పవన విద్యుత్తు

గాలిని విద్యుత్తుగా మార్చే విధానం

పవన విద్యుత్తు అనగా గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చడం. 2007 నాటికి ప్రపంచం మొత్తమ్మీద సుమారు 94.1 గిగావాట్ల విద్యుచ్చక్తి ఉత్పత్తి అవుతున్నదని అంచనా.[1] ప్రస్తుతానికి ప్రపంచం వినియోగించే మొత్తం విద్యుత్తులో పవన విద్యుత్తు వినియోగం కేవలం 1 శాతమే[2] అయినా, 2000 నుంచీ 2007 వరకు ఐదురెట్ల వేగంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. [1] చాలా దేశాలలో ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో వాడుకలో ఉంది. డెన్మార్క్ లో 19%, స్పెయిన్, పోర్చుగల్ లో 9%, జర్మనీ, ఐర్లాండ్ లలో 6% విద్యుదుత్పత్తి పవనశక్తినుంచే ఉత్పత్తి అవుతున్నది. భారతదేశంలో పవన శక్తి మొత్తం ఉత్పత్తిలో 1.6 శాతం దాకా ఉంది.

సైన్సుకు సంబంధించిన కారణాల రీత్యా మూడు రెక్కలు కలిగిన గాలి మర సాధారణంగా అన్నిచోట్లా వాడతుంటారు

పవన శక్తిని భారతదేశంలో పూర్వీకులు, చాలా ఏళ్ళ ముందునుంచీ నావలను నడపడానికీ, నీటిని తోడటానికి, గింజలను పొడి చేయడానికి వాడేవారు. కానీ ప్రస్తుతం దీని ఉపయోగం ఎక్కువగా విద్యుదుత్పత్తిలోనే. పవన విద్యుత్తు శిలాజ ఇంధనాల వంటి ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తుతో పోలిస్తే తక్కువ గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుంది కాబట్టి, పర్యావరణ కారులు దీన్ని మంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా భావిస్తున్నారు.

చరిత్ర

మానవుడు కనీసం 5,500 సంవత్సరాలకు పూర్వమే పవన శక్తిని తెరచాపల రూపంలో నౌకలను నడపడానికి ఉపయోగించడం నేర్చుకున్నాడు. బాబిలోనియన్ చక్రవర్తియైన హమ్మురాబి 17వ శతాబ్దంలో తాను తలపెట్టిన మహత్తర సాగునీటి పథకం కోసం పవన శక్తిని ఉపయోగించాలనుకున్నాడు.[3]

మూలాలు