పబ్ జి వీడియో గేమ్


పబ్ జి (English: PUBG) అనేది ఒక వీడియో గేం. ఇది చరవాణిలో అత్యంత ఎక్కువగా ఆడబడు ఆట. 'ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌ గ్రౌండ్స్'కు (PlayerUnknown's Battlegrounds) సంక్షిప్త రూపమే పబ్‌జి.దీన్ని దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జి కార్పొరేషన్ తయారు చేసింది. 2017లో ఇది విడుదలైంది.పబ్‌జిలోకి లాగిన్ అయ్యాక ఫేస్‌బుక్ లేదా మరేదైనా సోషల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.ఒంటరిగా ఆడుతున్నపుడు ఇతరుల సహకారం లభించదు. మీరు ఒక్కరే మిగతా చంపాల్సి ఉంటుంది.జట్టుగా కలిసి ఆడుతున్నపుడు ఇద్దరు లేకుంటే నలుగురు కలిసి ఇతరులను చంపాల్సి ఉంటుంది. వీరితో మాటల సంభాషణ కూడా ఉంటుంది.

యుద్ధభూమి

ఆటలో 8X8 కిలోమీటర్ల యుద్ధ భూమి ఉంటుంది. ఇందులో పలు భవనాలు, శిథిలాలు, వాహనాలు, ఆయుధాలు, తదితరాలు ఉంటాయి.ఇందులో మొదట విమానం నుంచి ప్యారాషూట్‌ ద్వారా యుద్ధభూమిలో అడుగుపెడతాము.ఇక్కడకు దిగిన తర్వాత తనను తాను రక్షించుకోడానికి హెల్మెట్. ఇతరులను హతమార్చేందుకు ఆయుధాలను సేకరించాల్సి ఉంటుంది.

ఆయుధాలు

కత్తులు, రకరకాల తుపాకులు, బుల్లెట్లు, బాంబులు, గ్రెనేడ్‌లు ఉంటాయి.వీటితో పాటు గాయపడినపుడు కట్లు వేసేందుకు బ్యాండెయిడ్స్, ప్రథమ చికిత్స కిట్లు, ఎనర్జీ డ్రింకులు ఉంటాయి.వాహనాలు కూడా ఉంటాయి.వాటిని డ్రైవ్ చేసుకొని వెళ్లొచ్చు.

ఆటఆడే విధానం

చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలివారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే ప్రత్యర్థిచేతుల్లో చావాల్సి ఉంటుంది. గేమ్‌లో రెడ్ జోన్, నీలి మేఘాలు తరుముకుంటూ వస్తాయి.రెడ్ జోన్‌లో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. గేమ్‌లో సూచించిన సర్కిల్ లోనే గేమ్ ఆడాలి.గేమ్‌లో సర్కిల్ చిన్నదవుతూ మిగిలిన ప్రత్యర్థులను దగ్గర చేస్తూ ఉంటుంది. దీంతో గేమ్ కష్టతరంగా మారుతుంది.[1][2]

మూలాలు