1759

1759 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1756 1757 1758 - 1759 - 1760 1761 1762
దశాబ్దాలు:1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

సలాబత్ జంగ్
  • జనవరి 11: మొదటి అమెరికన్ జీవిత బీమా సంస్థను ఫిలడెల్ఫియాలో స్థాపించారు. [1]
  • ఫిబ్రవరి 16 – కామ్టే డి లాలీ (థామస్ లాలీ) నేతృత్వం లోని ఫ్రెంచి సైన్యం మద్రాసులో బ్రిటిషు వారి కోట ముట్టడిని రెండు నెలల తరువాత ముగించి వెనక్కి వెళ్ళింది.[2]
  • ఫిబ్రవరి 17: ఫ్రెంచ్ నియంత్రణలో ఉన్న క్యూబెక్‌ను స్వాధీనం చేసుకునే పనిలో "అమెరికాకు బయలుదేరిన గొప్ప నౌకాదళం" [3] పోర్ట్స్మౌత్ నుండి 250 ఓడలతో బయలుదేరింది (వైస్ అడ్మిరల్ చార్లెస్ సాండర్స్ ఆధ్వర్యంలో 49 రాయల్ నేవీ యుద్ధనౌకలతో సహా). [4] ఈ నౌకలు 14,000 మంది నావికులు, మెరైన్స్, మేజర్ జనరల్ జేమ్స్ వోల్ఫ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఆర్మీ దళాలను మరో 7,000 మంది వాణిజ్య నావికులతో పాటు తీసుకువెళ్ళాయి.
  • మార్చి 6: మచిలీపట్నం ముట్టడి మొదలైంది.
  • ఏప్రిల్ 7: మచిలీపట్నం ముట్టడిలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచివారిపై విజయం సాధీంచింది.
  • మే 14: సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారు జిల్లాలన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.
  • సెప్టెంబర్ 10: పాండిచేరి యుద్ధం: జార్జ్ పోకాక్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ వారికీ, ఫ్రెంచ్ అడ్మిరల్ డి అచేకూ మధ్య భారత తీరంలో నావికా యుద్ధం జరిగింది. ఫ్రెంచ్ దళాలు తీవ్రంగా దెబ్బతిని, వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ తిరిగి రాలేదు.
  • నవంబర్ 29: మొఘల్ చక్రవర్తి అలమ్‌ఘీర్ II తన ప్రధాన మంత్రి ఇమాద్-ఉల్-ముల్క్ చేసిన కుట్రలో హత్యకు గురయ్యాడు. 17 వ శతాబ్దపు చక్రవర్తి ఔరంగజేబు మనవడు షా ఆలం II కొత్త మొఘల్ చక్రవర్తి అయ్యాడు. [2]
  • డిసెంబర్ 10: ఆలంగీర్ II మరణించిన పదకొండు రోజుల తరువాత షాజహాన్ III మొఘల్ సామ్రాజ్యానికి కీలుబొమ్మ పాలకుడయ్యాడు. కాని కేవలం పది నెలల పాలన తరువాత తొలగించబడ్డాడు.

జననాలు

  • జనవరి 25 – రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి (మ .1796)
  • మే 28 – విలియం పిట్ ది యంగర్, రాజనీతిజ్ఞుడు, యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క ప్రధాన మంత్రి (మ .1806)

మరణాలు

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1759&oldid=3858224" నుండి వెలికితీశారు