మెట్రోపాలిటన్ ప్రాంతం

జనసాంద్రత కలిగిన పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు, గృహనిర్మాణ అవసరాలకు సంబంధించిన పరిపాలనా వి

మెట్రోపాలిటన్ ప్రాంతం, జనసాంద్రత కలిగిన పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు, గృహనిర్మాణ అవసరాలకు సంబంధించిన పరిపాలనా విభాగ ప్రాంతం. తక్కువ జనాభా కలిగిన పరిసర ప్రాంతాలను కలిపి మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏర్పాటుచేయబడుతుంది.[1]

రాత్రి వేళ న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంత సాటిలైట్ చిత్రం. .

మహానగర ప్రాంతం, పురపాలక సంఘాలు: పరిసర ప్రాంతాలు, టౌన్ షిప్, స్వయం పాలిత ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు, శివారు ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల, దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలు మారినప్పుడు, మెట్రోపాలిటన్ ప్రాంతాలు కీలకమైన ఆర్థిక, రాజకీయ ప్రాంతాలుగా మారాయి.[2] నగరాలు, పట్టణాలు, పట్టణ ఆర్థిక కేంద్రంగా సామాజిక, ఆర్ధికంగా ముడిపడి ఉన్న గ్రామీణ ప్రాంతాలు మొదలైనవి మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఉంటాయి.[3]

నిర్వచనం

వివిధ జోన్లతో కూడిన పట్టణ సముదాయాన్ని (కొత్తగా నిర్మించిన ప్రాంతం)ను మెట్రోపాలిటన్ ప్రాంతం అంటారు. మెట్రోపాలిటన్ ప్రాంతం ఉపాధి లేదా ఇతర వాణిజ్య అవసరాలకు కేంద్రంగా ఉంటుంది. ఇందులో సమీప మండలాలు, పట్టణ ప్రాంతాలు ఉంటాయి. ఇది స్థానికసంస్థల వరకు కూడా విస్తరించవచ్చు. అలాగే మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రధాన నగరానికి ఆనుకొని ఉన్న చిన్న పురపాలక సంఘాలను మునిసిపాలిటీ ఉపగ్రహ నగరాలు లేదా ఉపగ్రహ పట్టణాలు అని అంటారు.

మెట్రోపాలిటన్ ప్రాంతాల పరిమితులు, అధికారిక, అనధికారిక కార్యకలాపాలు స్థిరంగా ఉండవు. కొన్నిసార్లు పట్టణ ప్రాంతానికి భిన్నంగా కూడా ఉండవచ్చు. "మెట్రోపాలిటన్" అనే పదం పురపాలక సంఘాన్ని కూడా సూచిస్తుంది. ప్రధాన నగరం, దాని శివారు ప్రాంతాల మధ్య కొన్ని పరస్పర సేవలు ఉంటాయి. వీటిలో మెట్రోపాలిటన్ ప్రాంతం మొత్తం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఒక మెట్రో ప్రాంతానికి ఇచ్చిన జనాభా గణాంకాలు మిలియన్ల తేడాతో ఉండవచ్చు.

1950 నుండి మెట్రోపాలిటన్ ప్రాంతాల ప్రాథమిక నేపథ్యంలో గణనీయమైన మార్పు రాలేదు,[4] అయినప్పటికీ భౌగోళిక విస్తరణలో గణనీయమైన మార్పులు సంభవించాయి, మరికొన్ని ప్రతిపాదించబడ్డాయి.[5] "మెట్రోపాలిటన్ గణాంక ప్రాంతం", "మెట్రో సర్వీస్ ప్రాంతం", "మెట్రో ప్రాంతం" అనే పదం ఒక నగరాన్ని మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న సబర్బన్, ఎక్స్‌బర్బన్, కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాలు మొదలైనవన్నింటికి వర్తిస్తుంది.

భారతదేశం

భారతదేశం: 2 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాన్ని ఒక మెట్రోపాలిటన్ నగరంగా గుర్తించారు.[6]

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నిర్వచణ ప్రకారం మహానగర గణాంక ప్రాంతం ఏడు రాష్ట్ర రాజధానులు, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ పరిధిలో ఉన్నాయి.[7]

కెనడా

కెనడా లెక్కల ప్రకారం ఒక ప్రధాన పట్టణ కేంద్రంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పురపాలక సంఘాలతో కూడిన ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిర్వచించారు. మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి ఆ ప్రాంతంలో కనీసం 100,000 జనాభా ఉండాలి, పట్టణ కేంద్రంలో కనీసం సగం జనాభా ఉండాలి.[8]

టర్కీ

మెట్రోపాలిటన్ అనే పదం టర్కీలోని ఇస్తాంబుల్ వంటి ఒక ప్రధాన నగరాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థికంగా, సామాజికంగా ఇతరులపై ఆధిపత్యం వహించే నగరం.[9] పాలక ప్రయోజనాల కోసం టర్కీలో అధికారికంగా 30 "రాష్ట్రీయ మెట్రోపాలిటన్ ప్రాంతాలు" ఉన్నాయి.[10]

ఇవికూడా చూడండి

మూలాలు