తల్లిపాలు

తల్లిపాలు సృష్టిలో క్షీరద జాతికి చెందిన ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం.

తల్లి పాలు - ఎడమ పక్క గ్లాసు లోది నిండుగా ఉన్న వక్షం తొట్టతొలిగా వచ్చే పాలు, కుడి వైపు దాని లోది దాదాపుగా ఖాళీ అయిన వక్షం నుండి వచ్చే చివరి పాలు. మొదటి దానిలో నీరు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండి, దాహం తీరుస్తుంది. రెండవ దానిలో నీరు తక్కువగా, కొవ్వు ఎక్కువగా ఉండి, ఆకలి తీరుస్తుంది.

తల్లిపాలు ఏర్పడానికి గృహవైద్యాలు

కొన్ని గ్రామాల్లో బాలింతలు మట్టి పొయ్యి లేదా గ్యాస్ స్టౌ మీద అన్నం ఉడికే సమయంలో పొంగే నురగను గ్లాసు నిండా సేకరించి మధ్యాహ్నం భోజన సమయంలో సేవిస్తారు. ఈ విధంగా సేకరించిన నురగను పొంగాపు నీళ్ళు అని అంటారు.

సాధారణంగా ఎలక్ట్రిక్ కుక్కుర్ లో ఒక వంతు బియ్యనికి రెండు వంతులు నీళ్ళు పొయాల్సివస్తుంది. కాని పొంగాపు నీళ్ళకోసం మరో రెండు గ్లాసులు అనగా 1 వంతు బియ్యానికి 4 వంతులు నీళ్ళు అవసరమవుతాయి. అయితే ఆ 4 వంతుల నీళ్ళలో బియ్యం కొద్దిగా ఉడికి బుడగలు రావడం మొదలవ్వగానే అందులోంచి రెండు గ్లాసుల నీళ్ళను వేసి సేవించాలి. ఇది నగరాల్లో బాలింతలు అనుసరించవలసిన పద్ధతి.

పొంగాపు నీళ్ళు సేవిస్తే బాలింతల్లో తల్లిపాలు అమోఘంగా అతి తక్కువ సమయంలో తయారవుతాయి. ఈ నీళ్ళలో చిటికెడు ఉప్పు లేదా పాలు లేదా మజ్జిగ కలుపుని సేవించవచ్చు.

ఈ అవకాశం లేని వారు రెడ్డివారి నానుబాలు (యూఫోర్బియా హిర్తా) [1] మొక్కల ఆకులను కూరగా చేసుకొని తినాలి, లేదా పొన్నగంటి కూర ఆకులను లేదా పచ్చి బొప్పాయి కూర తినాలి లేదా ఒక కప్పు నీళ్ళ్లలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి రాత్రి మొత్తం నానపెట్టి ఉదయం ఆ నీళ్ళని వేడి చేసి, వడపోసి ప్రతిరోజు తాగాలి. బాలింతలు ఎక్కువగా మసాలాలు, వాతం చేసే పదార్ధాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

కొవ్వు
మొత్తం(g/100 ml)4.2
ఫాటీ ఆమ్లాలు - length 8C (% )trace
polyunsaturated fatty acids (%)14
ప్రొటీన్ (g/100 ml)
మొత్తం1.1
casein 0.40.3
a-lactalbumin0.3
లాక్టోఫెర్రిన్0.2
IgA0.1
IgG0.001
లైసోజైమ్0.05
serum albumin0.05
ß-lactoglobulin-
కార్బోహైడ్రేట్ (g/100 ml)
లాక్టోజు7
oligosaccharides0.5
మినరల్స్ (g/100 ml)
కాల్షియం0.03
పాస్ఫరస్0.014
సోడియం0.015
పొటాషియం0.055
క్లోరిన్0.043

మూలాలు

బయటి లింకులు