ఇంటర్నెట్ అర్కైవ్

ఇంటర్నెట్ ఆర్కైవ్ అనేది సాన్ ఫ్రాన్సిస్కో- కేంద్రంగాగల లాభాపేక్షలేని డిజిటల్ గ్రంథాలయం. ఇది "అన్ని జ్ఞానాలకు సార్వత్రిక వినియోగం" అనే లక్ష్యంతో ఉంది. [notes 1] [notes 2] ఇది వెబ్సైట్లు, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ / గేమ్స్, మ్యూజిక్, సినిమాలు / వీడియోలు, కదిలే చిత్రాలు, దాదాపు మూడు మిలియన్ ప్రజోపయోగ పరిధి పుస్తకాలుతో సహా డిజిటైజ్ చేయబడిన సేకరణను ఉచితంగా అందిస్తుంది. As of అక్టోబరు 2016[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], దాని సేకరణ 15 పెటాబైట్లతో అగ్రస్థానంలో ఉంది.[3] అంతే కాక, ఆర్కైవ్ ఒక కార్యకార సంస్థ, ఇది ఉచిత, బహిరంగ ఇంటర్నెట్ కోసం కృషిచేస్తుంది.

ఇంటర్నెట్ ఆర్కైవ్
Available inఇంగ్లీషు
Revenue$17.5 మిలియన్లు (2016)[1]
Launched1996 (1996)
Current statusక్రియాశీలం
Headquarters
2009 నుండి, కేంద్రకార్యాలయం: శాన్ ఫ్రాన్సిస్కో 300 ఫన్సటన్ వీధి లో ఇంతకుముందు చర్చిగా వాడబడిన భవనం
ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు బిబ్లథెకా అలెక్సాండ్రినా, ఈజిప్టు

ఇంటర్నెట్ ఆర్కైవ్ ప్రజలకు డేటాను చేర్చడానికి, పొందడానికి అనుమతిస్తుంది, కానీ దాని యొక్క అధిక భాగం దాని వెబ్ క్రాలర్ల ద్వారా స్వయంచాలకంగా సేకరించబడుతుంది, ఇది సాధ్యమైనంత ఎక్కువ ప్రజా అంతర్జాలాన్ని సంరక్షించడానికి పనిచేస్తుంది. దీని వేబ్యాక్ మెషీన్ పేరు గల వెబ్ ఆర్కైవ్ 308 బిలియన్ల కంటే ఎక్కువ వెబ్ పేజీలను కలిగి ఉంది. [notes 3][4] ఆర్కైవ్ ప్రపంచంలోని అతిపెద్ద పుస్తకాల డిజిటైజేషన్ ప్రాజెక్టులలో ఒకదానిని పర్యవేక్షిస్తుంది.

1996 మేలో బ్రూస్టర్ కాహ్లే స్థాపించిన, ఆర్కైవ్ అనేది 501 (c) (3) లాభాపేక్షరహితంగా అమెరికాసంయుక్తరాష్ట్రాలనుండి పనిచేస్తోంది. దానికి వెబ్ క్రాలింగ్ సేవలు, వివిధ భాగస్వామ్యాలు, గ్రాంట్లు, విరాళాలు, కలే-ఆస్టిన్ ఫౌండేషన్ల నుండి ఆదాయం వస్తుంది. దీని సిబ్బంది చాలావరకు పుస్తక స్కానింగ్ కేంద్రాలలో పనిచేస్తారు. ఆర్కైవుకు మూడు కాలిఫోర్నియా నగరాల్లో డేటా సెంటర్లున్నాయి -శాన్‌ ఫ్రాన్సిస్కో, రెడ్వుడ్ సిటీ, రిచ్మండ్. ఒక సహజ విపత్తులో డేటాను కోల్పోకుండా ఉండటానికి, ఆర్కైవ్ మరింత దూరప్రాంత ప్రదేశాల్లో సేకరణలను నిల్వచేయడానికి ప్రయత్నిస్తుంది, ప్రస్తుతం ఈజిప్టులో బిబ్లియోథికా అలెగ్జాండ్రినా,[notes 4] ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇవి ఉన్నాయి.[5] ది ఆర్కైవ్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ప్రిజర్వేషన్ కన్సార్టియం[6]లో సభ్యత్వం కలిగివుంది. 2007 లో కాలిఫోర్నియా రాష్ట్రంలో అధికారికంగా గ్రంథాలయంగా నియమించబడింది. [notes 5]

అమీర్ సాబెర్ ఎస్ఫహాని, ఆండ్రూ మెక్క్లిన్తోక్ చే నిర్వహించబడిన ఇంటర్నెట్ ఆర్కైవ్ విజువల్ ఆర్ట్స్ రెసిడెన్సీ, ఆర్కైవ్ యొక్క 40 పెటాబైట్ల డిజిటల్ మాధ్యమాలను వాడి కళాకారులు కొత్తవి సృష్టించడానికి రూపొందించబడింది. సంవత్సరం పొడవుండే నివాసయోగ్యం గల చదువులో, దృశ్య కళాకారులు ఒక కళాఖండాన్ని సృష్టిస్తారు. ఇది ఒక ప్రదర్శనతో ముగుస్తుంది. డిజిటల్ చరిత్రను కళలతో కలపడం, భవిష్యత్తు తరాల కోసం అంతర్జాలంలో లేదా భౌతికంగా సృష్టించడానికి ఇది వుపయోగపడుతుంది.[7] గతంలో కళాకారులు తరావత్ టెల్పసంద్, జెన్నీ వోడెల్ ఈ పథకంలో పాల్గొన్నారు.

పుస్తకాల సేకరణ

ఇంటర్నెట్ ఆర్కైవ్ "స్క్రైబ్" పుస్తక స్కానింగ్ వ్యవస్థ

ఇంటర్నెట్ ఆర్కైవ్ పాఠ్య నిల్వల సేకరణ ప్రపంచవ్యాప్తంగా వివిధ గ్రంథాలయాలు, సాంస్కృతిక వారసత్వ సంస్థల నుండి డిజిటల్ పుస్తకాలు, ప్రత్యేక సేకరణలను కలిగి ఉంది.   ఇంటర్నెట్ ఆర్కైవ్ ఐదు దేశాల్లో 33 స్కానింగ్ కేంద్రాలను నిర్వహిస్తుంది, రోజుకు 1,000 పుస్తకాలతో ఇప్పటివరకు 2 మిలియన్ పుస్తకాలను డిజిటైజు చేసింది.[8] As of జూలై 2013[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]] ఈ సేకరణలో 4.4 మిలియన్ల పుస్తకాలు ఉన్నాయి. నెలకు 15 మిలియన్ డౌన్ లోడ్లు[8] As of నవంబరు 2008[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], సుమారు 1 మిలియన్ పుస్తకాలతో,ముడి కెమెరా చిత్రాలు, హద్దులు,వాలు సవరించిన చిత్రాలు, పిడిఎఫ్(PDF)లు,, ముడి OCR డేటాతో, మొత్తం సేకరణ 0.5 పెటాబైట్ల కంటే ఎక్కువ ఉంది.[9] 2006-2008 మధ్యకాలంలో, మైక్రోసాఫ్ట్ దాని ప్రత్యక్ష శోధన పుస్తకాల ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్నెట్ ఆర్కైవ్ గ్రంథాలతో ఒక ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంది. సేకరణకు దోహదం చేసిన 300,000 కంటే ఎక్కువ పుస్తకాలను స్కానింగ్ చేసింది, అలాగే ఆర్థిక మద్దతు, స్కానింగ్ పరికరాలు సమకూర్చింది. 2008 మే 23 న మైక్రోసాఫ్ట్ లైవ్ బుక్ సెర్చ్ ప్రాజెక్ట్ ను నిలిపివేసింది, ఇకపై పుస్తకాలను స్కానింగ్ చేయదని ప్రకటించింది.[10] మైక్రోసాఫ్ట్ చే స్కాన్ చేయబడిన పుస్తకాలను ఒప్పంద పరిమితి లేకుండా అందుబాటులోకి తెచ్చింది, దాని మాజీ భాగస్వాములకు దాని స్కానింగ్ సామగ్రిని విరాళంగా ఇచ్చింది.[10]

2007 అక్టోబరు లో, ఆర్కైవ్ యూజర్లు గూగుల్ బుక్ సెర్చ్ నుండి పబ్లిక్ డొమైన్ పుస్తకాలు అప్లోడ్ చేయటం ప్రారంభించారు. [notes 6] As of నవంబరు 2013[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], ఆర్కైవ్ యొక్క సేకరణలో 900,000 కంటే ఎక్కువ గూగుల్ డిజిటైజ్ చేసిన పుస్తకాలు ఉన్నాయి; [notes 7]గూగుల్లో కనిపించే కాపీతో (గూగుల్ వాటర్మార్క్ తప్ప) పోలివున్న పుస్తకాలు అపరిమితమైన ఉపయోగం, డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయి.[11] ఈ పని 'ఆరోన్ స్వర్త్జ్ సమన్వయంతో, గూగుల్ యొక్క పరిమితుల మధ్య ఉండటానికి తగినంత వేగంతో, తగినంత కంప్యూటర్ల నుండి ప్రజోపయోగ పరిధి పుస్తకాలను పొంది, ఇంటర్నెట్ ఆర్కైవ్ లో భద్రపరచడం చేయబడిందని' బ్రూస్టర్ కాహ్లే 2013 లో వెల్లడించారు. ప్రజోపయోగ పరిధిపుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తేవటానికి ఇలా చేశారు. దీనిపై గూగుల్ ఫిర్యాదు చేయలేదు కాని, గ్రంథాలయాలు ఈ పనిని ఇష్టపడలేదు. కాహ్లే ప్రకారం, లక్షల మంది ప్రజలకు ప్రజలకు మంచి ప్రయోజనం కల్పించే పనిలో పనిచేయడం స్వార్త్జ్ యొక్క "మేధావితనానికి" మంచి ఉదాహరణ.[12] పుస్తకాలతో పాటు, ఆర్కైవ్ రికేప్(RECAP) వెబ్ బ్రౌజర్ ప్లగ్ఇన్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కోర్ట్స్ ' పేసర్(PACER) ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ సిస్టమ్ నుండి నాలుగు మిలియన్ కోర్టు అభిప్రాయాలు, చట్టపరమైన బ్రీఫులు, లేదా ప్రదర్శనలు ఉచిత, అనామకంగా ప్రజలకు అందిస్తుంది. ఈ పత్రాలు సాధారణంగా ఫెడరల్ కోర్టు చెల్లింపుగోడ వెనుక ఉంచబడ్డాయి. ఆర్కైవ్ ద్వారా, 2013 నాటికి ఆరు మిలియన్లకు పైగా ప్రజలు వీటిని పొందారు.[12]

తెలుగు పుస్తకాలు

తెలుగు పుస్తకాలు ప్రధానంగా యూనివర్సల్ లైబ్రరీ ప్రాజెక్టు(తొలిదశ), భారత డిజిటల్ లైబ్రరీ ల ద్వారా డిజిటల్ రూపంలోకి మార్చబడినవి చేర్చబడ్డాయి. ఇతర వ్యక్తులు, సంస్థలు తెలుగు పుస్తకాలు, సంబంధిత మాధ్యమాలు చేర్చుతున్నారు. తెలుగు పుస్తకాలలో అక్షరాలను కంప్యూటర్ ద్వారా గుర్తించడం (Optical Character Recognition(OCR)) నవంబర్ 2020 లో టెస్సరాక్ట్ OCR యంత్ర వాడడం ద్వారా వీలైంది. యంత్రశోధన ద్వారా భారతీయ భాషల పుస్తకాల స్కాన్ లలో పాఠ్యం వెతికే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. [13]

స్కాన్ ఉపకరణము
టిటిస్క్రైబ్ (TTScribe)
టిటిస్క్రైబ్ (TTScribe) వాడి పుస్తకము స్కాన్ చేయుట(వీడియో)

టిటిస్క్రైబ్ అనబడే స్కానర్ వాడుతారు.

సూచికలు

మూలాలు

🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా