రూలర్ (స్కేల్)

కొలబద్ద

రకరకాల రూలర్లు
ముడుచుకునే సౌకర్యమున్న టేప్ కొలత
దగ్గర నుంచి ఉక్కు రూలర్

రూలర్ (Ruler) అనేది ఒక కొలత సాధనం. రూలర్‌ను దూరాలను కొలవడానికి లేదా సరళ రేఖలను గీయడానికి ఉపయోగిస్తారు.[1] కొన్నిసార్లు ఎంత పొడవు వరకు అవసరమో అంతవరకు కొలుస్తారు. చాలా వరకు రూలర్లు అవి ఎంత పొడవున వుంటాయో అంత పొడవున సంఖ్యలను, పంక్తులను కలిగివుంటాయి. రూలర్‌పై ఉన్న సంఖ్యలు మిల్లీమీటర్లను, సెంటిమీటర్లను, అంగుళాలను, అడుగులను, మీటర్లను తెలియజేస్తాయి. సాధారణంగా విద్యార్థులు ఉపయోగించే చిన్న రూలర్ స్కేల్ 15 సెంటిమీటర్లు (6 అంగుళాలు లేదా అర అడుగు) లేదా 30 సెంటిమీటర్లు (12 అంగుళాలు లేదా ఒక అడుగు) ఉంటుంది. సాధారణంగా బట్టల దుకాణంలో బట్టను కొలుచుటకు ఉపయోగించే స్కేలు మీటరు పొడవు ఉంటుంది. స్కేల్‌పై పలు కొలతలను గుర్తించుటకు వీలుగా మిల్లీమీటర్లను సూచించుటకు సన్నని, చిన్న గీతలను ఉంచుతారు, 5 మిల్లీమీటర్లకు కొంచెం పెద్దగా ఉండే సన్న గీతను, సెంటీమీటర్లను సూచించుటకు ఇంకొంచెం పెద్దగా ఉండే గీతను, ఆ గీత వద్ద సంఖ్యను ఉంచుతారు, అలాగే అంగుళాని సూచించుటకు మరొక వైపున (సెంటిమీటర్ల సూచికకు ఎదురువైపు) గీతలను, సంఖ్యలను ఉంచుతారు. స్కేల్లను చెక్కతోను, ప్లాస్టిక్‌తోను, లోహలతోను, బట్టతోను తయారు చేస్తారు. స్కేల్లు అనేక రకములు ఉన్నవి. కొన్ని పొడవైన స్కేల్లను మడత పెట్టవచ్చు, లేదా చుట్టుకోవచ్చు.

మూలాలు