జి స్పాట్

జి స్పాట్ అనబడే కామకేంద్రం స్త్రీ యోని లోపల దాగి వుంటుంది. సంభోగంలో, స్త్రీ భావ ప్రాప్తి చెందడానికి ఈ కామకేంద్రం ప్రేరేపింపచేస్తే చాలునని వైజ్ఞానికులు, పరిశోధకులు తేల్చి చెప్పారు.

యోని యొక్క అంతర్గత భాగాలు.
(4) జి స్పాట్ దాదాపు యోని ఉపరితలం నుండి మూడు అంగుళాల లోతుగా, మూత్ర నాళికకు (6), మూత్ర కోశానికి (2) మధ్యన ఉంటుంది

జి స్పాట్, స్త్రీ ప్రోస్ట్రేట్గా కొంతమంది పేర్కొన్నారు.[1] గ్రాఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు, మొట్టమొదటిసారిగా ఇలాంటి కామకేంద్రం స్త్రీలలో యోని లోపలి భాగాన ఉందని కనుగొన్నాడు. ఈ కామోద్రేక కేంద్రాన్ని అతని పేరులోని మొదటి అక్షరం వచ్చేట్టు జి స్పాట్ అని పిలుస్తారు. ఆకారంలోనూ, పరిమాణంలోనూ, అలసంద గింజను పోలివుంటుంది. నిర్వహించిన ప్రయోగల్లో ఎందరో స్త్రీలు, తమ యోని లోపల ఒక బుడిపె లాంటి ప్రదేశం ఉందని, దాన్ని ఉత్తేజ పరిస్తే, తమలో కామోద్రేకం, కట్టలు తెంచుకుని భావప్రాప్తి చెందామని, యోనిలో స్కలనం జరిగి, ఆ ప్రదేశం చిత్తడై పోయిందని ధ్రువీకరించారు.[2] సంభోగంలో గాని, స్వయంతృప్తి కోసం చేసే హస్త ప్రయోగం ద్వారా గాని, లేదా ఇప్పుడు లభ్యమౌతున్న వివిధ రకాల పరికరాల ద్వారా గానీ జి స్పాట్ ఉత్తేజ పరచబడి, కామోద్రేకానికి గురై, తదుపరి పరాకాష్ఠలో భావప్రాప్తి కలిగిస్తుంది.

1940లో కనుగొనబడ్డా, జి స్పాట్ మీద వివాదాలు ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు.[3] బ్రిటిష్ వైజ్ఞానికులు 2009లో జరిపిన పరిశోధనలలో, అసలు జి స్పాట్ అనేదే లేదని తేల్చి చెప్పారు. ఆయితే ఆ తరువాతి ప్రయోగాల్లో, భావ ప్రాప్తి చెందామని చెప్పిన వారిని అల్ట్రాసౌండ్ పరికరాలతో, భౌతికంగా పరీక్షలు, నిర్వహించి పరిశోధకులు జి స్పాట్ ఉందని తేల్చారు. కొన్ని పరిశోధనలలో ఉందని, మరికొన్ని పరిశోధనలలో లేదని వైజ్ఞానిక వర్గాలు కొట్టుకుంటుంటే, మాస్టర్స్, జాన్సన్ తమ పుస్తకంలో జి స్పాట్, క్లైటోరిస్ యొక్క ఎక్స్టెంషనుగా భావించారు.[4]

ఈ వివాదాలన్నీ మరో విచిత్ర పరిస్థితికి దారి తీసింది! తమలో జిస్పాట్ కనుగొనలేక పోయిన మహిళలు, తాము జడులమని భావించి, మానసిక ఒత్తిడికి లోనయినట్టు బిబిసి తెలిపింది.[5] తమలోని జి స్పాట్ మరింత సులువుగా ఉత్తేజపడేట్టు చేయడానికి, కొంతమంది (జి స్పాట్ యాంప్లిఫికేషన్ అనే) ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు.

మూలం

గ్రాఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు, మొట్టమొదటిసారిగా ఇలాటి కామకేంద్రం స్త్రీలలో యోని లోపలి భాగాన ఉందని కనుగొన్నాడు కనుక, ఈ కామోద్రేక కేంద్రాన్ని అడ్డిఏగో 1981, అతని పేరులోని మొదటి అక్షరం వచ్చేట్టు జి స్పాట్ అని పేరు పెట్టాడు.[6]

స్త్రీల ప్రోస్టేట్

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోషియేషన్స్ ఆఫ్ అనాటమిస్ట్స్, 2001లో జి స్పాట్ను స్త్రీల యొక్క ప్రోస్ట్రేట్ గా గుర్తించారు.[1]

బయటి లింకులు