ఇస్లాం ఐదు మూలస్తంభాలు

ఇస్లాంలో ఐదు ప్రాథమిక చర్యలు

ఇస్లాం మతం యొక్క ఐదు మూలస్తంభాలు ఇస్లాంలో పాటించాఅల్సిన కొన్ని ప్రాథమిక చర్యలు. విశ్వాసులు వీటిని తప్పనిసరి అని భావిస్తారు. ముస్లిం జీవితానికి పునాది. గాబ్రియేల్ హదీసులో వీటి సారాంశాం ఉంది.[1][2][3][4] ఈ కర్మల విధానం, పద్ధతుల పట్ల సున్నీ, షియాల్లో ఏకాభిప్రాఅయం ఉంది.[2][5][6] కానీ షియాలు వాటిని ఇదే పేరుతో పిలవరు. ముస్లిం జీవితం, ప్రార్థన, పేదవారి పట్ల సానుభూతి, స్వీయ శుద్ధీకరణ, తీర్థయాత్ర, [7][8] వంటి వాటిని ఇవి వివరిస్తాయి.

ఇస్లంలో ఐదు మూల స్తంభాలు

ముస్లింలు తప్పనిసరిగా చెయ్యాల్సిన కర్మలను ఐదు స్తంభాలు అంటారు.[9] కొన్ని తేడాలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వాటిని ఆచరిస్తారు. ముహమ్మద్ గడిపినట్లుగా జీవితాన్ని గడపాలని కోరుకునే వ్యక్తులకు ఇవి తప్పనిసరి. ఇతర మతాల మాదిరిగా, ఇస్లాంలో కూడా కొన్ని ప్రామాణిక పద్ధతులున్నాయి. అయితే, తమను ముస్లింలుగా భావించే వ్యక్తులందరూ తప్పనిసరిగా వాటిని పాటించి తీరాలని దీని అర్థం కాదు.[10] వ్యక్తి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి పాటించే విధానం మారవచ్చు. "దేవునికి సమర్పణ" అనే ఇస్లాం యొక్క మతపరమైన అభ్యాసం ఐదు స్తంభాలు అని పిలువబడే ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.[11] ఐదు స్తంభాలలో ప్రతి ఒక్కటి ఖురాన్లో వివిధ అధ్యాయాలలో (సూరా) సూచించబడింది. ఈ కట్టుబాట్లను సంబంధించిన మరిన్ని మెళుకువలు హదీసుల్లో ఉంటాయి.[12]

ఇస్లాంలో ఐదు స్థంభాలను తెలియజేస్తున్న చిత్రం

మూలస్థంభాలు

  • షహాద (విశ్వాసం): *لا إله إلا الله محمد رسول الله: " లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదన్ రసూల్ అల్లాహ్. కలిమయె షహాద: అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్ న ముహమ్మదన్ రసూల్ అల్లాహ్ " నేను సాక్షి చెబుతున్నాను, అల్లాహ్ ఒక్కడే, అతనికి ఎవ్వరూ సాటిరారు, ముహమ్మద్ అల్లాహ్ చే పంపబడ్డ ప్రవక్త "
  • సలాహ్ (నమాజ్ లేదా ప్రార్థన).
  • సౌమ్ (ఉపవాసం).
  • జకాత్ (దాన ధర్మం).
  • హజ్ (పుణ్య యాత్ర).

ఈ ఐదు నిబంధనలు పాటించినవాడే ఒక సంపూర్ణ మహమ్మదీయుడు.

ఇవీ చూడండి

మూలాలు