1742

1742 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1739 1740 1741 - 1742 - 1743 1744 1745
దశాబ్దాలు:1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 9: రాబర్ట్ వాల్పోల్‌ ట్రెజరీ యొక్క మొదటి లార్డ్ పదవికీ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ పదవికీ రాజీనామా చేసాడు. దానితో అతడు ప్రధానిగా తప్పుకున్నట్లైంది.[1] ఐదు రోజుల తరువాత అధికారికంగా ప్రధాని పదవికి రాజీనామా చేసాడు. అతను మొత్తం 20 సంవత్సరాల 314 రోజులు నిరాఘాటంగా ప్రధానిగా పనిచేశాడు. ఇది ఇప్పటివరకు నిరంతరాయంగా సాగిన అత్యంత సుదీర్ఘమైన పదవీ కాలం. అంతేకాదు, మరే ఇతర బ్రిటిష్ ప్రధానమంత్రి యొక్క సంచిత పదవీ కాలం క్ంటే కూడా ఇది ఎక్కువ.
  • జనవరి 14: ఎడ్మండ్ హాలీ మరణం; అతడి స్థానంలో జేమ్స్ బ్రాడ్లీని గ్రేట్ బ్రిటన్లో ఖగోళ శాస్త్రవేత్తగా నియమించారు.
  • జనవరి 24: చార్లెస్ VII పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు .
  • ఆగస్టు 17: ఐరిష్ రచయిత, కవి జోనాథన్ స్విఫ్ట్ సరైన మానసిక అవస్థలో లేడని, అతడికి జ్ఞాపకశక్తి సరిగా లేదనీ న్యాయస్థానం ప్రకటించింది. అతని మిగతా జీవితం (మూడు సంవత్సరాలు) ఇంటికే పరిమితం చేసి చికిత్స చెయ్యాలని చెప్పింది. [2]
  • నవంబర్ 13: రాయల్ డానిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ ను స్థాపించారు.
  • తేదీ తెలియదు: ఆఫ్ఘన్ తెగలు ఏకమై రాచరికంగా ఏర్పడ్డాయి.
  • తేదీ తెలియదు: అండర్స్ సెల్సియస్ 1741లో ఉద్భవించిన సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత స్కేలు కోసం తన ప్రతిపాదనను ప్రచురించాడు.

జననాలు

  • మార్చి 14 – ఆఘా మొహమ్మద్ ఖాన్ కజార్, ఇరాన్ రాజు (మ .1797 )
  • డిసెంబరు 9 : కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)

మరణాలు

ఎడ్మండ్ హేలీ
  • ఎడ్మండ్‌ హేలీ, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు, భౌతిక శాస్త్రవేత్త

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1742&oldid=3026667" నుండి వెలికితీశారు