క్రూసేడులు

క్రూసేడులు (ఆంగ్లం : The Crusades) మతపరమైన సైనిక దాడుల పరంపర. వీటిని ఐరోపాకు చెందిన క్రైస్తవులు, తమ అంతర్గత, బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ పాగన్ లకు, దాసులకు, యూదులకు, రష్యన్ , గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులకు, మంగోలులకు, కాథార్స్ కు, హుస్సైట్ లకు, వాల్డెన్‌షియన్లకు, ప్రాచీన ప్రష్షియనులకు, పోప్ ల రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు.[1] క్రూసేడర్లు పాత పాపాలు చేయుటకు అనుమతిని పొంది యుద్ధాలు చేయుటకు ప్రతిన బూనారు.[1]

మొదటి క్రూసేడు సమయాన ఆంటియాక్ కోటను జయించినప్పటి చిత్రం, మధ్యయుగపు మీనియేచర్ పెయింటింగ్.

జెరూసలేం యూదులకు, క్రైస్తవులకు, ముస్లిములకు పవిత్ర భూమిగా పరిగణింపబడింది. అనటోలియాలో సెల్జుక్ తురుష్క ముస్లింల అధిక్యతను నిరోధించుటకు తూర్పు ఆర్థడాక్సులు బైజాంటియన్ సామ్రాజ్య పాలకులకు సహాయాన్ని అర్థించే ప్రకటన చేశారు.[2] ఈ యుద్ధాలు సాధారణంగా పాగనులకు, హెరెటిక్స్ లకు వ్యతిరేకంగా చేపట్టారు. మత, ఆర్థిక, రాజకీయ కారణంగా.[3] క్రైస్తవుల, ముస్లింల అంతర్గత శత్రుత్వం కూడా వీరిమధ్య అనేక సంధులు, ఒడంబడికలు చేయడానికి దోహదపడినది. ఐదవ క్రుసేడ్ సమయాన క్రైస్తవులకు, రూమ్ సల్తనత్ ల మధ్య జరిగిన మిత్రత్వము ఇందుకు ఒక ఉదాహరణ.

మొదటి దశాబ్దంలో, క్రూసేడర్లు ముస్లింలకు, యూదులకు వ్యతిరేకంగా ఒక ఉగ్రమైన పాలసీని అవలంబించారు. నరసంహారము గావించి, మానవుల తలలను మొండెములనుండి వేరు చేసి కోట గోడలపై వేలాడదీసేవారు. సామూహిక సంహారం, శత్రువులను నగ్నంగా వేలాడదీయడం, కొన్నిసార్లు కాన్నబాలిజం (నరభక్షణ), (మారత్ ఆక్రమణ) లో రికార్డు అయినది.

ఇవీ చూడండి

సలాహుద్దీన్, గై డే లుసిగ్‌మాన్, హత్తీన్ యుద్ధం (1187) తరువాత.
కొన్ని క్రూసేడుల ఫలితాలు
క్రూసేడుల వెనుక చరిత్ర
"క్రూసేడు"ల పేరుతో కొన్ని సంఘటనలు, కానీ చరిత్రలో స్థానం ఇవ్వలేదు
మీడియా, సంస్కృతి
రాజాజ్ఞలు
పాల్గొన్నవారు

పాద పీఠికలు

మూలాలు

  • Atwood, Christopher P. (2004). The Encyclopedia of Mongolia and the Mongol Empire. Facts on File, Inc. ISBN 0-8160-4671-9.

బయటి లింకులు