బహాయి విశ్వాసం

ఇరాన్‌లో 1863లో బహావుల్లా స్థాపించిన ఏకధర్మ మతం;

బహాయిజం లేదా బహాయి విశ్వాసము (ఆంగ్లం : Bahá'í Faith), ఈ విశ్వాస స్థాపకుడు బహావుల్లా. ఇతను పర్షియా, 19వ శతాబ్దం నకు చెందినవాడు.[1] ప్రపంచంలో ఈ విశ్వాసులు 60 లక్షలమంది, 200 కి పైగా దేశాలలో వ్యాపించియున్నారు.[2][3]బహాయి విశ్వాసం ప్రకారం, మొత్తం మానావాళి ఒకేజాతి, ఇబ్రాహీం, మూసా, జొరాస్టర్, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు, ఈసా, ముహమ్మద్, ఆఖరున బహావుల్లా వీరందరూ ప్రవక్తలు.[4]బహావుల్లా పేరు మీద ఈ విశ్వాసానికి బహాయి విశ్వాసమని, ఈ విశ్వాసాన్ని కలిగివున్నవారికి 'బహాయీలు' అని వ్యవహరిస్తారు.[5]

'విశ్వ న్యాయ భవనం' బహాయీల పరిపాలనా స్థలి, ఇస్రాయెల్ లోని హైఫాలో ఉంది.
ఓ లిపీకళాకృతి, "గొప్ప పేరు"ను సూచిస్తుంది

బహాయిజం ఇరాన్‌ రాజధాని టెహరాన్‌ నగరంలో సా.శ. 1863లో ప్రారంభమైన మతం. దీని వ్యవస్థాపకుడు మీర్జా హుసేన్‌ అలీ నూరి (Mirza Hoseyn Ali Nuri). ఆయన ఒక వజీరు కుమారుడు 1817లో టెహరాన్‌ (పర్షియా) లో జన్మించాడు. ఒక పెద్ద పదవిని చేపట్టవలసిన సమయంలో దానిని తృణీకరించి, దైవ ప్రేరణవల్ల కొత్త మతాన్ని స్థాపించాడు. ఆయనను బహాయుల్లా అని కూడా పిలిచేవారు. ఈ పేరు వల్లనే బహాయిజం అనే పదం వాడుకలోకి వచ్చింది. బహాయుల్లా అంటే దేవుని ప్రకాశం శోభ, తేజస్సు. ‘‘దేవుడు ఒక్కడే. సర్వ మానవాళి ఒకే కుటుంబం. స్వర్గ నరకాలనేవి ఎక్కడో ఉన్న లోకాలు కావు, అవి స్థితులు మాత్రమే. చేసిన మంచి చెడులను బట్టి మరణానంతరం ఆత్మ దేవుడికి దగ్గరగానో, దూరంగానో పయనిస్తుంది. ఎవరి పట్లా ఎవరికీ అసహనం ఉండకూడదు. సత్యాన్వేషణ ఎవరికి వారు చేసుకోవలసిందే.’’ అని ఈ మతం ప్రబోధిస్తుంది. ఇజ్రాయిల్‌లోని హైఫా ఈ మతం కేంద్ర స్థానం. ఈ మతాన్ని పాటించేవారు ఇండియాతో సహా చాలా దేశాలలో ఉన్నారు. సంఖ్య లక్షలలో ఉంటుంది. తొమ్మిది కోణాల నక్షత్రం ఈ మతం గుర్తు. బహాయుల్లా రచనలే ఈ మతానికి పవిత్ర గ్రంథాలు. వీరికి అర్చక వర్గం అంటూ ఏదీ లేదు. ఇరాన్‌లో పుట్టిన ఈ విశ్వాసానికి అక్కడి పాలకుల నుంచి వ్యతిరేకత ఉంది. అందువల్ల కేంద్ర స్థానం ఇరాన్‌ వదల వలసి వచ్చింది.

చిత్రమాలిక

ఇవీ చూడండి

గమనింపులు

మూలాలు

  • పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010.

బయటి లింకులు