ఖాట్మండు లోయ

ఖాట్మండు లోయ, దీనిని నేపాల్ లోయ లేదా నేపాల్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. విశాలమైన ఆసియా ఖండంలోని భారత ఉపఖండంలో పురాతన నాగరికతల కూడలిలో ఉంది. కనీసం 130 ముఖ్యమైన స్మారక చిహ్నాలను కలిగి ఉంది.హిందువులు, బౌద్ధులకు అనేక తీర్థయాత్ర ప్రదేశాలు ఉన్నాయి. లోయలో ఏడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.[2]

ఖాట్మండు లోయ (నేపా వ్యాలీ)
ప్రపంచ వారసత్వ ప్రదేశం
పలాన్సే నుండి ఖాట్మండు లోయ వీక్షణ దృశ్య చిత్రం. భక్తపూర్
స్థానంబాగ్‌మతి ప్రావిన్స్ , నేపాల్
సూచనలు121bis
శాసనం1979 (3rd సెషన్ )
విస్తరణ2006
అంతరించేవి2003–2007[1]
ప్రాంతం665 చ.కి.మీ
భౌగోళిక నిర్దేశకాలు 27°42′14″N 85°18′31″E / 27.70389°N 85.30861°E / 27.70389; 85.30861
ఖాట్మండు లోయ is located in ఖాట్మండు లోయ
ఖాట్మండు లోయ
Location of ఖాట్మండు లోయ in ఖాట్మండు లోయ.
ఖాట్మండు లోయ is located in Bagmati Province
ఖాట్మండు లోయ
ఖాట్మండు లోయ (Bagmati Province)
ఖాట్మండు లోయ is located in Nepal
ఖాట్మండు లోయ
ఖాట్మండు లోయ (Nepal)

నేపాల్‌ లోని ఖాట్మండు లోయ అత్యంత జనాభా కలిగి అభివృద్ధి చెందిన ప్రదేశం. అధిక సంఖ్యలో కొన్ని ప్రధాన కార్యాలయాలు ఈ లోయలో ఉన్నాయి. ఇది నేపాల్ దేశం ఆర్థిక కేంద్రంగా మారింది. నేపాల్‌లో అత్యధిక సంఖ్యలో జాతరలు (వీధి ఉత్సవాలు) జరుగుతాయి. దాని ప్రత్యేకమైన వాస్తుశిల్పం, గొప్ప సంస్కృతి, పర్యాటకుల సందర్సనల వలన ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ చరిత్రకారులు ఈ లోయను "నేపాల్ ప్రాపర్" అని పిలుస్తారు.

2015 ఏప్రిల్ లో సంభవించిన నేపాల్ భూకంపానికి ఖాట్మండు లోయలో భారీ నష్టం జరిగింది.[3] భూకంపం కారణంగా ఖాట్మండు లోయలో వేలాది మంది మరణించారు. ఖాట్మండు లోయలోని చాలా ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. వాటిలో లలిత్‌పూర్, కీర్తిపూర్, మధ్యపూర్ తిమి, భక్తపూర్. ఖాట్మండు లోయ అంతటా ఉన్న పురపాలక సంఘాల పరిధిలో మొత్తం జనాభా 1.5 మిలియన్లు మంది ఉన్నారు. హిమాలయ పర్వత ప్రాంతంలో ఖాట్మండు అతిపెద్ద నగరం.

వ్యుత్పత్తి శాస్త్రం

ఖాట్మండులోని దర్బార్ స్క్వేర్

చారిత్రాత్మకంగా, లోయ, పరిసర ప్రాంతాలను కలిపి నేపాల్ మండల సమాఖ్యగా ఏర్పడింది. ఖాట్మండు, లలిత్‌పూర్ (పటాన్) అనే రెండు ఇతర రాజధానులు స్థాపించబడినప్పుడు 15వ శతాబ్దం వరకు, భక్తపూర్ దాని రాజధానిగా ఉంది. [4] [5] 1960ల వరకు, ఖాట్మండు లోయను నేపాలా లోయ లేదా నేపా వ్యాలీ అని పిలిచేవారు.[6] [7] 1961లోఖాట్మండు లోయను జిల్లా చేసారు.దీనిని అప్పటినుండి ఖాట్మండు వ్యాలీగా సూచించడం జరుగుతుంది. [8] నేపా వ్యాలీ అనే పదాన్ని ఇప్పటికీ నెవార్ ప్రజలు [9] స్థానిక ప్రభుత్వాలలో ఉపయోగిస్తున్నారు. [10] వృద్ధులు ఇప్పటికీ లోయను నేపాల్ అనే సూచిస్తారు. [11] స్వనిగ అనే పదం (నేపాల్ బాష) మూడు నగరాలు అని సూచిస్తుంది. అవి యెన్ (ఖాట్మండు), యాల (లలిత్‌పూర్), కవాప (భక్తపూర్) సూచించడానికి ఉపయోగిస్తారు. [12]

పహారీ పేరు ఖాట్మండు దర్బార్ స్క్వేర్‌లోని ఒక నిర్మాణం నుండి వచ్చింది. దీని సంస్కృత పేరు కాష్ఠ మండప "చెక్క ఆశ్రయం" అని పిలుస్తారు. మారు సత్తాల్ అని కూడా పిలువబడే ఈ విశిష్టమైన ఆలయాన్ని 1596లో రాజు లక్ష్మీ నరసింహ మల్లా నిర్మించాడు. ఆలయ మొత్తం నిర్మాణ మద్దతుకోసం ఇనుప మేకులు ఎక్కడా ఉపయోగించకుండా పూర్తిగా చెక్కతో నిర్మించారు.ఈ రెండంతస్తుల పగోడాకు ఉపయోగించిన కలప ఒకే చెట్టు నుండి లభించిందని పురాణాలు చెబుతున్నాయి.

చరిత్ర

ఖాట్మండు లోయలో సా.శ.పూ.300 నాటికే నివాస ప్రాంతంగా ఉండవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే లోయలోని పురాతన వస్తువులు సా.శ.పూ. కొన్ని వందల సంవత్సరాల నాటివిగా గుర్తించారు.పురాతన శాసనం సా.శ.185 నాటిదని తెలుస్తుంది. భూకంపం సంభవించిన లోయలో అత్యంత పురాతనమైన దృఢమైన భవనం 2,000 సంవత్సరాల కంటే పాతదని గుర్తించారు. పటాన్ నగరం చుట్టూ ఉన్న నాలుగు స్థూపాలు, సా.శ. మూడవ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుని కుమార్తెగా చెప్పబడిన చారుమతి ప్రతిష్టించబడిందని చెబుతారు. ఇవి లోయలో ఉన్న పురాతన చరిత్రను ధృవీకరిస్తాయి. బుద్ధుని సందర్శన కథల వలె, అశోకుని సందర్శనకు మద్దతు ఇచ్చే ఆధారాలు లేవు. కానీ స్థూపాలు బహుశా ఆ శతాబ్దానికి చెందినవి కావచ్చు అని నమ్ముతారు. 464 నాటి తొలి శాసనాలు లిచ్చవిలు, లోయ తదుపరి పాలకులు, భారతదేశ గుప్త సామ్రాజ్యంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఖాట్మండు లోయ, పరిసర ప్రాంతాన్ని సా.శ. 12వ శతాబ్దం నుండి సా.శ. 18వ శతాబ్దం వరకు మల్లాలు పాలించారు.  షా రాజవంశీయులు  గోర్ఖా రాజవంశానికి చెందిన పృథ్వీ నారాయణ్ షా ఆధ్వర్యంలో ప్రస్తుత నేపాల్‌ను సృష్టించినందున, అతను లోయను జయించాడు. కీర్తిపూర్ యుద్ధంలో లోయపై అతని విజయానికి నాంది అని చెప్పవచ్చు.

పశుపతినాథ్ ఆలయం.

నెవార్స్ తెగ ప్రజలు

నెవార్లు ఖాట్మాండు స్థానిక నివాసులు. వీరు లోయ చారిత్రాత్మక నాగరికత సృష్టికర్తలు. వారు వాడిన భాషను నేడు నేపాల్ భాషగా పరిగణిస్తారు. [13] ఈ లోయ ప్రదేశంలో వారు రెండు సహస్రాబ్దాల చరిత్రలో నివసించిన, పాలించిన వివిధ జాతుల, జాతి సమూహాల వారసులుగా గుర్తంచారు. పండితులు నెవార్లను ఒక జాతిగా అభివర్ణించారు. [14] వారు శ్రమ విభజనతో హిమాలయ పర్వత ప్రాంతాలలో మరెక్కడా కనిపించని అధునాతన పట్టణ నాగరికతను అభివృద్ధి చేశారు. వారు కళ, శిల్పం, వాస్తుశిల్పం, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, పరిశ్రమ, వాణిజ్యం, వ్యవసాయం, వంటకాలకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. మధ్య ఆసియా కళపై వారు తమ ముద్రను వేశారు.

న్యూవా వాస్తుశిల్పం పగోడా, స్థూపం, శిఖర, చైత్య, ఇతర శైలులను కలిగి ఉంటుంది. లోయ బహుళ పైకప్పులతో ప్రత్యేక గుర్తింపుతో కూడిన పగోడాగా ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలో ఉద్భవించి భారతదేశం, చైనా, ఇండోచైనా, జపాన్‌లకు వ్యాపించి ఉండవచ్చుఅని భావిస్తారు. [15] చైనా, టిబెట్‌లో శైలీకృత పరిణామాలను ప్రభావితం చేసిన అత్యంత ప్రసిద్ధ శిల్పకారుడు అరానికో, అతను 13వ శతాబ్దంలో కుబ్లాయ్ ఖాన్ ఆస్థానానికి వెళ్ళాడు. [15] అతను బీజింగ్‌ లోని మియావోయింగ్ ఆలయంలో తెల్లటి స్థూపాన్ని నిర్మించడంలో ప్రసిద్ధి చెందాడు. నేపాల్‌లోని ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఉన్నత స్థాయి సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధి కారణంగా మెరుగైన జీవితం కోసం లోయకు వలస వెళ్లారు. పట్టణీకరణ జరుగుతున్నప్పటికీ, నెవార్లు ఖాట్మండు లోయలో తమ సంస్కృతిని కొనసాగించారు.

పురాణశాస్త్రం

స్వయంబు స్థూపం

స్వయంభూ పురాణం ప్రకారం, ఖాట్మండు లోయ ఒకప్పుడు సరస్సుఅని, దీనిని శాస్త్రవేత్తలు పాలియో ఖాట్మండు సరస్సుగా భావించారు. స్వయంబు స్థూపం ఉన్న కొండలో పూలు పూసిన తామర మొక్కలు ఉన్నాయి. మంజుశ్రీ దేవుడు చంద్రహ్రష అనే ఖడ్గంతో కషాపాల్ (తరువాత చోభర్ అని పిలిచారు) అనే లోయ వద్ద ఒక కొండగట్టును కత్తిరించి, నివాసయోగ్యమైన భూమిని స్థాపించడానికి నీళ్లను పారద్రోలాడని ఒక కథ చెబుతుంది.

గోపాల్ బాన్షావాలి ప్రకారం, కృష్ణుడు తన సుదర్శన చక్రంతో నీటిని బయటకు పంపడానికి కొండగట్టును కత్తిరించాడని, ఆ తర్వాత అతను ఎండిపోయిన లోయను సంచార గోవుల కాపరులైన గోపాలకృష్ణుడు వంశీ ప్రజలకు అప్పగించాడని భావిస్తారు.

భౌగోళిక శాస్త్రం

ఖాట్మండు లోయ నుండి పర్వత దృశ్యం

ఖాట్మండు లోయ గిన్నె ఆకారంలో ఉంటుంది. దీని మధ్య దిగువ భాగం 1,425 metres (4,675 ft) సముద్ర మట్టానికి పైన. ఖాట్మండు లోయ నాలుగు పర్వత శ్రేణులతో చుట్టుముట్టబడి ఉంది. శివపురి కొండలు (2,732 metres or 8,963 feet), ఫుల్‌చౌకి (2,695 metres or 8,842 feet), నాగార్జున ( 2,095 metres or 6,873 feet), చంద్రగిరి, (2,551 metres or 8,369 feet), 536 (9 అడుగులు). ఖాట్మండు లోయ గుండా ప్రవహించే ప్రధాన నది బాగమతి.

ఈ లోయ ఖాట్మండు జిల్లా, లలిత్‌పూర్ జిల్లా, భక్తాపూర్ జిల్లాలతో కలిపి 220 square miles (570 km2) ఉంది. లోయలో ఖాట్మండు, పటాన్, భక్తపూర్, కీర్తిపూర్, మధ్యపూర్ తిమి మునిసిపల్ ప్రాంతాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతం అనేక పరపాలకసంఘాలు, గ్రామీణ మునిసిపాలిటీలతో లలిత్‌పూర్ జిల్లాగా రూపొందించబడింది.నేపాల్ లోయ సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా ఉంది. ఖాట్మండు లోయ 1979లో యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.

చూడదగిన ప్రదేశాలు

దేసే మారు ఝ్యా, దేశంలోనే ఒక రకమైన కిటికీ
చంగు నారాయణ దేవాలయం

ఇది ఖాట్మండు లోయలోని ప్రముఖ దేవాలయాలు, స్మారక చిహ్నాల అసంపూర్ణ అక్షరమాల జాబితా. వీటిలో ఏడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. [2]

వర్తమానం

నారాయణహిత ప్యాలెస్ మ్యూజియం

ఈ లోయ ఏడు సంరక్షించబడిన ప్రదేశాలతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి ఆతిథ్యం ఇచ్చింది: మూడు ప్రాథమిక నగరాల కేంద్రాలు, ఖాట్మండు హనుమాన్ ధోకా, పటాన్ దర్బార్ స్క్వేర్, భక్తపూర్ దర్బార్ స్క్వేర్, రెండు ముఖ్యమైన బౌద్ధ స్థూపాలు, స్వయంభూనాథ్, బౌధనాథ్, రెండు ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు, పశుపతినాథ్, చంగు నారాయణ్. [16] 2003లో, యునెస్కో ఈ ప్రదేశాలను అంతరించిపోతున్నప్రదేశాల జాబితాలో చేర్చింది. ఇది కొనసాగుతున్న సాంస్కృతిక ఆస్తి విశ్వసనీయత, అత్యుత్తమ సార్వత్రిక విలువను కోల్పోతుంది. అంతరించిపోతున్న స్థితి నుండి 2007లో తొలగించారు. [17]

గతంలో, టిబెటన్ బౌద్ధ గురువులు మార్పా, మిలరేపా, ర్వా లోత్సవ, రాస్ చుంగ్పా, ధర్మ స్వామి, XIII కర్మపా, XVI కర్మపా, అనేక మంది ఇతర ప్రముఖ వ్యక్తులు ఖాట్మండు లోయను సందర్శించారు. అయినప్పటికీ, టిబెటన్లులలో అతిపెద్ద సమూహం 1960లలో వచ్చింది. చాలా మంది స్వయంభూనాథ్, బౌధనాథ్ స్థూపాల చుట్టూ స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక ఇతర ప్రసిద్ధ లామాలు ఖాట్మండు లోయలో వారి బౌద్ధ ఆరామాలు, కేంద్రాలను కలిగి ఉన్నారు. [18] లోయలో అంత్యక్రియల వాస్తుశిల్పం, ఉపఖండంలో కనిపించే రాతి శిల్పకళకు చెందిన 1500-సంవత్సరాల కిందటి చరిత్రకు కొన్ని అత్యుత్తమ ఉదాహరణల ఆధారాలను అందిస్తుంది. పటాన్ వంటి నగరాల్లో దాదాపు అన్ని ప్రాంగణాల్లో కైత్యాన్ని ఉంచుతారు. ఖాట్మండు లోయలోని రాతి శాసనాలు నేపాల్ చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు.

జనాభా గణాంకాలు

ఖాట్మండు లోయ మొత్తం జనాభా 2,517,023. [19]

ఖాట్మండు జాతీయ రాజధాని ప్రాంతం

ఖాట్మండు జాతీయ రాజధాని ప్రాంతం
काठमाण्डौ (राष्ट्रिय राजधानी क्षेत्र)
ప్రతిపాదిత భూభాగం
ఖాట్మండు లోయ (ప్రత్యేక భూభాగం)
Nickname: 
నేపా వ్యాలీ
దేశంనేపాల్
రాజధాని భూభాగంఖాట్మండు
Area
 • Total902.61 km2 (348.50 sq mi)
Population
 (2011)
 • Total25,17,023

ఖాట్మండు లోయను బాగమతి ప్రావిన్స్‌లో భాగంగా కాకుండా ప్రత్యేక జాతీయ రాజధాని భూభాగంగా అభివృద్ధి చేయాలని నేపాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది. [20] [21] [22] ఖాట్మండు లోయలో బాగమతి ప్రావిన్స్‌లోని 3 జిల్లాలు ఉన్నాయి, వీటిలో మొత్తం జనాభా 2472071 మంది ఉన్నారు. దీని మొత్తం వైశాల్యం 933.73 square kilometres (360.52 sq mi) ఉంది

జిల్లాప్రాంతంజనాభా
ఖాట్మండు413.69 square kilometres (159.73 sq mi)1,699,288
భక్తపూర్123.12 square kilometres (47.54 sq mi)304,651
లతీపూర్396.92 square kilometres (153.25 sq mi)468,132
ఖాట్మండు (జాతీయ రాజధాని ప్రాంతం)933.73 square kilometres (360.52 sq mi)2,472,071

స్థానిక స్థాయి సంస్థలు

  • బుదనిలకంఠ
  • చంద్రగిరి
  • దక్షిణకాళి
  • గోకర్ణేశ్వర్
  • కాగేశ్వరి మనోహర
  • ఖాట్మండు
  • కీర్తిపూర్
  • నాగార్జున
  • శంఖరాపూర్
  • తారకేశ్వర్
  • తోఖా
  • భక్తపూర్
  • చంగునారాయణ
  • మధ్యపూర్ తిమి
  • సూర్యాబినాయక్
  • లలిత్పూర్
  • మహాలక్ష్మి మున్సిపాలిటీ
  • గోదావరి మున్సిపాలిటీ
  • కొంజ్యోసన్ రూరల్ మునిసిపాలిటీ
  • బాగమతి గ్రామీణ మున్సిపాలిటీ
  • మహంకాల్ రూరల్ మున్సిపాలిటీ

ఇది కూడ చూడు

  • నేపాల్ సంస్కృతి
  • డోలాఖా నెవార్ భాష
  • కీర్తిపూర్ యుద్ధం
  • ఖాట్మండు యుద్ధం
  • లలిత్‌పూర్ యుద్ధం

ప్రస్తావనలు

వెలుపలి లంకెలు