మార్టిన్ లూథర్

మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి,[1] మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,[2][3][4][5], చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.[6]

మార్టిన్ లూథర్
Luther in 1529 by Lucas Cranach
జననం(1483-11-10)1483 నవంబరు 10
మరణం1546 ఫిబ్రవరి 18(1546-02-18) (వయసు 62)
వృత్తిTheologian, priest
జీవిత భాగస్వామికేథరినా వోన్ బోరా
పిల్లలుహాన్స్, ఎలిజిబెథ్, మగ్దలీనా, మార్టిన్, పాల్, మార్గరెథ్
తల్లిదండ్రులుహాన్స్, మార్గరెథ్ లూథర్ (నెయీ లిండెమన్)
సంతకం

లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు, పోపు ద్వారా కాదని ప్రకటించాడు.[7] క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు.[8] లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత 'పశ్చాత్తాపం', యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు. యేసును చేరే మార్గము చర్చిద్వారా మాత్రం కాదు అని చాటిచెప్పాడు.

ఇవీ చూడండి

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు