యాంటీబయోటిక్

యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియాను అడ్డుకునే పదార్థం. ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే అంటురోగాలను అడ్డుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇటువంటి అంటురోగాలకు చికిత్స చేయడంలో యాంటీబయోటిక్ మందులను విస్తృతంగా ఉపయోగిస్తారు.[1][2] ఈ మందుకు బ్యాక్టీరియాను చంపివేస్తాయి లేదా వాటి ఎదుగుదలను అడ్డుకుంటాయి. కొన్ని యాంటీబయోటిక్స్ యాంటీ ప్రోటోజోవల్ గుణాలను కూడా కలిగి ఉంటాయి.[3][4] యాంటీ బయోటిక్స్ జలుబు, ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్ల మీద తమ ప్రభావం చూపలేవు.[5] వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేసే మందులను యాంటీ బయోటిక్ అని కాకుండా యాంటీవైరల్ మందులు అంటారు.

స్టఫైలోకోకస్ ఆరెయస్ - ఆంటీబయాటిక్ టెస్ట్ ప్లేట్

మూలాలు