హోమో

హోమో (లాటిన్‌లో హోమో అంటే మనిషి అని అర్థం) జీనస్, అంతరించిపోయిన ఆస్ట్రలోపిథెకస్ జీనస్ నుండి ఆవిర్భవించింది. ప్రస్తుత్ం ఉనికిలో ఉన్నహోమో సేపియన్స్ (ఆధునిక మానవులు) ఈ జీనస్ లోని జాతి. ఇది కాక, అనేక అంతరించిపోయిన జాతులు కూడా ఈ జీనస్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక మానవుల పూర్వీకులు, లేదా వారికి దగ్గరి బంధువులు. హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తాలెన్సిస్ ఈ అంతరించిపోయిన జాతుల్లో ముఖ్యమైనవి. 20 లక్షల సంవత్సరాలకు కొద్దిగా ముందు, హోమో హ్యాబిలిస్ కనిపించడంతో ఈ జీనస్ ఉద్భవించింది.[2] పరాంత్రోపస్ జీనస్‌తో కలిసి హోమో జీనస్ బహుశా ఆస్ట్రలోపిథెకస్ జాతికి చెందిన ఎ. ఆఫ్రికానస్‌కు సోదరి అయి ఉంటుంది. ఆస్ట్రలోపిథెకస్ గతంలో పాన్ వంశం (చింపాంజీలు) నుండి విడిపోయింది.[3]

హోమో
కాల విస్తరణ: పియాసెంజియన్-ప్రస్తుతం, 2.8–0 Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
శాస్త్రీయ వర్గీకరణ e
Kingdom:Animalia
Phylum:Chordata
Class:Mammalia
Order:Primates
Suborder:Haplorhini
Infraorder:Simiiformes
Family:Hominidae
Subfamily:Homininae
Tribe:Hominini
Genus:Homo
లిన్నేయస్, 1758
Type species
హోమో సేపియన్స్
లిన్నేయస్, 1758
జాతి

For other species or subspecies suggested, see below.

Synonyms
Synonyms
  • Africanthropus Dreyer, 1935
  • Atlanthropus Arambourg, 1954
  • Cyphanthropus Pycraft, 1928
  • Palaeanthropus Bonarelli, 1909
  • Palaeoanthropus Freudenberg, 1927
  • Pithecanthropus Dubois, 1894
  • Protanthropus Haeckel, 1895
  • Sinanthropus Black, 1927
  • Tchadanthropus Coppens, 1965
  • Telanthropus Broom & Anderson 1949

హోమో ఎరెక్టస్ సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం కనిపించింది. అనేక తొలి కాలపు వలసలలో, ఇది ఆఫ్రికా (ఇక్కడ దీనిని హోమో ఎర్గాస్టర్ అని పిలుస్తారు) యురేషియా లంతటా వ్యాపించింది. ఆహార సేకరణ సమాజంలో నివసిస్తూ, నిప్పును ఉపయోగించిన తొలి మానవ జాతి ఇది. పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకుంటూ, విజయవంతంగా జీవించిన హోమో ఎరెక్టస్ జాతి, ఒక మిలియన్ సంవత్సరాలకు పైగా జీవించింది. పరిణామ క్రమంలో 500,000 సంవత్సరాల క్రితం కొత్త జాతుల లోకి మార్పు చెందుతూ కొత్త జాతులలోకి మళ్ళించబడింది.[4]

హోమో సేపియన్స్ (శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు) 300,000 నుండి 200,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉద్భవించాయి.[5] సుమారుగా అదే సమయంలో ఐరోపా, పశ్చిమ ఆసియాల్లో హోమో నియాండర్తాలెన్సిస్ ఉద్భవించింది. హెచ్. సేపియన్లు ఆఫ్రికా నుండి అనేక తరంగాలలో బయటకు విస్తరించారు. బహుశా 250,000 సంవత్సరాల క్రితం, ఖచ్చితంగా 130,000 సంవత్సరాల క్రితం మొదలై, 70-50 వేల సంవత్సరాల క్రితం జరిగినన దక్షిణాన మానవ వ్యాప్తితో,[6][7][8][9] 50,000 సంవత్సరాల క్రితం నాటి యురేషియా, ఓషియానియా లను శాశ్వత వలసలను స్థాపించే వరకూ సాగింది. ఆఫ్రికా, యురేషియాల్లో వారు పురాతన మానవులను కలుసుకున్నారు. వారితో సంపర్కం పెట్టుకుని సంకర సంతానాన్ని పొందారు.[10][11] కొన్ని పురాతన (సేపియన్స్ కానివారు) మానవ జాతులు సుమారు 40,000 సంవత్సరాల క్రితం (నియాండర్తల్ విలుప్తి) వరకు మనుగడలో ఉన్నాయని భావిస్తున్నారు. 12,000 సంవత్సరాల క్రితం వరకూ (రెడ్ డీర్ కేవ్ ప్రజలు) కొన్ని సంకర జాతులు మనుగడ సాగించాయని భావిస్తున్నారు.

పేర్లు, వర్గీకరణ

హోమినినే ఉపకుటుంబం, దాని లోని తెగ హోమినిని వివరంగా చూపించే పరిణామ వృక్షం. పోంగినే వంశపరంపర నుండి వేరుపడ్డాక హోమినినే, హోమినిని, గొరిల్లిని అనే తెగలుగా విడిపోయింది. హోమినిని నుండి పాన్, హోమో జీనస్‌లు వేరుపడ్డాయి. హోమినిని తెగలో మూడు ఉపతెగలున్నాయి: హోమినినా (ఇందులో హోమో జీనస్ ఉంది), పానినా (ఇందులో పాన్ జీనస్ ఉంది), ఆస్ట్రలోపిథెసినా (ఇందులో అనేక అంతరించిపోయినజీనస్‌ లున్నాయి). ఈ ఉపతెగలను ఈ చార్టులో చూపించలేదు.
గత 2 లక్షల సంవత్సరాలుగా (నిలువు అక్షం) హోమో జీనస్ పరిణామం. హెచ్ సేపియన్స్ చేసిన వేగవంతమైన " అవుట్ ఆఫ్ ఆఫ్రికా" విస్తరణ చిత్రం పైభాగంలో ఉంది. నియాండర్తల్, డెనిసోవన్స్, పేర్కొనబడని పురాతన ఆఫ్రికన్ హోమినిన్లతో సమ్మేళనాన్ని కూడా చూపుతుంది.. బలిష్ఠ ఆస్ట్రోపిథెసీన్లు (పరాంత్రోపస్), హోమో కలిసి 12 లక్షల సంవత్సరాల క్రితం వరకూ జీవించాయి.

లాటిన్ నామవాచకం హోమో (జెనిటివ్ హోమినిస్ ) అంటే "మానవుడు" లేదా "మనిషి" అని అర్థం హోమో సేపియన్స్ అనే ద్విపద పేరును కార్ల్ లిన్నెయస్ (1758) సృష్టించాడు.[12] [lower-alpha 1] 19 వ శతబ్ది ద్వితీయార్థం నుండి ఈ జీనస్‌లోని ఇతర జాతులకూ పేర్లు పెట్టారు. ( హెచ్.   నియాండర్తలెన్సిస్ 1864, హెచ్. ఎరెక్టస్ 1892).

నేటికీ, హోమో జాతిని ఖచ్చితంగా నిర్వచించలేదు.[14][15][16] మానవ శిలాజాలు దొరకడం మొదలైనప్పటి నుండి, హోమో జాతి సరిహద్దులను, నిర్వచనాలనూ సరిగా నిర్ణయించలేదు. అవి నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. అసలు అందులో కొత్తగా సభ్యులు చేరుతాయని ఊహించేందుకు కారణంకూడా ఏదీ కనబడలేదు. అందుచేతనే కార్ల్ లిన్నేయస్ 8 వ శతాబ్దిలో హోమోను సృష్టించినపుడు దాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని కూడా అతడు అనుకోలేదు. నియాండర్తల్‌ను కనుక్కోవడంతో ఈ జీనస్‌లోకి ఓ కొత్త జాతి వచ్చి చేరింది.

హోమో జీనస్ లోని సభ్య జాతులను మానవులుగా వర్గీకరించవచ్చునని సూచిస్తూ దానికి ఆ ట్యాక్సానమీ పేరు పెట్టారు. 20 వ శతాబ్దిలో మయోసీన్ చివరలో, ప్రారంభ ప్లయోసీన్ కాలాల్లో మానవ-పూర్వ, తొలి మానవ జాతుల శిలాజాలు విరివిగా దొరకడంతో వర్గీకరణలపై చర్చ జరిగింది. ఆస్ట్రలోపిథెకస్ నుండి హోమో ను వివరించడం పై చర్చ ఇంకా కొనసాగుతోంది. పాన్ నుండి హోమో ను వివరించడంపై కూడా చర్చ జరుగుతోంది. చింపాంజీ లోని రెండు జాతులను పాన్ లోకి కాకుండా హోమో జెనస్ లోకి వర్గీకరించాలని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు.

19 వ శతాబ్ది చివరి నుండి 20 వ శతాబ్ది మధ్య వరకు లభించిన అనేక తొలి మానవ శిలాజాలకు కొత్త జనరిక్ పేర్లతో సహా అనేక కొత్త వర్గీకరణ పేర్లను ప్రతిపాదించారు; ప్రారంభ వలసల్లో చాలా భౌగోళిక ప్రాంతాలకు విస్తరించిన హోమో ఎరెక్టస్ లన్నీ ఒకే జాతికి చెందినవని గుర్తించడంతో ఈ పేర్లలో చాలావాటిని హోమో లోకి విలీనం చేసారు. ఇప్పుడు వాటిని హోమో కు "నానార్థాలు"గా పరిగణిస్తున్నారు. అవి: పిథెకాంత్రోపస్,[17] ప్రోట్ంత్రోపస్, [18] సినాంత్రోపస్, [19] సైఫాంత్రోపస్, [20] ఆఫ్రికాంత్రోపస్, [21] టెలాంత్రోపస్, [22] అట్లాంత్రోపస్, తచాంత్రోపస్. [23]

అసంపూర్ణ సమాచారం కారణంగా హోమో జీనస్‌ను జాతులు, ఉపజాతులుగా వర్గీకరించడం పేలవంగా జరిగింది. మూడు పదాల పేర్లను నివారించేందుకు గాని, ఇదమిత్థంగా తెలీని జాతిగా చెప్పడాన్ని (ఇన్‌సర్టే సెడిస్) నివారించేందుకు గానీ శాస్త్రీయ పత్రాల్లో కూడా మామూలు పేర్లనే ("నియాండర్తల్", "డెనిసోవన్" లాంటి) వాడారు. హెచ్. నియాండర్తలెన్సిస్ వర్సెస్ హెచ్ సేపియన్స్ నియాండర్తలెన్సిస్, లేదా హెచ్. జార్జికస్ వర్సెస్. హెచ్ ఎరెక్టస్ జార్జికస్ వంటివి కొన్ని ఉదాహరణలు.[24] ఇటీవలే అంతరించిపోయిన హోమో జెనస్‌ లోని కొన్ని జాతులను ఇటీవలే కనుగొన్నారు. వీటికి ద్విపద నామాల విషయంలో ఏకాభిప్రాయం లేదు. హోలోసీన్ ప్రారంభమైనప్పటి నుండి, హోమో సేపియన్స్ (శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు) హోమో జీనస్‌కు చెందిన ఏకైక జీవించి ఉన్న జాతి.

తెగలు, కుటుంబాల ద్వారా టాక్సాను వర్గీకరించాలని మొదటగా చెప్పింది జాన్ ఎడ్వర్డ్ గ్రే (1825) [25] హోమినిని ( "హోమినిన్లు") ని ఒక తెగగా గుర్తించాలని, మానవ పూర్వీకులైన పూర్వ-మానవ జాతులు, తొలి మానవ జాతులూ అన్నిటినీ (చింపాంజీ-మానవ ఆఖరి ఉమ్మడి పూర్వీకుడి వరకూ ఇందులోకి చేర్చాలనీ; హోమినినా ను హోమినిని లో ఒక ఉపతెగగా గుర్తించాలని, ఇందులోకి హోమో జీనస్ ఒక్కదాన్నే చేర్చాలని, ప్లయోసీన్ కాలపు తొలి ద్విపాద జీవులైన ఆస్ట్రలోపిథెకస్, ఒర్రోరిన్ టుగెన్సిస్, సహెలాంత్రోపస్ లను ఇందులోకి చేర్చరాదనీ వుడ్, రిచ్మండ్ లు (2000) ప్రతిపాదించారు.[26] హోమినినాకు ప్రత్యామ్నాయ పేర్లు ఉండేవి లేదా ప్రతిపాదించారు: ఆస్ట్రలోపిథెసినే (గ్రెగొరీ & హెల్మాన్ 1939), ప్రీయాంత్రోపినే (సెలా-కొండే & అల్టాబా 2002);[27][28][29] తరువాత, నాలుగు ప్రధాన జీనస్‌ లైన ఆస్ట్రలోపిథెకస్, ప్రేయాంత్రోపస్, ఆర్డిపిథెకస్, సహెలాంత్రోపస్ లను హోమో తో కలిపి హోమినిని లోకి చేర్చాలని సెలా-కాండే, అయాలా (2003) ప్రతిపాదించారు.

పరిణామం

ఆస్ట్రలోపిథెకస్

దస్త్రం:Australopithecus afarensis adult male - head model - Smithsonian Museum of Natural History - 2012-05-17.jpg
ఎ. అఫారెన్సిస్ పునర్నిర్మాణం [30]

ఆస్ట్రలోపిథెకస్ గార్హి, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్తో సహా అనేక జాతులు హోమో వంశానికి ప్రత్యక్ష పూర్వీకులని గాని, లేదా సోదర వంశాలని గానీ ప్రతిపాదించారు.[31][32] ఈ జాతులు హోమో వాటిని సమలేఖనం స్వరూప సంబంధ శాస్త్ర లక్షణాల కలిగి, కానీ హోమో పలికాయి సంబంధించి ఎలాంటి ఏకాభిప్రాయం లేదు.

ముఖ్యంగాఆస్ట్రేలియాపిథెకస్లో హోమో ను నిర్వచించడం 2010 ల నుండి, మరింత వివాదాస్పదమైంది. సాంప్రదాయికంగా, రాతి పనిముట్ల ( ఓల్డోవన్ పరిశ్రమ) యొక్క మొట్టమొదటి వాడకంతో హోమో ఉద్భవం మొదలైనట్లు భావిస్తున్నారు. అంటే దీంతో దిగువ పాతరాతియుగం మొదలైనట్లు. కానీ 33 లక్షల సంవత్సరాల క్రితమే, అంటే హోమో అవతరించడానికి దాదాపు పది లక్షల సంవత్సరాల ముందే ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్‌ రాతి పనిముట్లను వాడినట్లు కనిపించే ఆధారాలు 2010 లో లభించాయి.[33] 2015 లో, ఇథియోపియాలోని అఫార్‌లో 28 లక్షల సంవత్సరాల క్రితం నాటి దవడ శిలాజం - ఎల్‌డి 350-1 లభించింది. దీనిలో "ప్రారంభ ఆస్ట్రేలియాపిథెకస్‌లో కనిపించే ఆదిమ లక్షణాలు, తరువాత హోమోలో గమనించిన ఉత్పన్న శరీరనిర్మాణమూ కలిసి ఉన్నట్లు వర్ణించారు.[34] కొంతమంది రచయితలైతే, హోమో ఉద్భవం 30 లక్షల సంవత్సరాల క్రితమే లేక ఇంకా ముందే జరిగిందని భావించారు.[35] ఇంకొందరైతే, సుమారు 19 లక్షల సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ తోటే హోమో జీనస్ మొదలైందని ప్రతిపాదిస్తూ, అసలు హోమో హ్యాబిలిస్‌ను హోమో జీనస్ చేర్చవచ్చో, లేదో అనే సందేహాన్ని లేవనెత్తారు.[36]

మునుపటి ఆస్ట్రాలోపిథెసిన్ జాతుల నుండి హోమోల వరకు జరిగిన పరిణామంలో అత్యంత ముఖ్యమైన శారీరక అభివృద్ధి ఎండోక్రానియల్ పరిమాణంలో పెరుగుదల. ఈ పెరుగుదల క్రమం ఇలా ఉంది: ఎ. గార్హి లో 460 cm3 (28 cu in) నుండి, హెచ్. హ్యాబిలిస్‌లో 660 cm3 (40 cu in), హెచ్. ఎరెక్టస్‌లో 760 cm3 (46 cu in), హెచ్. హైడెల్బెర్గెన్సిస్‌లో 1,250 cm3 (76 cu in), హెచ్. నియాండర్తాలెన్సిస్లో 1,760 cm3 (107 cu in). అయితే, కపాల సామర్థ్యంలో స్థిరమైన పెరుగుదల ఆస్ట్రలొపిథెసినాలో అప్పటికే ఉంది. హోమో ఆవిర్భావం తరువాత అది ఆగలేదు. అంటే, ఒక జీనస్ ఆవిర్భావాన్ని నిర్వచించడానికి ఇది విషయాత్మక ప్రమాణంగా పనికిరాదు.[37]

హోమో హబిలిస్

దస్త్రం:Homo habilis.JPG
హోమో హబిలిస్ పునర్నిర్మాణం. జర్మనీలో హెర్న్ లోని ఎల్డబ్ల్యుఎల్-మ్యూజియంలో ప్రదర్శన (2007 ఛాయాచిత్రం).[38]

హోమో హ్యాబిలిస్ 21 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. హెచ్. హ్యాబిలిస్‌ను హోమో జాతికి వెలుపల, విస్తృత ఆస్ట్రలోపిథెకస్‌లో ఉంచరాదని 2010 కి ముందే సూచనలు వచ్చాయి.[39][40] హెచ్. హబిలిస్‌ను హోమోలో చేర్చడానికి ప్రధాన కారణం, అది పనిముట్లు వాడిందనే విషయంపై ఏ వివాదమూ లేకపోవడం. అయితే, హెచ్. హబిలిస్‌కంటే కనీసం పది లక్షల సంవత్సరాల ముందే ఆస్ట్రలోపిథెకస్ పనిముట్లను వాడిందన్న విషయాన్ని కనుగొన్నప్పుడు ఈ కారణానికి కాలదోషం పట్టింది.[33] ఇంకా, హెచ్. హబిలిస్‌ను హోమో ఎర్గాస్టర్ (హోమో ఎరెక్టస్ ) కు పూర్వీకుడని చాలాకాలంగా భావించారు. హెచ్. హ్యాబిలిస్, హెచ్. ఎరెక్టస్ లు చాలా కాలం పాటు సమకాలికులుగా ఉన్నాయని 2007 లో కనుగొన్నారు. హెచ్ . ఎరెక్టస్, హెచ్. హ్యాబిలిస్ నుండి ఉద్భవించలేదని, ఈ రెంటికీ ఒక ఉమ్మడి పూర్వీకుడు ఉండవచ్చనీ ఇది సూచించింది.[41] 2013 లో దమానిసి పుర్రె 5 ప్రచురణతో, ఆసియాకు చెందిన హెచ్. ఎరెక్టస్ ఆఫ్రికాకు చెందిన హెచ్. ఎర్గాస్టర్ నుండి ఉద్భవించిందనే వాదన బలహీనపడింది. బదులుగా, హెచ్. ఎర్గాస్టర్, హెచ్. ఎరెక్టస్ లు ఒకే జాతిలోని వైవిధ్యాలుగా కనిపిస్తాయి. ఇవి ఆఫ్రికా లేదా ఆసియాలో ఉద్భవించి,[42] 5 లక్షల సంవత్సరాల క్రితం నాటికి యురేషియా అంతటా ( యూరప్, ఇండోనేషియా, చైనాతో సహా) విస్తరించి ఉండవచ్చు.[43]

హోమో ఎరెక్టస్

20 లక్షల సంవత్సరాల క్రితం హోమో హ్యాబిలిస్ నుండి హోమో ఎరెక్టస్ అనాజెనెటిక్‌గా అభివృద్ధి చెందిందని భావిస్తున్నారు. కాకసస్‌లో కనుగొన్న హెచ్. ఎరెక్టస్ తొలి నమూనా అయిన హోమో ఎరెక్టస్ జార్జికస్ ఆవిష్కరణతో ఈ భావన బలపడింది. ఇది హెచ్. హ్యాబిలిస్‌తో పరివర్తన లక్షణాలను ప్రదర్శించినట్లు అనిపించింది. హెచ్. ఎరెక్టస్ మొట్టమొదటి నిదర్శనాలు ఆఫ్రికా వెలుపల కనబడినందున, హెచ్. ఎరెక్టస్ యురేషియాలో అభివృద్ధి చెంది, ఆపై ఆఫ్రికాకు తిరిగి వలస వచ్చాడని భావించారు. కెన్యాలోని తుర్కానా సరస్సుకి తూర్పున ఉన్న కూబీ ఫోరాలో లభించిన శిలాజాల ఆధారంగా, హెచ్. ఎరక్టస్ ఆవిర్భావం తరువాత కూడా హెచ్ హాబిలిస్ ఉనికిలో ఉండి ఉండవచ్చునని స్పూర్ తదితరులు. (2007) భావించారు. హెచ్. ఎరెక్టస్ పరిణామం అనాజెనెటిక్ కాదని, వారు అన్నారు. తొలి కాలాబ్రియన్ సమయంలో 5 లక్షల సంవత్సరాల పాటు (19 - 14 లక్షల సంవత్సరాల క్రితం) హెచ్. ఎరెక్టస్, హెచ్. హాబిలిస్‌తో పాటు ఉనికిలో ఉండేదని వారు వాదించారు [44]

హోమో గౌటెంజెన్సిస్ అనే దక్షిణాఫ్రికా జాతి,హోమో ఎరెక్టస్‌తో సమకాలీన జాతి అని 2010 లో చెప్పారు.[45]

పైలోజెనీ

గొప్ప కోతులలో అంతర్భాగంగా హోమో టాక్సానమీని కింది విధంగా వివరించవచ్చు. పరాంత్రోపస్, హోమోలు రెండూ ఆస్ట్రలోపిథెకస్ నుండి అభివృద్ధి చెందుతున్నట్లుగా చూపించబడింది.[3][4][46][47][48][49][50][51][52][53][54] ఆస్ట్రలోపిథెకస్‌లోని ఖచ్చితమైన ఫైలోజెనీ ఇప్పటికీ చాలా వివాదాస్పదంగా ఉంది. కుమార్తె క్లేడ్‌ల సుమారు రేడియేషన్ తేదీలు మిలియన్ల సంవత్సరాల క్రితంలో చూపించబడ్డాయి.[55] గ్రేకోపిథెకస్, సహెలాంత్రోప్స్, ఒర్రోరిన్ - బహుశా ఆస్ట్రలోపిథెకస్ సోదరీలు అయి ఉండవచ్చు - లను ఇక్కడ చూపలేదు. క్లాడిస్టిక్ విశ్లేషణలు జరపడానికి ముందే కొన్ని సమూహాలను ఊహించినందున సమూహాల పేర్లు కొన్నిసార్లు గజిబిజిగా ఉంటుందని గమనించాలి.

హోమినోయిడియా

హైలోబాటిడే (గిబ్బన్లు)

హోమినిడే

పోంగినే (ఒరాంగుటన్లు)

హోమినినే

గొరిల్లిని (గొరిల్లాలు)

హోమినిని

పానినా (చింపాంజీలు)

ఆస్ట్రలోపిథెసీన్లు ( ఆస్ట్రలోపిథెకస్, కెన్యాంత్రోపస్, పరాంత్రోపస్, హోమో లతో సహా)

(7.8)
(8.8)
(15.7)
(20.4 Mya)
ఆస్ట్రలోపిథెసీన్లు

ఆర్డిపిథెకస్ రామిడస్

ఎ. అనామెన్సిస్ s.l.

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ s.s. (†3.8)

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్

ఆస్ట్రలోపిథెకస్ గార్హి

ఆస్ట్రలోపిథెకస్ డెయిరేమెడా (†3.4)

కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ (†3.3)

ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ (†2.1)

పరాంత్రోపస్ (†1.2)

హోమో

హోమో హ్యాబిలిస్ (†1.5)

హోమో రుడాల్ఫెన్సిస్ (†1.9)

హెచ్. ఎరెక్టస్ s.l.

హోమో ఎర్గాస్టర్ (†1.4)

ఆఫ్రికా హోమో ఎరెక్టస్ s.s. (†)

ఆసియా హోమో ఎరెక్టస్ s.s. ((†)0.03)

రెడ్ డీర్ గుహ ప్రజలు ((†)0.01)

(1.2)

హోమో యాంటెసెస్సర్ (†0.8)

హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ s.l.

హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ s.s. ((†)0.2)

హోమో నియాండర్తలెన్సిస్ ((†)0.05)

డెనిసోవన్స్ ((†)0.05)

(0.3)

హోమో సేపియన్స్

(0.74)
(1.9)

ఆస్ట్రలోపిథెకస్ సెడీబా (†2.0)

హోమో ఫ్లోరేసియెన్సిస్ (†0.05)

(3.4)
(3.9)
(7.3 Mya)

అనేక హోమో వంశాలు ఇతర వంశాలలోకి ప్రవేశించడంతో దని సంతతి ఇంకా ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తుంది. 15 లక్షల సంవత్సరాల క్రితం ఇతర మానవ వంశాల నుండి వేరుపడిన ఒక పురాతన వంశం - బహుశా హెచ్. ఎరెక్టస్ అయి ఉండవచ్చు - 55,000 సంవత్సరాల క్రితం డెనిసోవన్లతో సంపర్కం జరిపి ఉండవచ్చు.[48][56][57][58][59] హోమో ఎరెక్టస్ ఎస్.ఎస్. 27,000 సంవత్సరాల క్రితం వరకు ఉనికిలో ఉంది. హోమో ఫ్లోరెన్సియెన్సిస్ 50,000 సంవత్సరాల క్రితం వరకు ఉనికిలో ఉంది. పైగా, 14,000 సంవత్సరాల నాటి తొడ ఎముక ఒకటి, మలుడాంగ్ గుహలో (రెడ్ డీర్ కేవ్ ప్రజలు) కనబడింది. ఇది ప్రారంభ హోమో ఎరెక్టస్ లేదా అంతకంటే పురాతన వంశం అయిన 15 లక్షల సంవత్సరాల నాటి హోమో హ్యాబిలిస్ వంటి పురాతన జాతులను పోలి ఉంది.[60][61] 15 లక్షల సంవత్సరాల హోమో ఎరెక్టస్ లాంటి అంశ డెనిసోవాన్ల ద్వారా ఆధునిక మానవుల్లోకి, మరీ ముఖ్యంగా పాపువన్లు, ఆదిమ ఆస్ట్రేలియన్లలోకి ప్రవేశించినట్లు కనిపిస్తుంది. హెచ్. హైడెల్బెర్గెన్సిస్ అంశ హెచ్. సేపియన్స్ లోకి ప్రవేశించినట్లు ఆధారాలు ఉన్నాయి.[62] 45,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా యేతర మానవుల జన్యువుల్లో నియాండర్తల్ అంశ, కొన్ని సందర్భాల్లో డెనిసోవన్స్ ల అంశలూ కనిపిస్తాయి.[63] అదేవిధంగా ఆఫ్రికను జాతుల జన్యు నిర్మాణంలో ఇంకా గుర్తించని పురాతన మానవ జాతి (హెచ్. హైడెల్బెర్గెన్సిస్ వంటిది) అంశ ఉన్నట్లు గుర్తించారు.

ఆస్ట్రలోపిథెకస్ సెడీబా పేరును హోమో సెడీబా అని మార్చే అవకాశం కనిపిస్తోంది. హోమో హ్యాబిలిస్, హోమో ఫ్లోరెసియెన్సిస్ లతో పోలిస్తే ఇది ఉండే స్థానాన్ని బట్టి ఈ నిశ్చయానికి వచ్చే సూచన లున్నాయి.[50][51][64]

విస్తరణ

సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం నాటికి, హోమో ఎరెక్టస్ తూర్పు ఆఫ్రికా (హోమో ఎర్గాస్టర్ ), పశ్చిమ ఆసియా (హోమో జార్జికస్) రెండుచోట్లా ఉనికిలో ఉంది. ఇండోనేషియాలో లభించిన హోమో ఫ్లోరేసియెన్సిస్ యొక్క పూర్వీకులు ఇంకా ముందే ఆఫ్రికాను విడిచిపెట్టి ఉండవచ్చు.[65]

  హోమో ఎరెక్టస్ (పసుపు),   హోమో నియాండర్తాలెన్సిస్ (కాషాయ),   హోమో సేపియన్స్ (ఎరుపు).

తరువాతి 15 లక్షల సంవత్సరాలలో హోమో ఎరెక్టస్, తత్సంబంధిత లేదా తదుత్పన్న ప్రాచీన మానవ జాతులు ఆఫ్రికా, యురేషియా లంతటా వ్యాపించాయి [66][67] (చూడండి: ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం ). హోమో హైడెల్బెర్గెన్సిస్ సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితం నాటికి యూరప్ చేరుకుంది.

హోమో నియాండర్తాలెన్సిస్, హోమో సేపియన్స్ లు సుమారు 3,00,000 సంవత్సరాల క్రితం తరువాత అభివృద్ధి చెందాయి. 3,00,000 సంవత్సరాల క్రితం నాటికి హోమో నలేడి దక్షిణాఫ్రికాలో ఉనికిలో ఉంది.

హెచ్. సేపియన్స్ ఆవిర్భవించగానే ఆఫ్రికా అంతటా వ్యాపించింది. అనేక తరంగాలలో పశ్చిమ ఆసియాకూ వ్యాపించింది. బహుశా 2,50,000 సంవత్సరాల క్రితం నాటికి, 1,30,000 సంవత్సరాల క్రితం నాటికైతే ఖచ్చితంగా, ఈ వ్యాప్తి జరిగింది. మానవ శాస్త్రజ్ఞులు 2019 జూలైలో, గ్రీసులోని, పెలోపొన్నీస్ వద్దనున్న అపిడిమా గుహలో, 2,10,000 సంవత్సరాల నాటి ఒక హెచ్. సేపియన్స్ అవశేషాలను, 1,70,000 సంవత్సరాల నాటి ఒక హెచ్. నియాండర్తలెన్సిస్ అవశేషాలనూ కనుగొన్నారు. అప్పటివరకు లభించిన హెచ్. సేపియన్ అవశేషాల కంటే ఇవి 1,50,000 సంవత్సరాలు పాతవి.[68][69][70]

అన్నిటికంటే ప్రముఖమైనవి, 60,000 సంవత్సరాల క్రితం దక్షిణ దిశగా హోమో సేపియన్లు చేపట్టిన విస్తరణ. ఓషియానియా, యురేషియాల్లో ఆధునిక మానవులు శాశ్వతంగా స్థిరపడేందుకు దారితీసిన విస్తరణ అది.[71] హెచ్. సేపియన్లు ఆఫ్రికాలోను, యూరేషియాలోనూ పురాతన మానవులతో జాత్యంతర సంపర్కం జరిపారు. ముఖ్యంగా యురేషియాలో నియాండర్తల్‌లు, డినిసోవన్లతో సంపర్కం జరిపారు.[72]

ప్రస్తుతం ఉనికిలో ఉన్న హోమో సేపియన్ల జనాభాలో, అత్యంత దీర్ఘమైన తాత్కాలిక అంతరం ఉన్నది దక్షిణాఫ్రికాలోని శాన్ ప్రజలు. వీరికీ ఇతర మానవులకూ మధ్య ఉన్న అంతరాలు దాదాపు 1,30,000 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు అంచనా వేసారు.[73] ఇది 3,00,000 సంవత్సరాల క్రితం కూడా అయి ఉండవచ్చు.[74] ఆఫ్రికాయేతరుల్లో ఈ అంతరాలు ఆఫ్రికన్ -మెలానేసియన్ల విషయంలో 60,000 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. యూరోపియన్లు, తూర్పు ఆసియన్ల విభజన 50,000 సంవత్సరాల క్రితం నాటిది. హోలోసిన్ సమయంలో యురేషియా అంతటా పరస్పర సంపర్కాలు జరుగుతూనే ఉన్నాయి. సంఘటనలు ఉన్నాయి.

పురాతన మానవ జాతులు హోలోసీన్ (రెడ్ డీర్ గుహ ప్రజలు) ప్రారంభం వరకు మనుగడ సాగించి ఉండవచ్చు. అయితే 40,000 సంవత్సరాల క్రితం నాటికి అవి ఎక్కువగా అంతరించిపోయాయి. లేదా విస్తరిస్తున్న హెచ్. సేపియన్స్ వీరిని కలిపేసుకుంది.

వంశపరంపరల జాబితా

హెచ్. రుడాల్ఫెన్సిస్, హెచ్. ఎర్గాస్టర్, హెచ్. జార్జికస్, హెచ్. అన్టేస్సర్, హెచ్. సెప్రానెన్సిస్, హెచ్. రొడీన్సియసిస్, హెచ్. నియాండర్తలెన్సిస్, డేనిసోవ హుమానియన్, రెడ్ డీర్ గుహ ప్రజలు, హెచ్. ఫ్లోరెసియన్సిస్ జాతుల స్థితి చర్చనీయాంశాలుగానే ఉంది. హెచ్. హైడెల్బెర్గెన్సిస్, హెచ్. నియాండర్తాలెన్సిస్ లు ఒకదానితో ఒకటి దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి వీటిని హెచ్. సేపియన్స్ యొక్క ఉపజాతులుగా పరిగణిస్తున్నారు.

చారిత్రికంగా ఒకే ఒక్క శిలాజాన్ని ఆధారంగా చేసుకుని కూడా "కొత్త మానవ జాతులను" సూచించే ధోరణి ఉంది. ఒక "కనిష్ఠీకరణ" పద్ధతిలో మానవ టాక్సానమీ మొత్తాన్నీ మూడు జాతులుగా చూపించవచ్చు. అవి: హోమో హ్యాబిలిస్ (21-15 లసంక్రి, హోమోలో సభ్యత్వం ప్రశ్నార్థకం), హోమో ఎరెక్టస్ (18 - 1 లసంక్రి), హోమో సేపియన్స్ (3 లక్షల సంవత్సరాల క్రితం, హెచ్. నియాండర్తాలెన్సిస్, తదితర రకాలు ఉపజాతులుగా). ఈ సందర్భంలో "జాతులు" అనే మాట వాడుతున్నామంటే దానర్థం, ఆ సమయంలో సంకరం, ఇంట్రోగ్రెషన్ అసాధ్యమని కాదు. ఏదేమైనా, ఇది సౌకర్యంగా ఉంటుందని తరచూ జాతులు అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మాటకు అయితే సాధారణ వంశం (జనరల్ లీనియేజ్) అని అర్థం చేసుకోవాలి కాదూ కూడదంటే సమూహాలు (క్లస్టర్స్) అని అనుకోవచ్చు. "జాతులు" యొక్క సాధారణ నిర్వచనాలు, పద్దతిలో సాధారణంగా మానవ శాస్త్రం లేదా పాలియోంటాలజీలో అంగీకరించబడవు. నిజానికి, క్షీరదాలు 20 - 30 లక్షల సంవత్సరాల పాటు జాతి సంకరం జరుపుతాయి.[75] అంతకంటే ఎక్కువ కాలమూ జరగవచ్చు.[76] అంచేత హోమో జీనస్ లోని వివిధ సమకాలిక "జాతులు" కూడా జాత్యంతర సంకరం జరిపి ఉండవచ్చు. కాదని సైద్ధాంతికంగా చెప్పలేం.[77] ఇది హెచ్. నలేడి అనేది, ఓ చివరి ఆస్ట్రలోపిథ్‌తో జన్మించిన సంకర జీవి అయి ఉండవచ్చని (వాస్తవానికి ఈ వంశాలు అంతరించి చాలా కాలమైనప్పటికీ) భావించారు.[78] పైన చర్చించినట్లుగా, వేరుపడిన 15 లక్షల సంవత్సరాల తరువాత కూడా రెండు వంశాల మధ్య సంపర్కాలు జరిగిన దృష్టాంతా లున్నాయి.

హోమో వంశాల పోలికల పట్టిక
వంశాలుటెంపొరల్ రేంజి వేల సంవత్సరాల క్రితంనివాసంవయోజనుల ఎత్తువయోజనుల బరువుపుర్రె పరిమాణం (cm³)శిలాజాల రికార్డుకనుగోలు / పేరును ప్రచురించినది
హెచ్. హ్యాబిలిస్
హోమో లో సభ్యత్వం అస్పష్టం
నిర్ధారిత హెచ్. హ్యాబిలిస్ శిథిలాలు 2.1 - 1.5 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివని తేలింది. ఈ కాలం, హోమో ఎరెక్టస్ ఉద్భవించిన కాలమూ ఒకదాన్నొకటి ఆవరిస్తున్నాయి.[79][80][lower-alpha 2]తూర్పు ఆఫ్రికా110–140 సెం.మీ. (3 అ 7 in – 4 అ 7 అం)33–55 kg (73–121 lb)510–660చాలా1960
1964
హెచ్. రుడాల్ఫెన్సిస్
హోమో లో సభ్యత్వం అస్పష్టం
1,900కెన్యా7002 స్థలాలు1972
1986
హెచ్. గాటెంజెన్సిస్
హెచ్. హ్యాబిలిస్ అని కూడా వర్గీకరించారు
1,900–600దక్షిణ ఆఫ్రికా100 సెం.మీ. (3 అ 3 అం)3 individuals[81][lower-alpha 3]2010
2010
హెచ్. ఎరెక్టస్1,900–140[82][lower-alpha 4]ఆఫ్రికా, యూరేషియా180 సెం.మీ. (5 అ 11 అం)60 kg (130 lb)850 (early) – 1,100 (late)చాలా[lower-alpha 5][lower-alpha 6]1891
1892
హెచ్. ఎర్గాస్టర్
ఆఫ్రికా హెచ్. ఎరెక్టస్
1,800–1,300[85]తూర్పు and Southern ఆఫ్రికా700–850చాలా1949
1975
హెచ్. యాంటెసెస్సర్
హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ అని కూడా వర్గీకరించారు
1,200–800పశ్చిమ ఐరోపా175 సెం.మీ. (5 అ 9 అం)90 kg (200 lb)1,0002 స్థలాలు1994
1997
హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్600–300[lower-alpha 7]ఐరోపా, ఆఫ్రికా180 సెం.మీ. (5 అ 11 అం)90 kg (200 lb)1,100–1,400చాలా1907
1908
హెచ్. cepranensis
a single fossil, possibly హెచ్. ఎరెక్టస్
c. 450[86]సెప్రానో, ఇటలీ1,0001 skull cap1994
2003
హెచ్. రొడీసియెన్సిస్
హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ లేదా హెచ్. సేపియెన్స్ లోని ఉపజాతి అని కూడా వర్గీకరించారు
c. 300కబ్వే పుర్రె, జాంబియా1,300single or very few1921
1921
హెచ్. నలేడిc. 300[87]మానవ జాతి ఉయ్యాల, దక్షిణాఫ్రికా150 cm (4 ft 11 in)45 kg (99 lb)450152013
2015
హెచ్. సేపియెన్స్
(శరీరనిర్మాణ పరంగా ఆధునిక మానవులు)
300–present[lower-alpha 8]ప్రపంచవ్యాప్తం150–190 సెం.మీ. (4 అ 11 in – 6 అ 3 అం)50–100 kg (110–220 lb)950–1,800(ఉనికిలో ఉంది)——
1758
హెచ్. నియాండర్తలెన్సిస్
బహుశాహెచ్. సేపియెన్స్ లోని ఉపజాతి
240–40[90][lower-alpha 9]ఐరోపా, పశ్చిమాసియా170 సెం.మీ. (5 అ 7 అం)55–70 kg (121–154 lb) (heavily built)1,200–1,900చాలా1829
1864
హెచ్. ఫ్లోరేసియెన్సిస్
వర్గీకరణ ఇదమిత్థంగా లేదు
190–50లియాంగ్ బువా, ఇండోనేసియా100 సెం.మీ. (3 అ 3 అం)25 kg (55 lb)40072003
2004
హెచ్. త్సాయ్‌చాంగెన్సిస్
బహుశా హెచ్. ఎరెక్టస్
c. 100[lower-alpha 10]Taiwan12008(?)
2015
డెనిసోవా హోమినిన్
బహుశా హెచ్. సేపియెన్స్ లోని ఉపజాతి గానీ, సంకర జాతి గానీ అయి ఉండవచ్చు
40డెనిసోవా గుహ, సైబీరియా2 స్థలాలు2000
2010[lower-alpha 11]
రెడ్ డీర్ గుహ ప్రజలు
possible హెచ్. సేపియెన్స్ subspecies or hybrid
15–12[lower-alpha 12][93]నైరుతి చైనాచాలా తక్కువ
హెచ్. లుజోనెన్సిస్
c. 67[94][95]ఫిలిప్పీన్స్32007
2019

ఇవి కూడా చూడండి

  • మానవ పరిణామ శిలాజాల జాబితా (చిత్రాలతో)
  • ప్రకృతి కాలక్రమం

నోట్స్

మూలాలు