లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కంట్రోల్ నంబర్

లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కంట్రోల్ నంబర్ (LCCN) అనేది అమెరికా లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో జాబితా చేయబడిన రికార్డులకు సంఖ్యలు ఇచ్చే సీరియల్ ఆధారిత వ్యవస్థ. ఇది పుస్తకాల్లోని విషయాలకు సంబంధించినది కాదు. దీనికీ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లాసిఫికేషన్ (LCC)కూ సంబంధం లేదు.

చరిత్ర

LCCN వ్యవస్థ 1898 నుండి వాడుకలో ఉంది. ఆ సమయంలో LCCN అనే సంక్షిప్త నామం లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కార్డ్ నంబర్‌గా ఉండేది. [1] [2] దీనిని ఇతర పేర్లతో పాటు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కేటలాగ్ కార్డ్ నంబర్ అని కూడా పిలుస్తారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, తమ లైబ్రరీ కేటలాగ్ కోసం బిబ్లియోగ్రాఫిక్ సమాచార కార్డ్‌లను తయారు చేసింది. ఇతర లైబ్రరీలు వారి కేటలాగ్‌లలో ఉపయోగించడానికి ఈ కార్డ్‌ల నకిలీ సెట్‌లను విక్రయిస్తుంది. దీనిని సెంట్రలైజ్డ్ కేటలాగింగ్ అంటారు. ప్రతి కార్డు సెట్‌నూ గుర్తించడంలో సహాయపడటానికి ఒక క్రమ సంఖ్య ఇచ్చారు.

ప్రస్తుతం గ్రంథ పట్టిక సమాచారాన్ని సృష్టించడం, నిల్వ చేయడం, ఇతర లైబ్రరీలతో భాగస్వామ్యం చేయడం ఎలక్ట్రానిక్‌గా చేస్తున్నప్పటికీ, ప్రతీ ఒక్క రికార్డునూ గుర్తించాల్సిన అవసరం ఇంకా ఉంది. LCCN ఆ పనిని కొనసాగిస్తూనే ఉంది.

ఆకృతి

LCCN సంఖ్య ప్రాథమిక రూపంలో, సంవత్సరం, ఒక సంఖ్య ఉంటాయి. 1898 నుండి 2000 వరకు ఉన్న సంవత్సరాలకు రెండు అంకెలు, 2001లో నుండి వచ్చే సంవత్సరాలకు నాలుగు అంకెలు ఉంటాయి. సందిగ్ధ సంవత్సరాలు (1898, 1899, 1900) మూడింటికి క్రమ సంఖ్య పొడవు ద్వారా వేరు చేయబడ్డాయి. 1969, 1972 మధ్య "7"తో ప్రారంభమయ్యే కొన్ని సంఖ్యలలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. [3]

క్రమ సంఖ్యలు ఆరు అంకెలు పొడవు ఉంటాయి. ముందు సున్నాలు కూడా ఉండాలి. [4] సంఖ్యను ప్యాడింగ్ చేసేలా ముందు సున్నాలు చేర్చడం ఇటీవలనే చేసారు. కాబట్టి చాలా పాత సంఖ్యలకు తక్కువ నిడివి ఉంటుంది. సంవత్సరాన్ని, క్రమ సంఖ్యనూ వేరు చేస్తూ కనిపించే హైఫన్ ఐచ్ఛికం. హైఫన్‌ను చేర్చవద్దని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఇటీవల, ప్రచురణకర్తలను ఆదేశించింది.

ఇవి కూడా చూడండి

మూలాలు