పారసైట్ (2019 సినిమా)

పారసైట్ (Parasite ఆంగ్లంలో, అక్షరాలా పరాన్నజీవి; Korean: 기생충 కిషైంచూంగ్) 2019లో బాంగ్‌ జూన్‌ హో దర్శకత్వంలో విడుదలైన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ దక్షిణ కొరియా చిత్రం. ఒక పేద కుటుంబ సభ్యులు సంపన్న కుటుంబంలోకి చొరబడి, సంబంధం లేని అత్యంత అర్హత కలిగిన వ్యక్తులుగా పనిచేయాలని ప్లాన్ చేయడం కానీ అబద్ధాల ఆధారంగా వారి కొత్త జీవితాలను నిలబెట్టుకోవడం వారికి అంత సులభం కాదు అన్నది ఈ సినిమా మూల కథ. ఈ చిత్రం $ 167.6 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది, దేశీయ మార్కెట్‌లో దక్షిణ కొరియా యొక్క 19వ అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది.ఈ చిత్రం ఐట్యూన్స్, అమెజాన్, వూడూ, గూగుల్ ప్లే, యూట్యూబ్ మూవీస్ వంటి వివిధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంది

పారసైట్
దస్త్రం:పారసైట్.png
దర్శకత్వంబాంగ్‌ జూన్‌ హో
స్క్రీన్ ప్లే
  • బాంగ్‌ జూన్‌ హో
  • హాన్ జిన్-వన్
కథబాంగ్‌ జూన్‌ హో[1]
నిర్మాత
  • క్వాక్ సిన్-ఎ
  • మూన్ యాంగ్-క్వాన్
  • బాంగ్‌ జూన్‌ హో
  • జాంగ్ యంగ్-హ్వాన్
తారాగణం
ఛాయాగ్రహణంహాంగ్ క్యుంగ్-ప్యో[3]
కూర్పుయాంగ్ జిన్-మో
సంగీతంజంగ్ జే-ఇల్[1]
నిర్మాణ
సంస్థ
బారున్సన్ E&A[1]
పంపిణీదార్లుCJ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీs
2019 మే 21 (2019-05-21)(Cannes)
30 మే 2019 (దక్షిణ కొరియా)
సినిమా నిడివి
132 నిముషాలు[2][4]
దేశందక్షిణ కొరియా[1][2]
భాషకొరియన్
బడ్జెట్₩13.5 billion[5]
(~US$11 మిలియన్)
బాక్సాఫీసు$165.4 మిలియన్[6][7][8]

చిత్రీకరణ

పారసైట్సి నిమా చిత్రీకరణ 2018 మే 18 న ప్రారంభమైంది, 77 రోజులు చిత్రీకరించబడింది, అదే సంవత్సరం సెప్టెంబరు 19న పూర్తయింది. మొత్తం సినిమా ప్రధానంగా జియోంజు నగరంలో చిత్రీకరించబడింది

అవార్డులు

92వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో పారసైట్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రంగా ఆస్కార్ అవార్డులను అందుకుంది.ఇది అకాడమీ అవార్డు గుర్తింపు పొందిన మొదటి దక్షిణ కొరియా చిత్రంగా, అలాగే ఉత్తమ చిత్రాన్ని గెలుచుకున్న మొదటి ఆంగ్లేతర భాషా చిత్రంగా నిలిచింది. ఇది 77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది 73వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులలో నాలుగు నామినేషన్లను పొందింది, ఆంగ్ల భాషలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లేని గెలుచుకుంది. మోషన్ పిక్చర్‌లో తారాగణం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన కోసం స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును గెలుచుకున్న మొదటి ఆంగ్లేతర భాషా చిత్రంగా ఇది నిలిచింది.

మూలాలు