదిమ మానవులలో ద్విపాద నడక అభివృద్ధి తోనూ ముడిపడి ఉంది.

హోమినిని
కాల విస్తరణ: 6–0 Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
Two hominins, according to the original definition by Gray: A human (Homo sapiens) holding a chimpanzee (Pan troglodytes)
శాస్త్రీయ వర్గీకరణ e
Kingdom:Animalia
Phylum:Chordata
Class:Mammalia
Order:Primates
Suborder:Haplorhini
Infraorder:Simiiformes
Family:Hominidae
Subfamily:Homininae
Tribe:Hominini
Gray, 1824
Type species
Homo sapiens
Linnaeus, 1756
Genera

Panina

  • Pan

Hominina

  • Homo
  • Australopithecus
  • Kenyanthropus
  • Paranthropus
  • Ardipithecus
  • Sahelanthropus
  • Orrorin
  • Graecopithecus[1]

పాన్, హోమో జీనస్‌ల పరిణామం గురించిన వివరాలు తెలియడానికి చాలా కాలం ముందే జాన్ ఎడ్వర్డ్ గ్రే (1824) ఈ తెగను పరిచయం చేశాడు. గ్రే నిర్వచనం ప్రకారం పాన్, హోమోలు రెండూ హోమినినిలో భాగమే. మాన్, వీస్‌లు 1996 లో చేసిన ప్రతిపాదనలో ఇదే నిర్వచనం ఉంది. ఈ ప్రతిపాదన హోమినినిని మూడు ఉపజాతులుగా విభజించింది: పానినా (పాను కలిగి), హోమినినా ("హోమినిని", హోమో "మానవులను" కలిగి ఉంది), ఆస్ట్రాలోపిథెసినా (అనేక అంతరించిపోయిన "ఆస్ట్రాలోపిథెసిన్" జనరాలు).[2]

మరొక పద్ధతిలో హోమినినిలో పాన్ ను మినహాయిస్తారు. ఈ సందర్భంలో పానిని ("పానిన్సు", డెల్సను 1977)[3] పాన్ జీనస్ ఒక్కదాన్నే కలిగి ఉన్న ప్రత్యేక తెగగా చెప్పవచ్చు.[4][5]

అంతగా మద్దతు లేని మైనారిటీ నామకరణాలలో గొరిల్లాను హోమినినిలో, పాన్‌ను హోమోలో (గుడ్మను తదితరులు 1998), లేదా పాన్ గొరిల్లా రెంటినీ హోమోలోను (వాట్సను, ఇతరులు 2001) చేర్చారు.

పేరు వివరణ

సాంప్రదాయికంగా "హోమినిన్" అనే పదం హోమినిని తెగను (ట్రైబ్) సూచిస్తుంది. హోమినినా ఉపజాతిలోని సభ్యులను (అంటే, పురాతన మానవ జాతులన్నిటినీ) "హోమినినాన్లు" అని పేర్కొంటారు.[6] ఇది మన్, వైస్ (1996) ప్రతిపాదనను అనుసరిస్తుంది. ఈ ప్రతిపాదనలో హోమినిని తెగలో పాన్, హోమో లను రెండు వేరువేరు ఉపతెగల్లో ఉన్నట్లుగా చూపిస్తారు. పాన్ జీనస్‌ను పానినా ఉపజాతి లోను, హోమో జీనస్‌ను హోమినినా అనే ఉపజాతిలోనూ చేర్చారు.[2] అయితే, మరో సంప్రదాయంలో పానినా సభ్యులను మినహాయించి, అంటే హోమో (మానవ) కోసం గాని , ఆస్ట్రలోపిథెసీన్ జాతుల కోసం గాని, లేదా ఈ రెంటి కోసం గానీ "హోమినిని" ని ఉపయోగించారు. ఈ ప్రత్యామ్నాయ సంప్రదాయాన్ని కోయ్నె (2009),[7] డన్బార్ (2014) లు ఉదహరించారు.[5] పాట్స్ (2010) అదనంగా పాన్‌ను మినహాయించి హోమినిని అనే పేరును వేరే అర్థంలో ఉపయోగిస్తుంది. అయితే చింపాంజీల కోసం పానిని పేరుతో ప్రత్యేక తెగను (ఉపతెగ కాదు) ప్రవేశపెట్టాడు.[4] ఈ ఇటీవలి పద్ధతిలో "హోమినిన్" అనే పదాన్ని చింపాంజీల పరిణామమార్గం నుండి విడిపోయిన తరువాత ఉద్భవించిన హోమో, ఆస్ట్రలోపిథెకస్, ఆర్డిపిథెకస్, ఇతరాలకూ వర్తింపజేసారు. (క్రింది క్లాడోగ్రామ్‌ను చూడండి);[8][9]

పరిణామాత్మక వివరణ

Model of the phylogeny of Hominini over the past 10 million years.

80 - 40 లక్షల సంవత్సరాల మద్యకాలంలో చింపాంజీ-మానవ పరిణామం జరుగుతున్నకాలంలోనే సహెలాంత్రోపస్, ఒర్రోరిన్ రెండూ ఉండేవి. నేరుగా పాన్ జీనస్‌కు పూర్వీకులుగా పరిగణించదగ్గ శిలాజ నమూనాలు చాలా తక్కువగా లభించాయి. కెన్యాలో కనుగొన్న మొట్టమొదటి చింపాంజీ శిలాజాల గురించి 2005 లో వార్తలొచ్చాయి. అయితే ఇది బాగా ఇటీవలి కాలానికి (5,45,000 - 2,84,000 సంవత్సరాల క్రితం నాటిది) చెందినదని తేలింది.[10] పాన్ నుండి "ఆదిమ మానవ" లేదా "మానవ పూర్వ" వంశం వేరుపడడం అనేది సూటిగా ఒక ఋజురేఖలో జరిగిన వేర్పాటు కాకుండా, ఒక సంక్లిష్ట పరిణామం-సంకరం ప్రక్రియగా కనిపిస్తుంది. ఇది 1.3 కోట్ల సంవత్సరాల క్రితానికి (దాదాపు హోమినిని తెగ వయస్సుకు సమానం) 40 లక్షల సంవత్సరాల క్రితానికీ మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్యాటర్సన్ (2006) తదితరుల అభిప్రాయం ప్రకారం, వేర్వేరు క్రోమోజోములు వేర్వేరు సమయాలలో వేరుపడ్డాయి. పరిణామ దశలో ఉన్న ఈ రెండు జాతుల మధ్య 63 - 54 లక్షల సంవత్సరాల క్రితం వరకూ విస్తృత-స్థాయి సంకరం జరిగింది.[11] ఆదిమ-మానవులు చింపాంజీలలోని X క్రోమోజోముల సారూప్యతను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ రెండూ పూర్తిగా వేరుపడడం జరిగింది 40లక్షల సంవత్సరాల క్రితమే అయి ఉంటుందని ఈ పరిశోధన బృందం భావించింది. వేక్లీ (2008) ఈ పరికల్పనలను తిరస్కరించాడు; చింపాంజీ-మానవుల చివరి ఉమ్మడి పూర్వీకునికి (సిహెచ్‌ఎల్‌సిఎ) ముందున్న జనాభాలో ఎక్స్ క్రోమోజోం ఎంపిక వత్తిడి వంటి ప్రత్యామ్నాయ వివరణలను ఆయన ఇచ్చాడు.[12] మానవులు, పాన్‌లలో 99% సారూప్యత లున్నాయని చాలా DNA అధ్యయనాల్లో తేలింది.[13][14] కానీ ఒక అధ్యయనంలో మాత్రం 94% సారూప్యత మాత్రమే ఉందని, నాన్‌కోడింగు డి.ఎన్.ఎ. లో కొన్ని తేడాలు ఉన్నాయనీ తెలిసింది.[15] 30 నుండి 44 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఆస్ట్రాలోపిథెసీన్లు హోమో జీనస్‌కు చెందిన తొలి జాతులుగా పరిణామం చెందారనేది దాదాపు ఖాయం.[16][17] 2000 సంవత్సరంలో కనుగొన్న62 లక్షల సంవత్సరాల నాటి ఓరోరిన్ టుజెనెన్సిస్ ఆవిష్కరణ, హోమో జీనస్ ఆస్ట్రలోపిథెసిను పూర్వీకుల నుండి పరిణామం చెందలేదని సూచిస్తూ, కొద్దికాలం పాటు పై పరికల్పనను సవాలు చేసింది.[18][19] అప్పటికి జాబితా చేసిన అన్ని శిలాజాలను 1) అది హోమోకు పూర్వీకుడయ్యే అవకాశం ఉందా. 2) అవి జీవించి ఉన్న ఏ ఇతర ప్రైమేటు కంటే హోమోతోటే దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయా అనే రెండు అంశాల్లో అంచనా కట్టారు. ఈ రెండూ వాటిని హోమినిన్‌లుగా గుర్తించగలిగే లక్షణాలే. పారాంత్రోపస్, ఆర్డిపిథెకస్, ఆస్ట్రలోపిథెకస్‌ వంటి కొన్ని జాతులు హోమోకు పూర్వీకులని, వాటికి హోమోతో దగ్గరి సంబంధం ఉందనీ భావిస్తున్నారు;[20] సహెలాంత్రోపస్‌తో సహా, (ఒర్రోరిన్ కూడా కావచ్చు) కొన్నిటికి కొందరు శాస్త్రవేత్తల మద్దతు ఉంది. కానీ, కొందరికి దాని పట్ల సందేహం ఉంది.[21][22]

వారసత్వ వృక్షం

ఈ క్లాడోగ్రాం (వారసత్వ వృక్షం) సూపరు ఫ్యామిలీ హోమినోయిడియా పరిణామాన్ని, దాని వారసుల పరిణామాన్నీ చూపిస్తుంది. ఇది హోమినిన్‌ల విభజనపైనే దృష్టి పెట్టింది (హోమినిని పూర్వీకులు కాని వారిని వదిలేసింది). హోమినిడే ("హోమినిడ్స్") కుటుంబంలో పొంగినే (ఒరంగుటాన్లతో సహా), గొరిల్లిని (గొరిల్లాలతో సహా), హోమినిని తెగలు (ట్రైబ్‌లు) ఉన్నాయి. వీటిలో గొరిల్లిని, హోమినిని లు హోమినినే కుటుంబం లోని ఉపకుటుంబాలు. హోమినిని ని, పానినా (చింపాంజీలు), ఆస్ట్రాలోపిథెసినా (ఆస్ట్రాలోపిథెసిన్స్) లుగా విభజించారు. హోమినినా లు (మానవులు) ఆస్ట్రలోపిథెసినా నుండి ఉద్భవించినట్లు భావిస్తారు. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం (ఒలిగోసీన్-మయోసీన్ ల హద్దుకు సమీపంలో) పురాతన ప్రంపంచ కోతుల నుండి హోమినాయిడ్లు వేరుపడ్డాయని శిలాజ ఆధారాలు, జన్యు విశ్లేషణలూ సూచిస్తున్నాయి.[23] హోమినినే, పొంగినే అనే ఉప కుటుంబాల ఇటీవలి సాధారణ పూర్వీకులు (ఎం.ఆర్.సి.ఎ) 1.5 కోట్ల సంవత్సరాల క్రితం నివసించాయి.[24] కింది క్లాడోగ్రాంలో పరిణామ జాతులు కొత్త జాతులుగా పరిణామం చెందిన సమయాన్ని సుమారు లక్షల సంవత్సరాల క్రితం (లసంక్రి) లో చూపిస్తోంది.

హోమినోయిడియా (204 లసంక్రి)

హైలోబాటిడే (గిబ్బన్లు)

హోమినిడే (157)

పోంగినే (ఒరంగుటన్లు)

హోమినినే  (88)

గొరిల్లిని (గొరిల్లాలు)

హోమినిని  (63)

పానినా (చింపాంజీలు)

ఆస్ట్రలోపిథెసీన్లు/ (40)

ఆర్డిపిథెకస్ (†)

ఆస్ట్రలోపిథెకస్

ప్రేయాంత్రోపస్ (†)

ఆస్ట్రలోపిథెకస్/పరాంత్రోపస్ రోబస్టస్ (†20)

ఆస్ట్రలోపిథెకస్ గార్హి (†25)

హోమో (మానవులు)

హోమినినా

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

మూస:Great apes