కానుపు

ప్రసూతి

మహిళ గర్భాశయం నుండి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది శిశువులు బయటికి రావటం అనేది గర్భం ముగింపు దశ. దీన్ని శిశుజననం అని అంటారు. దీనిని కాన్పు, ప్రసవం అని కూడా పిలుస్తారు.[4] 2015 లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల జననాలు సంభవించాయి.[5] 42 వారాల తరువాత 3 నుండి 12% మంది పుడుతుండగా, గర్భావది కాలానికి 37 వారాల ముందు [నెలలు తక్కువ కాన్పు] సుమారుగా 15 మిలియన్లు మంది జన్మించారు.[6][7] అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో సాంప్రదాయ మంత్రసాని సహాయంతో చాలా జననాలు ఇంటిలో జరుగుతుండగా, అభివృద్ధి చెందిన ప్రపంచంలో చాలా ప్రసవాలు ఆసుపత్రులలో జరుగుతున్నాయి[8][9] [10]

శిశు జననం
పర్యాయపదాలుప్రసవం, జననం [1][2]
మావితో కప్పబడిన నవజాత శిశువుతో తల్లి
ప్రత్యేకతప్రసూతి శాస్త్రం, మిడ్‌వైఫరీ
ఉపద్రవాలుప్రసవం అడ్డుకోవడం, ప్రసవానంతర రక్తస్రావం, ఎక్లాంప్సియా, ప్రసవానంతర సంక్రమణం, జనన అస్ఫిక్సియా, నియోనాటల్ అల్పోష్ణస్థితి[3]
రకాలుయోని ద్వారా జననం, సి-సెక్షన్
కారణాలుగర్భధారణ
నివారణజనన నియంత్రణ, ఎలెక్టివ్ అబార్షన్
తరచుదనం135 మిలియన్ (2015)
మరణాలు500,000 maternal deaths a year

యోని ద్వారా ప్రసవం అనేది అతి సాధారణ కాన్పుగా ఉంది.[11] దీనిలో మూడు దశల ప్రసవం ఉంటుంది: కుదించుకు పోవటం, గర్భాశయం తెరచుకోవటం, బిడ్డ క్రిందకు జారటం, జననం, మాయను బయటకు తొయ్యటం.[12] మొదటి దశకు సాధారణంగా పన్నెండు నుండి పందొమ్మిది గంటలు పడుతుంది, రెండవ దశకు ఇరవై నిమిషాల నుండి రెండు గంటలు పడుతుంది, మూడవ దశకు ఐదు నుండి ముప్పై నిమిషాలు పడుతుంది.[13] మొట్టమొదటి దశ అర నిమిషం పాటు ఉండే పొత్తికడుపు బిగదీయటం ద్వారా లేదా వీపు నొప్పులతో ప్రారంభమవుతుంది ప్రతి పది నుంచి ముప్పై నిమిషాలకు ఇవి వస్తుంటాయి.[12] ఈ బిగదీసిన నొప్పులు సమయం గడిచే కొద్దీ బాగా ఎక్కువగా, త్వరత్వరగా వస్తాయి.[13] రెండవ దశలో అవయవం ముడుచుకుపోవటంతో బిడ్డ బయటికి నెట్టబడటం సంభవించవచ్చు.[13] మూడవ దశలో ఆలస్యంగా బొడ్డు త్రాడును కత్తిరించటం అనేది సాధారణంగా సిఫార్సు చేయబడుతుంది.[14] నొప్పికి ఉపశమన పద్ధతులు వంటివి, ఒపియోడ్లు, వెన్నెముక అనస్థీషియాలైన అనేక పద్ధతులు సహాయపడవచ్చు.[13]

చాలామంది పిల్లలు మొదటిగా తల వచ్చేలా జన్మిస్తారు; అయితే సుమారు 4% మంది ముందుగా పాదాలు లేదా పిరుదులు ముందుగా వచ్చేలా పుడతారు, దీన్ని ఎదురుకాళ్ళతో పుట్టటం అని పిలుస్తారు.[13][15] ప్రసవ సమయంలో సాధారణంగా మహిళ తనకు నచ్చినట్లుగా తినవచ్చు, అటూ ఇటూ తిరగవచ్చు, మొదటి దశలో లేదా తల ముందుగా వచ్చే కాన్పు జరుగుతున్న సమయంలో బిడ్డను ముందుకు నెట్టటం అనేది సిఫార్సు చేయబడలేదు, ఎనిమాలు సిఫారసు చేయబడలేదు.[16] ఎపిసియోటమీ అని పిలవబడే యోనిని కత్తిరించి తెరిచే విధానం సాధారణంగా జరుగుతున్నప్పటికీ, దీని అవసరం సాధారణంగా రాదు.[13] 2012లో, సిజేరియన్ ఆపరేషన్ అని పిలవబడే శస్త్రచికిత్స పద్ధతి ద్వారా 23 మిలియన్ ప్రసవాలు జరిగాయి.[17] కవల పిల్లలు, శిశువుకు ప్రమాద సంకేతాలు, లేదా పిరుదులు, ఎదురుకాళ్ళతో పుట్టే స్థితి కోసం సిజేరియన్ శస్త్రచికిత్స సిఫార్సు చేయబడవచ్చు.[13] ఈ ప్రసవ విధానం కారణంగా నయం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది.[13]

ప్రతి సంవత్సరం దాదాపు 500,000 ప్రసూతి మరణాలకు గర్భం, శిశు జననంతో వచ్చే సమస్యలు కారణమవుతున్నాయి, 7 మిలియన్ల మహిళలు తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నారు, ప్రసవం తరువాత 50 మిలియన్ల మంది మహిళలకు ప్రతికూల ఆరోగ్య ఫలితాలు సంభవిస్తున్నాయి.[18] వీటిలో ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతాయి.[18] ప్రత్యేక సమస్యలలో కష్టంతో కూడిన ప్రసవం, ప్రసవానంతర రక్తస్రావం, ప్రసూతి వాతం, ప్రసవానంతర ఇన్ఫెక్షన్ ఉంటాయి.[18] శిశువుకు గల సమస్యలలో పుట్టుకతో వచ్చే శ్వాసావరోధం ఉంటుంది.[19]

ఇవి కూడా చూడండి

మూలాలు

బాహ్య లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.