బుధవారం

బుధవారం (Wednesday) అనేది వారంలో నాల్గవ రోజు. ఇది మంగళవారంనకు, గురువారంనకు మధ్యలో ఉంటుంది.బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.హిందూ పురాణాలప్రకారం బుధవారాన్ని వ్యాపారులు సరుకుల దేవుడుగా భావిస్తారు.

బుధుడు ప్రతిరూపం

థాయలాండ్ సౌర క్యాలెండర్ ప్రకారం, బుధవారం ఆకుపచ్చ రంగుకు సంకేతంగా భావించి.ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే ఫ్రా ఇసువాన్ 17 ఆధ్యాత్మిక ఏనుగులను చుట్టుముట్టి వాటిని పొడిగా మార్చాడు, దానిని అతను ఆకుపచ్చ ఆకుతో చుట్టాడు. పవిత్ర జలం చల్లిన తరువాత ప్లూటో గ్రహం సృష్టించాడని వారి నమ్మకం.[1]

హిందూ పురాణల ప్రకారం బుధవారం శ్రీ కృష్ణుడును పూజిస్తే మంచిదని ఒక అభిప్రాయం ఉంది.బుధుడు వివేకవంతుడు.అందువలన తన భక్తులకు వివేకవంతం, సంపద, జ్ఞానాన్ని కలిగిస్తాడని భక్తుల నమ్మకం. గణేశుడు శ్రేయస్సు, జ్ఞానం, సంపదలకు దేవుడుగా భావిస్తారు. అందువల్ల హిందూ పరంపరాప్రాప్తధర్మం ప్రకారం బుధవారం ప్రత్యేకంగా గణేశుడిని పూజిస్తారు.విష్ణువును కూడా పూజిస్తారు.కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి బుధవారాలు మంచి రోజులు. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి బుధ్ సహాయపడుతుంది.[2]

శ్రీ కృష్ణ, శ్రీ విష్ణు, పాండురంగ విఠల్ అందరూ భగవంతుని విభిన్న పేర్లు, రూపాలు అని హిందూ పురాణాల ప్రకారం నమ్ముతారు. శ్రీ కృష్ణుడిని శ్రీ విష్ణు అవతారం అని పిలుస్తారు. ఇది బుధవారం (శ్రావణ అష్టమి) ద్వాపరయుగం చివరలో జరిగింది. విఠల్ శ్రీ కృష్ణుడు మాత్రమే. బుధవారం విఠల్ రోజు అంటారు. కాబట్టి విఠల్ లోని భక్తులు బుధవారం పండరీపూర్ ను విడిచిపెట్టరు.[3]

బుధవారం చేయతగిన పనులు

ఇవి హిందూ పరంపరాప్రాప్తధర్మం ప్రకారం వస్తున్న ఆచారాలు,నమ్మకాలు

  • బుధవారం బుధుడికి ప్రాముఖ్యం ఉన్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
  • అన్నప్రాశన చేయవచ్చు.
  • నామకరణం చేయవచ్చు.
  • వివాహం చేయవచ్చు.
  • నూతనగృహప్రవేశం చేయవచ్చు.
  • బుధుడు వైశ్య ప్రధాన గ్రహం కనుక నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు.
  • బుధవారం విష్ణుసహస్రనామం పారాయణం చేయడం వలన ఫలితం అధికం.

మూలాలు

వెలుపలి లంకెలు