లీనా హార్న్

అమెరికన్ నర్తకి, నటి, గాయని, పౌర హక్కుల కార్యకర్త

లీనా మేరీ కాల్హౌన్ హార్న్ (1917, జూన్ 30 - 2010, మే 9) అమెరికన్ నర్తకి, నటి, గాయని, పౌర హక్కుల కార్యకర్త. సినిమా, టెలివిజన్, థియేటర్‌లో నటించిన హార్న్ డెబ్బై సంవత్సరాలపాటు తన కెరీర్ లో నిలిచింది. పదహారేళ్ళ వయసులో కాటన్ క్లబ్ కోరస్‌లో చేరింది. హాలీవుడ్‌కు వెళ్ళడానికి ముందు నైట్‌క్లబ్ ప్రదర్శనకారిణిగా మారింది.

మానవ హక్కుల కోసం వాదించిన హార్న్, 1963 ఆగస్టులో వాషింగ్టన్‌లో మార్చి‌లో పాల్గొన్నది. తర్వాత నైట్‌క్లబ్ నటిగా తిరిగి వచ్చి, మంచి ఆదరణ పొందిన రికార్డ్ ఆల్బమ్‌లను విడుదలచేసింది. టెలివిజన్‌ కార్యక్రమాలలో నటించింది. 1980, మార్చిలో తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించింది. బ్రాడ్‌వే నాటకరంగంలో 300 కంటే ఎక్కువ నాటకాలలో నటించింది.

జననం

లీనా హార్న్ 1917, జూన్ 30న బ్రూక్లిన్‌లోని బెడ్‌ఫోర్డ్-స్టూయ్వేసంట్‌లో జన్మించింది.[1]

సినిమాలు

  1. ది డ్యూక్ ఈజ్ టాప్స్ (1938)
  2. క్యాబిన్ ఇన్ ది స్కై (1943)
  3. థౌజండ్స్ చీర్ (1943)
  4. ఐ డూడ్ ఇట్ (1943)
  5. స్వింగ్ ఫీవర్ (1943)
  6. బూగీ-వూగీ డ్రీమ్ (1944)
  7. బ్రాడ్‌వే రిథమ్ (1944)
  8. స్టూడియో విజిట్ (1946)
  9. టిల్ ది క్లౌడ్స్ రోల్ బై (1946)
  10. జిగ్‌ఫెల్డ్ ఫోలీస్ (1946)
  11. డచెస్ ఆఫ్ ఇడాహో (1950)
  12. మీట్ మి ఇన్ లాస్ వెగాస్ (1956)
  13. ది హార్ట్ ఆఫ్ షో బిజినెస్ (1957)
  14. ది విజ్ (1978)
  15. స్ట్రేంజ్ ఫ్రేమ్ (ఆర్కైవ్ ఫుటేజ్, 2012)

టెలివిజన్

  1. ఎడ్ సుల్లివన్ షో ( 1957 జనవరి 6)
  2. ది జూడీ గార్లాండ్ షో ( 1963 అక్టోబరు 13)
  3. పెర్రీ కోమో షో ( 1965 మార్చి 5)
  4. సెసేమ్ స్ట్రీట్ (ఎపిసోడ్ #5.1, 1973 నవంబరు 19)
  5. శాన్‌ఫోర్డ్ & సన్ ("ఎ విజిట్ ఫ్రమ్ లీనా హార్న్", #2. 1973 జనవరి 12)
  6. ది ముప్పెట్ షో (1976)
  7. సెసేమ్ స్ట్రీట్ (ఎపిసోడ్ #7.76, 1976 మార్చి 15)
  8. ది కాస్బీ షో ("క్లిఫ్స్ బర్త్ డే" 1985 మే 9)
  9. ఎ డిఫరెంట్ వరల్డ్ ("ఎ రాక్, ఎ రివర్, ఎ లీనా" 1993 జూలై)

మరణం

హార్న్ 2010, మే 9న గుండెపోటుతో మరణించింది.[2] తను సభ్యురాలుగా ఉన్న న్యూయార్క్‌లోని పార్క్ అవెన్యూలోని సెయింట్ ఇగ్నేషియస్ లయోలా చర్చిలో అంత్యక్రియలు జరిగాయి.[3]

అవార్డులు

గ్రామీ అవార్డులు

లీనా హార్న్ గ్రామీ అవార్డు చరిత్ర [4][5]
1961లీనా హార్న్ ఎట్ ది సాండ్స్బెస్ట్ వోకల్ పెర్ఫార్మెన్స్ ఆల్బమ్, ఫిమేల్ప్రతిపాదించబడింది
1962పోర్గీ అండ్ బెస్ఉత్తమ సోలో వోకల్ పెర్ఫార్మెన్స్, ఫిమేల్ప్రతిపాదించబడింది
1981లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్ఉత్తమ పాప్ గాత్ర ప్రదర్శన, స్త్రీగెలుపు
లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్ఉత్తమ తారాగణం ప్రదర్శన ఆల్బమ్గెలుపు
1988ది మెన్ ఇన్ మై లైఫ్ఉత్తమ జాజ్ గాత్ర ప్రదర్శనప్రతిపాదించబడింది
"ఐ వోంట్ లీవ్ యు ఎగైన్"ఉత్తమ జాజ్ స్వర ప్రదర్శన, ద్వయం లేదా సమూహంప్రతిపాదించబడింది
1989లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుగెలుపు
1995ఎన్ ఈవినింగ్ విత్ లీనా హార్న్‌ఉత్తమ జాజ్ గాత్ర ప్రదర్శనగెలుపు

ఇతర అవార్డులు

సంవత్సరంసంస్థవిభాగంఫలితంఇతర వివరాలు
1957టోనీ అవార్డులుఉత్తమ నటినామినీజమైకా
1980హోవార్డ్ విశ్వవిద్యాలయంగౌరవ డాక్టరేట్ [6]సన్మానం
1980డ్రామా డెస్క్ అవార్డులుఅత్యుత్తమ నటి - సంగీతవిజేతలీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్
1980న్యూయార్క్ డ్రామా క్రిటిక్స్ సర్కిల్ అవార్డులుప్రత్యేక సైటేషన్విజేతలీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్
1981టోనీ అవార్డులుప్రత్యేక సైటేషన్విజేతలీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్
1984జాన్ ఎఫ్. కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కెన్నెడీ సెంటర్ ఆనర్స్[7]విజేతఅసాధారణ ప్రతిభ, సృజనాత్మకత, పట్టుదల కోసం
1985ఎమ్మీ అవార్డులీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్నామినీ
1987అమెరికన్ సొసైటీ ఆఫ్ కంపోజర్స్, రచయితలు, ప్రచురణకర్తలుపైడ్ పైపర్ అవార్డు[8]విజేతపదాలు, సంగీతానికి గణనీయమైన కృషి చేసిన వినోదకారులకు అందించబడింది
1994సామీ కాహ్న్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుపాటల రచయితల హాల్ ఆఫ్ ఫేమ్విజేత
1997గాయకుల సంఘంసొసైటీ ఆఫ్ సింగర్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు[9]విజేత"సమాజానికి , ప్రపంచవ్యాప్త కారణాలకు ప్రయోజనం చేకూర్చడానికి వారి అంకిత ప్రయత్నాలతో పాటు సంగీత ప్రపంచానికి చేసిన కృషికి గాను గాయకులు అవార్డు పొందారు"
1999ఇమేజ్ అవార్డుఅత్యుత్తమ జాజ్ కళాకారుడువిజేత
2006మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్ జాతీయ చారిత్రక ప్రదేశంఅంతర్జాతీయ పౌర హక్కుల వాక్ ఆఫ్ ఫేమ్ [10]చేర్చబడింది
?హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్విజేతగౌరవం (చలన చిత్రాలు)
?హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్విజేతగౌరవం (రికార్డింగ్‌లు)

మూలాలు

బయటి లింకులు