ఆమ్లం

ఆమ్లం (ఆంగ్లం: Acid; లాటిన్: Acidus/acēre అర్ధం పులుపు) అనేది ఒక రసాయన పదార్థం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. ఇవి పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును, కార్బొనేట్, బై కార్బొనేట్లతో చర్య జరిపి కార్బన్ డై ఆక్సైడ్ ను ఇస్తాయి. అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో H+ అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. ఆమ్లాలు 7 కన్నా తక్కువ pH కలిగివుంటాయి. లిట్మస్ పరీక్షలో ఎరుపు రంగును కలిగిస్తాయి.

Zinc, a typical metal, reacting with hydrochloric acid, a typical acid

వెనెగార్ అని పిలిచే ఎసిటిక్ ఆమ్లం, కారు బ్యాటరీలలో ఉపయోగించే సల్ఫూరిక్ ఆమ్లం, బేకింగ్లో వాడే టార్టారిక్ ఆమ్లం మొదలైనవి ఆమ్లాలకు ఉదాహరణలు. అమ్లాలు వాయు, ద్రవ, ఘన స్థితులలో ఉండవచ్చును.

ఉదాహరణలు

  • హైడ్రోజన్ హాలైడ్లు, వాటి ద్రావణాలు: ఉదజహరికామ్లము (hydrochloric acid: (HCl)
  • హలోజన్ ఆక్సో ఆమ్లములు: హైపోక్లోరస్ ఆమ్లము: (hypochlorous acid (HClO), క్లోరస్ ఆమ్లము: (chlorous acid (HClO2)
  • సల్ఫ్యూరికామ్లము (Sulfuric acid: H2SO4)
  • నత్రికామ్లము (Nitric acid: HNO3)
  • ఫాస్ఫారికామ్లము (Phosphoric acid: H3PO4)
  • క్రోమిక్ ఆమ్లము (Chromic acid: H2CrO4)
  • బోరిక్ ఆమ్లము (Boric acid: H3BO3)

లక్షణాలు

  • ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.
  • నీలి లిట్మస్ కాగితాన్ని ఆమ్లంలో ఉంచినపుడు ఎరుపుగా మారుతుంది.
  • అమ్లాలు మిధైల్ ఆరెంజి సూచికను ఎరుపుగా మారుస్తాయి.
  • అమ్లాలు ఫీనాప్తలీన్ సూచికను ఎరుపుగా మారుస్తాయి.

ధర్మాలు

  • ఆమ్లాలు లోహాలతో చర్యపొందు హైడ్రోజన్ వాయువు నిస్తాయి. Zn +2HCl → ZnCl2+H2
  • ఆమ్లం క్షారంతో చర్య పొంది లవణం, నీరు లనిస్తుంది. దీనిని తటస్థీకరణము అంటారు. HCl + NaOH → Nacl + H2O
  • ఆమ్లం కార్బొనేట్, బై కార్బొనేట్ లతో చర్య పొంది కార్బన్ డైఆక్సైడ్ నిస్తుంది.

తయారు చేసే విధానం

అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినపుదు ఆమ్లాలు తయారవుతాయి.

  • కార్బన్ డై ఆక్సైడ్ ను నీటిలో కరిగిస్తే కార్బానికామ్లం ఏర్పడుతుంది. CO2 +H2O → H2CO3
  • సల్ఫర్ డై ఆక్సైడ్ ను నీటిలో కరిగిస్తే సల్ఫూరస్ ఆమ్లం ఏర్పడుతుంది. SO2 +H2O → H2SO3
  • సల్ఫర్ ట్రైఆక్సైడ్ ను నీటిలో కరిగిస్తే సల్ఫూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. SO3 +H2O → H2SO4

నీటి అయనీకరణము

స్వచ్ఛమైన నీటిలో విద్యుత్ ప్రసరించదు. నీటిలో విద్యుత్ ను ప్రసరింపజేస్తే ఒక లీటరు ఘనపరిమాణంలో ఒక కోటి మోల్ అయాన్లలో ఒకటి మాత్రమే అయాన్లుగా విడిపోతుంది. దీనిని నీటి అయనీకరణము అంటారు.[H+] అనగా H+ అయాన్ యొక్క గాఢత. [OH- ] అనగా OH- అయాన్ గాఢత అనిర్థం.నీటిలో H+, OH-లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి.[H+]= 10−7 మోల్ అయాన్/లీటరు : [OH- ] =10−7 మోల్ అయాన్/లీటరు

నీటి అయానిక లబ్దము

ఒకమోల్ నీటిలో గల H+ గాఢత, OH- గాఢతల లబ్ధాన్ని నీటిఅయానిక లబ్ధం అంటారు.దీనిని Kwతో సూచిస్తారు.w= [H+] x [OH- ]ఇది ఆమ్ల క్షారాలలో ముఖ్య మైనది. ఎందువలనంటే

  • నీటికి ఆమ్లం కలిపినపుడు H+ అయాన్ల గాఢత పెరుగుతుంది OH- అయాన్ల గాఢత తగ్గుతుంది. అయినా వాటి గాఢతల లబ్ధం మారదు.
ఆమ్ల, క్షారముల జల ద్రావణంలో H+ అయాన్ల గాఢత, OH- అయాన్ల గాఢత
H+ అయాన్ల గాఢత [H+]10010−110−210−310−410−510−610−710−810−910−1010−1110−1210−1310−14
OH- అయాన్ల గాఢత [OH-]10−1410−1310−1210−1110−1010−910−810−710−610−510−410−310−210−1100

H+ అయాన్ గాఢత బట్టి ఆమ్ల, క్షారములను తెలుసుకొనవచ్చును.

  • 100 > [H+] > 10−6 అయితే ఆ ద్రావణం ఆమ్లం అవుతుంది.

PH

దీనిని సోరెన్ సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ మానమును ఆమ్ల క్షారములు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.

  • హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమానాన్ని PH అంటారు.
  • PH= -log [H+]
H+ అయాన్ల గాఢత, PH విలువలు
H+ అయాన్ల గాఢత [H+]10010−110−210−310−410−510−610−710−810−910−1010−1110−1210−1310−14
PH విలువలు01234567891011121314

PH ఆధారంగా ఆమ్ల క్షారములను తెలుసుకోవచ్చు.

  • PH విలువ 0 నుండి 6 వరకు గల ద్రావణాలు ఆమ్లాలు.

ఆమ్లముల బలాలు

  • బలమైన ఆమ్లము (strong acid) : 100% అయనీకరణము చెందిన ఆమ్లమును బలమైన ఆమ్లము అంటారు. ఉదా: హైడ్రోక్లోరికామ్లము (HCl)
  • బలహీన ఆమ్లము (weak acid) : పాక్షికంగా అయనీకరణము చెందిన ఆమ్లమును బలహీన ఆమ్లము అంటారు. ఉదా: ఎసిటిక్ ఆమ్లము (CH3COOH)

ఇవి చేయండి, తెలుసుకోండి

  1. ప్రత్యమ్నాయ లిట్మస్ తయారీ: ఒక మందార పూవు తీసుకొని దానిని కాగితంపై బాగా రాయండి. అది నీలిరంగులో మారుతుంది. దీనిని నీలి లిట్మస్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ కాగితంపై వివిధ ఆమ్లాలను వేసి చూడండి. మార్పును గమనించండి. ఆకాగితం ఎరుపుగా మారుతుంది.
  2. మాజిక్ ఉత్తరాన్ని తయారు చేయుట: ఫీనాప్తలీన్ ద్రవం ఉపయోగించి ఉత్తరాన్ని తెల్ల కాగితంపై రాయండి. ఆ ఉత్తరాన్ని ఆరబెట్టండి. ఆ కాగితంపై ఏ అక్షరాలు కనిపించవు. ఈ ఉత్తరాన్ని ఒక పాత్రలో గల నిమ్మరసం ద్రావణంలో ఉంచండి. దాని పై ఎరుపు అక్షరాలు కనిపిస్తాయి.
  3. మీ ప్రాంతంలో బాబాల మోసాలు తెలుసుకోండి: ఒక కత్తిపై మొదట ఫీనాప్తలీన్ ద్రవాన్ని గాని, మందార పువ్వు రసాన్ని గాని ముందుగా పూసి ఉంచుకుంటారు. మీరు ఏదైనా సమస్య వారికి చెప్పినపుడు మీకు నిమ్మకాయలను తెమ్మని వారివద్ద ఉన్న కత్తితో కోస్తారు.అపుడు ఎర్రని ద్రవం వస్తుంది. దీనిని రక్తంగా భమింపజేస్తారు.
  4. ఆమ్ల వర్షం: ఆగ్రా వంటి పారిశ్రామక ప్రాంతాలలో కర్మాగారములనుండి విడుదలయ్యే అలోహ ఆక్సైడ్లు మెఘాలలోని నీటితో చర్యపొంది ఆమ్లములుగా తయారయి వర్షంగా కురియుట వలన తాజ్ మహల్ వంటి కట్టడాలకు నష్టం వాటిల్లుతుంది.
  5. వంట పాత్రల వల్ల నష్టం: మన యిండ్లలో ఎక్కువగా అల్యూమినియం పాత్రలను వినియోగిస్తారు. యిది లోహం. యిందులో చింతపండుతో తయారుచేసిన పదార్థాలు వండినపుడు చింత పండులో గల టార్టారికామ్లం లోహ పాత్రతో చర్య చెందడం వల్ల యేర్పడిన క్రియా జన్యాలలో హైడ్రోజన్ వాయువు పోయి మిగిలిన పదార్థాలు మన ఆహారంలో కలియుట వల్ల మన ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతోంది.
  6. జీర్ణాశయంలో యేర్పడిన ఎసిడిటీ కొరకు: మనం రోజూ సరియైన సమయానికి ఆహారం తినకపోవుట వలన మన జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ ఆమ్లము ఉత్పత్తి పెరిగి ఎసిడిటీకి కారణమగును. అపుడు ఆమ్లత్వం పోవుటకు క్షారంతో కూడిన మాత్రలను వాడమని డాక్టర్లు చెవుతారు.
  7. బెలున్ లో హైడ్రోజన్ వాయువు నింపండి: ఒక చిన్న సీసాలో కొన్ని లోహపు ముక్కలు తీసుకోండి. అందులో నిమ్మరసం (సిట్రిక్ ఆమ్లం) వేసి దానిపై బెలూన్ తగిలించండి. కొంతసేపు ఉంచినపుడు ఆ బెలూన్ హైడ్రోజన్ వాయువుతో నిండుతుంది. ఆ బెలూన్ ను త్రాడుతో కట్టి వదిలితే అది పైకి పోతుంది.

వివిధ రకములైన ఆమ్లములు

మినరల్ ఆమ్లాలు

సల్ఫోనిక్ ఆమ్లాలు

  • Methanesulfonic acid (or mesylic acid, CH3SO3H)
  • Ethanesulfonic acid (or esylic acid, CH3CH2SO3H)
  • Benzenesulfonic acid (or besylic acid, C6H5SO3H)
  • p-Toluenesulfonic acid (or tosylic acid, CH3C6H4SO3H)
  • Trifluoromethanesulfonic acid (or triflic acid, CF3SO3H)
  • Polystyrene sulfonic acid (sulfonated polystyrene, [CH2CH (C6H4) SO3H]n)

కార్బాక్సిలిక్ ఆమ్లాలు

Vinylogous carboxylic acids

  • Ascorbic acid
  • Meldrum's acid

కేంద్రక ఆమ్లాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు