మార్గరెట్ థాచర్

బ్రిటిష్ దేశపు రాజకీయవేత్త, ప్రధానమంత్రి

మార్గరెట్ హిల్డా థాచర్ (ఆంగ్లం: Margaret Hilda Thatcher; 1925 అక్టోబరు 13 - 2013 ఏప్రిల్ 8) 1979 నుంచి 1990 వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌కు ప్రధాన మంత్రిగా వ్యవహరించిన బ్రిటిష్ రాజకీయవేత్త. ఆ పదవిని నిర్వహించిన ఏకైక మహిళగానే కాకుండా దీర్ఘకాలం నిర్వహించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందింది. వ్యక్తిగత, రాజకీయ కఠినత్వం వల్ల ఆమె ఉక్కు మహిళ(ఐరన్ లేడీ)గా పేరు గడించింది. ఆమె రాజీలేని రాజకీయాలు, నాయకత్వ శైలితో థాచెరిజం అని పిలువబడే విధానాలను అమలు చేసింది.

బారోనెస్ థాచర్
పోర్ట్రెయిట్ ఫోటోలో థాచర్
స్టూడియో పోర్ట్రెయిట్ (1995–96)
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి
In office
4 మే 1979 – 28 నవంబర్ 1990
చక్రవర్తిఎలిజబెత్ II
Deputyజెఫ్రీ హోవే (1989–90)
అంతకు ముందు వారుజేమ్స్ కల్లాఘన్
తరువాత వారుజాన్ మేజర్
ప్రతిపక్ష నాయకురాలు (యునైటెడ్ కింగ్‌డమ్)
In office
11 ఫిబ్రవరి 1975 – 4 మే 1979
చక్రవర్తిఎలిజబెత్ II
ప్రథాన మంత్రి
  • హెరాల్డ్ విల్సన్
  • జేమ్స్ కల్లాఘన్
Deputyవిలియం వైట్‌లా, 1వ విస్కౌంట్ వైట్‌లా
అంతకు ముందు వారుఎడ్వర్డ్ హీత్
తరువాత వారుజేమ్స్ కల్లాఘన్
కన్సర్వేటివ్ పార్టీ (UK) నాయకురాలు
In office
11 ఫిబ్రవరి 1975 – 28 నవంబర్ 1990
Deputyవిలియం వైట్‌లా, 1వ విస్కౌంట్ వైట్‌లా
అంతకు ముందు వారుఎడ్వర్డ్ హీత్
వ్యక్తిగత వివరాలు
జననం
మార్గరెట్ హిల్డా రాబర్ట్స్

(1925-10-13)1925 అక్టోబరు 13
గ్రంథం, ఇంగ్లాండ్
మరణం2013 ఏప్రిల్ 8(2013-04-08) (వయసు 87)
లండన్, ఇంగ్లాండ్
సమాధి స్థలంరాయల్ హాస్పిటల్ చెల్సియా
51°29′21″N 0°09′22″W / 51.489057°N 0.156195°W / 51.489057; -0.156195
రాజకీయ పార్టీకన్సర్వేటివ్ పార్టీ (UK)
జీవిత భాగస్వామిసర్ డెనిస్ థాచర్, 1వ Bt
(13 డిసెంబర్ 1951 - 26 జూన్ 2003)
సంతానం
  • సర్ మార్క్ థాచర్, 2వ బిటి
  • ది హాన్ కరోల్ థాచర్
తండ్రిఆల్ఫ్రెడ్ రాబర్ట్స్
కళాశాల
  • సోమర్‌విల్లే కాలేజ్, ఆక్స్‌ఫర్డ్
వృత్తి
  • బారిస్టర్
  • కెమిస్ట్
  • రాజకీయవేత్త
వెబ్‌సైట్Foundation

ఆమె ఆక్స్‌ఫర్డ్‌లోని సోమర్‌విల్లే కాలేజీలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించింది. న్యాయవాది కావడానికి ముందు కొంతకాలం పరిశోధన రసాయన శాస్త్రవేత్తగా పనిచేసింది. 1959లో ఆమె ఫించ్లీ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయింది. ఎడ్వర్డ్ హీత్ తన 1970-1974 కాలంలో విద్య, విజ్ఞాన శాస్త్రానికి రాష్ట్ర కార్యదర్శిగా ఆమెను నియమించాడు. ఆమె 1975లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలలో ఎడ్వర్డ్ హీత్‌ను ఓడించి ప్రతిపక్ష నాయకురాలయింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రధాన రాజకీయ పార్టీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ ఆమె.

1979 సార్వత్రిక ఎన్నికలలో గెలిచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె అధిక ద్రవ్యోల్బణం, ఆర్దిక మాంద్యం నేపథ్యంలో తన శైలి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది. ఆమె రాజకీయం, ఆర్థిక విధానాలు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల ప్రైవేటీకరణకు దారితీసాయి. దాంతో ట్రేడ్ యూనియన్ల ప్రభావం తగ్గింది. మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా ఆమెకు మొదట్లో ప్రజాదరణ క్షీణించినా 1982 ఫాక్లాండ్స్ యుద్ధంలో విజయంతో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనాన్ని తెచ్చిపెట్టింది. ఫలితంగా ఆమె 1983లో తిరిగి ఎన్నికయింది. 1984 బ్రైటన్ హోటల్ బాంబు దాడి హత్యాప్రయత్నం నుండి ఆమె బయటపడింది. 1984-85 మైనర్ల సమ్మెలో నేషనల్ యూనియన్ ఆఫ్ మైన్ వర్కర్స్‌కు వ్యతిరేకంగా రాజకీయ విజయాన్ని సాధించింది.

ఆమె 1987లో మరో ల్యాండ్‌స్లైడ్‌తో మూడవసారి తిరిగి ఎన్నికయింది. అయితే కమ్యూనిటీ ఛార్జ్‌(పోల్ టాక్స్)తో ఆమెకు మద్దతు తగ్గింది.

అంతేకాకుండా యూరోపియన్ కమ్యూనిటీపై ఆమె యూరోసెప్టిక్ అభిప్రాయాలు ఎవరికి నచ్చలేదు. ఫలితంగా 1990లో ఆమె ప్రధాన మంత్రి పదవికి, పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసింది.

ఆమె 2002లో స్ట్రోక్ కారణంగా ప్రజా జీవితం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పలుమార్లు ఆమెకు స్ట్రోక్ వచ్చింది. అయితే 2013లో ఆమె 87 ఏళ్ల వయసులో లండన్‌లోని రిట్జ్ హోటల్‌లో వచ్చిన స్ట్రోక్ తోనే మరణించింది.[1]

మూలాలు

బాహ్య లింకులు