ప్రపంచ జల దినోత్సవం

ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22 న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు.[1] 1992 బ్రెజిల్ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది.[1]

ప్రపంచ జల దినోత్సవం
ప్రపంచ జల దినోత్సవం
2010 లో కెన్యాలో జరిగిన ప్రపంచ జల దినోత్సవ వేడుకలు
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా ప్రజలు , సంస్థలు, అన్ని యు.ఎన్. సభ్యత్వ రాష్ట్రాలతో సహా
జరుపుకొనే రోజు22 మార్చి
సంబంధిత పండుగనీరు, స్త్షిరాభివృద్ధి
ఆవృత్తివార్షిక

ఆ రోజు ఇతివృత్తంగా పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత లకు సంబంధించిన అంశాలపై దృష్టి పెడుతుంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్‌లోని ఆరవ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.[2] ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక (WWDR) విడుదల అవుతుంది.

యుఎన్-వాటర్ ప్రపంచ జల దినోత్సవానికి కన్వీనరు. ప్రతి సంవత్సరం, ఆ రోజునటి థీమ్‌గురించి దానిపట్ల ఆసక్తి ఉన్న ఐరాస సంస్థలతో సంప్రదిస్తుంది.[1] 2020 యొక్క థీమ్ "నీరు, వాతావరణ మార్పు". ఈ రెండు సమస్యల మధ్య విడదీయరాని అనుసంధానం ఎలా ఉందో పరిశీలిస్తుంది.[3] COVID-19 మహమ్మారి కారణంగా, 2020 ప్రచారంలో చేతులు కడుక్కోవడం గురించి, పరిశుభ్రత గురించి సందేశాలను ఇచ్చి ప్రోత్సహించింది. ప్రచారానికి మద్దతు ఇస్తూ సురక్షితంగా ఉండటానికి మార్గదర్శకత్వం ఇచ్చింది.

2019 నాటి థీమ్ "ఎవరినీ వెనకబడ నివ్వం".[4] 2014 నుండి 2018 సంవత్సరాలకు ఇతివృత్తాలు "నీరు, శక్తి" [5], "నీరు, సుస్థిర అభివృద్ధి" [6], "నీరు, ఉద్యోగాలు", [7] "నీటిని ఎందుకు వృథా చేస్తారు?", [8] "నీటొ కోసం ప్రకృతి"[9]

ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఇవి నాటకం గాని, మ్యూజికల్, లేదా ప్రకృతిలో లాబీయింగ్ గానీ కావచ్చు. ఆ రోజున నీటి ప్రాజెక్టుల కోసం డబ్బును సేకరించే ప్రచారాలను కూడా చేపట్టవచ్చు.

చరిత్ర

మార్చి 22న ప్రపంచమంతా ప్రపంచ నీటి దినోత్సవం దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నీటిని సంరక్షించడం ప్రాముఖ్యత గురించి సమాజములో అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1993 లో ఈ రోజుగా ప్రకటించింది. 1992 సంవత్సరంలో రియో డి జనీరోలో జరిగిన " యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ " షెడ్యూల్ 21 లో మొదటిసారిగా దీనిని అధికారికంగా ప్రతిపాదన చేయడం జరిగింది.

సామాజిక ఆర్థిక వృద్ధి ఎక్కువగా నీటిపైనే ఆధారపడి ఉంటుంది. త్రాగునీరు మానవ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు చాలా అవసరం, పోషకాహారం, గాలి, మానవ జాతికి ప్రాథమిక జీవనోపాధిని అందిస్తుంది, ఇవి లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. మంచినీటి విషయానికి వస్తే, గ్రహం మొత్తం వైశాల్యంలో కొద్ది భాగం మాత్రమే మానవ ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది[10].

అవలోకనం

అత్యంత విలువైన వనరులలో నీరు ఒకటి. బాధ్యతాయుతమైన నీటి వినియోగాన్ని, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీటి అందుబాటును ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 22 న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటారు.

ప్రతిరోజూ, ప్రజలు తాగు, వ్యవసాయం, పరిశ్రమలు, వినోదం, పరిశుభ్రత, పారిశుధ్యం, ఆరోగ్య సంరక్షణ కోసం నీటిని ఉపయోగిస్తారు. నీటి వనరులు అమూల్యమైనవి, పరిమితమైనవి. అధిక  ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పిడులు, ఇతర సహజ, మానవ నిర్మిత ఒత్తిళ్లు మన నీటి పరిమాణం, నాణ్యతను ప్రభావితం చేస్తాయి.

సురక్షితమైన నీరు, తగినంత పారిశుధ్యం, పరిశుభ్రత వనరులకు ప్రపంచములో వచ్చే వివిధరకాల అంటువ్యాదుల నుండి కాపాడాడుకోవడం వల్ల ప్రజలలో  అనారోగ్యం, మరణాన్ని తగ్గిస్తుంది.  మెరుగైన ఆరోగ్యం, పేదరిక తగ్గింపు, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది. కోవిడ్-19 మహమ్మారి సురక్షితమైన నీటికి సార్వత్రిక ప్రాప్యత  తక్షణ అవసరాన్ని ప్రపంచ ప్రజలకు మరింత తెలిపింది.  ప్రపంచవ్యాప్తంగా, 2.2 బిలియన్ల మందికి సురక్షితమైన తాగునీరు లేదు, 3.6 బిలియన్ల మందికి సురక్షితమైన పారిశుద్ధ్య సేవలు లేవు, 2.3 బిలియన్ల మందికి ఇంట్లో సబ్బు, నీటితో చేతులు కడుక్కునే సదుపాయం అందుబాటులో లేదు.

టైఫాయిడ్ జ్వరం, కలరా వంటి అనేక డయేరియా వ్యాధులు రావడానికి కలుషిత నీటి   పారిశుధ్యం ద్వారా వ్యాపిస్తాయి. యునైటెడ్ స్టేట్స్లో తక్కువగా  ఉన్నప్పటికీ, టైఫాయిడ్, కలరా వ్యాప్తి ఇతర దేశాలలో  సంభవిస్తూనే ఉంది. ఈ వ్యాధులు కలిసి లక్షలాది మందిని అనారోగ్యానికి చేయటం, ఫలితంగా ప్రతి సంవత్సరం 257,400 మంది మరణిస్తున్నారని అంచనా.

అతిసార వ్యాధులను నివారించడానికి నీటి వనరులను రక్షించడం, మానవ వ్యర్థాల నీరు, పర్యావరణం నుండి దూరంగా ఉంచడానికి నూతన  వ్యవస్థలను అభివృద్ధి చేయడం, నిర్వహించడం అత్యవసరం. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి  ముఖ్యమైన చర్యలలో ఒకటి. అనేక ఇతర డయేరియా వ్యాధులకు ముఖ్యమైన చికిత్స అయిన నోటి రీహైడ్రేషన్ థెరపీ (ఒఆర్టి) లో సురక్షితమైన నీరు కూడా ఒక ముఖ్యమైన భాగం[11].

ఇజ్రాయెల్ నమూనా

నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించే  దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా లేవు. అయితే 70 ఏళ్ల క్రితం పుట్టిన ఇజ్రాయెల్ 60 శాతం ఎడారితో ఏర్పడి నీటి వనరుల కొరతతో సతమతమవుతోంది. ఒకప్పుడు సొంత నీటి అవసరాలను తీర్చుకోవడం కష్టంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు నీటి నిర్వహణలో విజయవంతమైన ఇజ్రాయెల్  సాధించింది. ఇజ్రాయెల్ లో దాదాపు 80 శాతం మురుగునీటిని రీసైకిల్ చేసి పునర్వినియోగం చేస్తున్నారు.  ఇజ్రాయిల్ 60 శాతం ఎడారిగా ఉన్నప్పటికీ, శాశ్వత నీటి వనరులు లేనప్పటికీ,  ఆ దేశం  నీటి సంక్షోభాన్ని అధిగమించింది, 150 కి పైగా దేశాలు ఇప్పుడు నీటి నిర్వహణ రంగాలలో ఇజ్రాయిల్ ను ఒక నమూనాగా చేసుకొని వారి దేశాలలో నీటి సమస్యనుంచి  శాశ్వత విముక్తికి ప్రణాళికలను చేసుకుంటున్నాయి[12] .

భారతదేశం

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2019 లో జల్ శక్తి అభియాన్ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్దేశించింది. దీనిని 2019 జూలై 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు, 2019 అక్టోబరు 1 నుంచి 2019 నవంబరు 30 వరకు రెండు దశల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నీటి సంరక్షణ, వర్షపునీటి సంరక్షణ నిర్మాణాల నిర్మాణం, నిర్వహణ, వివిధ సంప్రదాయ జలవనరుల చెరువుల పునరుద్ధరణ, బోరుబావుల పునర్వినియోగం, రీచార్జి, వాటర్ షెడ్ అభివృద్ధి, ముమ్మర అడవుల పెంపకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించకపోతే, రాబోయే కొన్నేళ్లలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సహా మరో 20 నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిని నివారించడానికి ఏకైక పరిష్కారం, నీటి సంరక్షణ ఉన్న అన్ని పద్ధతులను అవలంబించడం, గృహముల నుంచి అడవుల వరకు మానవులు నీటి సంరక్షణ చేయడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత స్థాయిలో చేసి నీటి సంక్షోభం నుంచి నివారణే దీనికి మార్గం[13].

మూలాలు