2015 నేపాల్ భూకంపం

నేపాల్ భూకంపం (హిమాలయన్ భూకంపం అని కూడా వ్యవహరిస్తున్నారు) 7.8 (Mw) తీవ్రతతో 2015 ఏప్రిల్ 25 శనివారం నాడు 11:56 నేపాల్ స్టాండర్డ్ టైం (6:11:26 యుటీసీ) సమయంలో సంవించిన భూకంపం. లమ్‌జంగ్ (నేపాల్) కు ఆగ్నేయంగా దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం నెలకొనివుంది. 1934 నేపాల్-బీహార్ భూకంపం తర్వాత నేపాల్‌లో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇదే.[1] దాదాపు 8,300 మంది ప్రజలు నేపాల్, భారతదేశంలోనూ, చైనాలోనూ, బంగ్లాదేశ్‌లోనూ దానికి సమీపంలో గల ప్రాంతాల్లో భూకంపం వల్ల కలిగిన ప్రమాదాల్లో చనిపోయారు.[5]

2015 నేపాల్ భూకంపం
2015 నేపాల్ భూకంపం is located in Nepal
2015 నేపాల్ భూకంపం
Kathmandu
Kathmandu
తేదీ2015 ఏప్రిల్ 25 (2015-04-25)
ఆరంభ సమయం11:56:26 NST[1]
తీవ్రత7.8 Mw[1]
లోతు15.0 kilometers (9 mi)[1]
భూకంపకేంద్రం28°08′49″N 84°42′29″E / 28.147°N 84.708°E / 28.147; 84.708[1]
రకంThrust[1]
ప్రభావిత ప్రాంతాలు
మొత్తం నష్టం$3–3.5 billion direct losses[2]
అత్యధిక తీవ్రతIX (Violent)[1]
Aftershocks6.6 Mw on 25 April at 12:30
6.7 Mw on 26 April at 12:54 [3]
ప్రమాద బాధితులు2,263 dead[4]

భూకంపం ఎవరెస్ట్ పర్వతం మీంచి హిమ సంపాతానికి దారితీసింది, దాని కారణంగా 17మంది మృతి చందారు. మృతుల సంఖ్య 2014 నేపాల్ హిమ సంపాతంలో మృతిచెందిన వారి సంఖ్యను దాటుకుపోయి, ఎవరెస్టు శిఖరంపైన అత్యంత ప్రాణాంతకమైన రోజుగా నిలిచింది.[6] ఖాడ్మండు దర్బార్ స్క్వేర్ సహా, కాఠ్మండు లోయలో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక కేంద్రంలో శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడాలు కూలిపోయాయి.

భారత సైన్యం సహాయం

ఆపరేషన్ మైత్రి పేరుతో భారత వైమానిక దళానికి చెందిన 13 సైనిక విమానాలు.. క్షతగాత్రుల కోసం మందులు, తాత్కాలిక ఆస్పత్రులు, టెంట్లు, బ్లాంకెట్లు, 50 టన్నుల నీరు, ఆహారం తదితర సహాయ సరుకులతో 2015 ఏప్రిల్ 26, ఆదివారం కఠ్మాండు చేరుకున్నాయి. జాతీయ విపత్తు సహాయ దళం నుంచి 700 మందికి పైగా సహాయ చర్యల నిపుణులు రంగంలోకి దిగారు. భూకంపంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించింది. గాలింపు, సహాయం, వైద్య బృందాలు, ఆస్పత్రులకు టెంట్లు, శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలు, రవాణా సౌకర్యాలు దెబ్బతిన్న ప్రాంతాలను చేరుకోవటానికి హెలికాప్టర్లు వంటి విషయాల్లో సహాయం కోసం నేపాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేయటంతో.. ప్రపంచం నలుమూలల నుంచీ సహాయ ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. అమెరికా, బ్రిటన్, చైనా, పాకిస్తాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు సహాయం పంపించనున్నట్లు ప్రకటించాయి.

నష్టము

ఈ భూకంపం వలన నేపాల్ దేశంలో అపార ఆస్తి నష్టం, జన నష్టం సంభవించింది. కచ్చితంగా తెలియకపోయినా దాదాపు 15 వేల మంది మరణించారని, లెక్కలేనంతమంది క్షతగాత్రులుగా మారారని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.

మూలాలు

బయటి లంకెలు