మార్మిక వాదం

మార్మిక వాదం లేదా రహస్యవాదం లేదా అనుభూతి వాదం అంటే దేవుడిలో లేదా లీనమవడం గురించి వివరించే సిద్ధాంతం. వివిధ రకాలైన ఆధ్యాత్మిక సాధనల ద్వారా తన గురించి తాను నిగూఢమైన రహస్యాలు తెలుసుకోవడం తద్వారా జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడం మార్మిక వాదం కిందకి వస్తుంది.

Liber Divinorum Operum, or the Universal Man of St. Hildegard of Bingen, 1185 (13th-century copy)

భారతదేశపు మతాలు

హిందూ మతం

హిందూ మతంలో అజ్ఞానం నుండి బయటపడటానికి అనేక సాధనా మార్గాలు ఉన్నాయి. అజ్ఞానం అంటే మనిషి కేవలం శరీరం, మనస్సు, నేను అనే అహంకారం మాత్రమే అనుకోవడం. వీటిని అధిగమించి మోక్షం చేరుకోవడం మానవుడి కర్తవ్యం. ఈ మోక్షాన్ని చేరుకోవడానికి, ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తులను సంపాదించడానికి హిందూమతంలో ఒకదానితో ఒకటి సంబంధమున్న చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాలు, తత్వరీతులు ఉన్నాయి. [1] ఆంగ్లేయులు భారతదేశానికి వలస రావడంతో ఈ సంప్రదాయాలను పాశ్చాత్య భావనలకు అనుగుణంగా మార్మిక వాదంగా వ్యవహరించడం జరుగుతోంది. [2]

యోగా అంటే శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనా నియమాలు. [3] హిందూ మతం, బౌద్ధమతం, జైనమతాలలో యోగాకు సంబంధించిన వివిధ సంప్రదాయాలు ఉన్నాయి.[4][5][6][5] పతంజలి యోగసూత్రాల ప్రకారం యోగా అంటే ఎల్లప్పుడూ చంచలంగా ఉండే మనస్సును స్థిరంగా ఉంచగలిగేది అని భావం. [7] ఇలాంటి భావమే సమాధి స్థితిలో ఉన్నప్పుడు కలుగుతుంది.

మూలాలు