వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్

అంతర్జాతీయ అధికారం ఫైల్

వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్ (VIAF) అనేది అనేక జాతీయ లైబ్రరీల ఉమ్మడి అథారిటీ ఫైల్ ప్రాజెక్టు. దీన్ని ఆన్‌లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్ (OCLC) నిర్వహిస్తుంది.

వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్
VIAF Screenshot 2012
2012 తెరపట్టు
పొడి పేరుVIAF
ప్రవేశపెట్టిన తేదీ2003 ఆగస్టు 6 (2003-08-06)
నిర్వహించే సంస్థOCLC
ఉదాహరణ106965171

చరిత్ర

1990ల చివరలో ఉమ్మడి అంతర్జాతీయ అథారిటీ ఉండాలనే చర్చ మొదలైంది. ఒక ప్రత్యేక ఉమ్మడి అథారిటీ ఫైల్‌ను సృష్టించేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత, ఇప్పటికే ఉన్న జాతీయ అథారిటీలను లింకు చేయాలనే కొత్త ఆలోచన వచ్చింది. దీనివలన ఎక్కువ సమయం, ఖర్చూ లేకుండానే ఉమ్మడి ఫైల్ వలన కలిగే అన్ని ప్రయోజనాలనూ కలుగుతుంది. [1]

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ 2003 లో నిర్వహించిన వరల్డ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్‌లో VIAF భావనను ప్రవేశపెట్టారు. US లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (LC), జర్మన్ నేషనల్ లైబ్రరీ (DNB), OCLC లు 2003 ఆగస్టు 6 న ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. [2] బిబ్లియోథెక్ నేషనల్ డి ఫ్రాన్స్ (BnF) 2007 అక్టోబరు 5 న ప్రాజెక్టులో చేరింది.


2012 ఏప్రిల్ 4 న ఈ ప్రాజెక్టు OCLC యొక్క సేవగా మారింది. [3]

జాతీయ అధికార ఫైల్‌లను (జర్మన్ నేమ్ అథారిటీ ఫైల్ వంటివి) ఒకే వర్చువల్ అథారిటీ ఫైల్‌కి లింక్ చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఫైల్‌లో, విభిన్న డేటా సెట్‌లలో ఉండే ఒకేలాంటి రికార్డులను ఒకదానితో ఒకటి లింకు చేసారు. VIAF రికార్డు ప్రామాణిక డేటా సంఖ్యను పొందుతుంది. ఒరిజినల్ రికార్డులలో ఉండే ప్రాథమిక "చూడండి", "ఇవి కూడా చూడండి" రికార్డులు ఇందులో ఉంటాయి. ఒరిజినల్ అథారిటీ రికార్డులను ఇది సూచిస్తుంది. పరిశోధనలకు, డేటా మార్పిడి, భాగస్వామ్యాల కోసం ఈ డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. పరస్పర నవీకరణ మెటాడేటా హార్వెస్టింగ్ (OAI-PMH) ప్రోటోకాల్ కోసం ఓపెన్ ఆర్కైవ్స్ ఇనిషియేటివ్ ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది.

ఫైల్ నంబర్లను వికీపీడియా జీవిత చరిత్ర వ్యాసాల్లో చేరుస్తున్నారు. వికీడేటాలో కూడా వీటిని చేరుస్తున్నారు. [4]

VIAF క్లస్టర్‌లు

VIAF క్లస్టరింగ్ అల్గోరిథంను ప్రతి నెలా నడుపుతారు. పాల్గొనే లైబ్రరీల నుండి మరింత డేటా జోడించబడినందున, అధికార రికార్డుల సమూహాలు కలిసిపోవచ్చు లేదా విడిపోవచ్చు. దీని వలన కొన్ని అధికార రికార్డుల VIAF ఐడెంటిఫైయర్‌లో కొంత హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.

పాల్గొనే లైబ్రరీలు, సంస్థలు

ఇంగ్లీషు వికీపీడియా వ్యాసం పేరుఐడెంటిఫయరుప్రదేశందేశం
బిబ్లియోథెకా ఆలెక్జాండ్రినాEGAXAఅలెగ్జాండ్రియాఈజిప్టు
బిబ్లియోటెకా నేషనల్ డి చిలీBNCHLశాంటియాగోచిలీ
బిబ్లియోటెకా నేషనల్ డి ఎస్పానాBNEమాడ్రిడ్స్పెయిన్
బిబ్లియోటెకా నేషనల్ డి పోర్చుగల్PTBNPలిస్బన్పోర్చుగల్
బిబ్లియోథెక్ ఎట్ ఆర్కైవ్స్ నేషనాలెస్ డు క్విబెక్B2Qక్విబెక్కెనడా
బిబ్లియోథెక్ నేషనాల్ డి ఫ్రాన్స్BnFపారిస్ఫ్రాన్స్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ గ్రీస్ΕΒΕఏథెన్స్గ్రీస్
బిబ్లియోథెక్ నేషనాల్ డు రోయాం డు మారోక్ (BNRM)MRBNRరబత్మొరాకో
బయోగ్రాఫిష్ పోర్టాల్BPNది హేగ్నెదర్లాండ్స్
బ్రిటిష్ లైబ్రరీలండన్ఇంగ్లాండు
డేనిష్ ఏజన్సీ ఫర్ కల్చర్ అండ్ పాలసెస్కోపెన్‌హాగన్డెన్మార్క్
Danish Bibliographic CentreDBCబాలరప్డెన్మార్క్
జర్మన్ నేషనల్ లైబ్రరీ (DNB)GNDఫ్రాంక్‌ఫర్ట్జర్మనీ
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేం ఐడెంటిఫయర్ISNIలండన్యునైటెడ్ కింగ్‌డమ్
ఇజ్రాయిల్ మ్యూజియమ్జెరూసలెంఇజ్రాయిల్
Istituto Centrale per il Catalogo UnicoICCU

SBN
రోమ్ఇటలీ
లెబనీస్ నేషనల్ లైబ్రరీLNLబీరూట్లెబనాన్
లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్ కెనడాLACఅట్టావాకెనడా
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్LCCNవాషింగ్టన్యునైటెడ్ స్టేట్స్
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఇన్ జాగ్రెబ్NSKజాగ్రెబ్క్రొయేషియా
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఆఫ్ స్లోవేనియాల్యుబ్లియానాస్లోవేనియా
నేషనల్ సెంట్రల్ లైబ్రరీNCL CYTతైపీతైవాన్
నేషనల్ డయట్ లైబ్రరీNDLటోక్యో క్యోటోజపాన్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్NII

CiNii
టోక్యోజపాన్
నేషనల్ లైబ్రరీ బోర్డ్NLBసింగపూర్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఆస్ట్రేలియాNLAకాన్‌బెర్రాఆస్ట్రేలియా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ బ్రెజిల్BLBNBరియో డి జానీరోబ్రెజిల్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ కటలోనియాBNCబార్సెలోనాస్పెయిన్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఎస్టోనియాERRRతల్లిన్ఎస్టోనియా
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఆఫ్ ఐస్‌లాండ్ (NULI)UIYరేజవిక్ఐస్‌లాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఐర్లండ్N6Iడబ్లిన్ఐర్‌లాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయిల్NLIజెరూసలేమ్ఇజ్రాయిల్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ కొరియాKRNLKసియోల్కొరియా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ లాట్వియాLNBరీగాలాట్వియా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ లక్సెంబర్గ్BNLలక్సెంబర్గ్లక్సెంబర్గ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెక్సికోBNMమెక్సికో నగరంమెక్సికో
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ది నెదర్లాండ్స్NTAది హేగ్నెదర్లాండ్స్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ న్యూజీలాండ్వెల్లింగ్టన్న్యూజీలాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ నార్వేBIBSYS
W2Z
ట్రాండ్‌హీమ్నార్వే
నేషనల్ లైబ్రరీ ఆఫ్ పోలండ్NLPవార్సాపోలండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ రష్యాNLRసెయింట్ పీటర్స్‌బర్గ్రష్యా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లండ్ఎడింబరోస్కాట్లాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకేప్‌టౌన్
ప్రిటోరియా
దక్షిణాఫ్రికా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్SELIBRస్టాక్‌హోమ్స్వీడన్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ వేల్స్అబెరిస్విత్వేల్స్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ది చెక్ రిపబ్లిక్NKCప్రాగ్చెక్ రిపబ్లిక్
నేషనల్ షెచెనిల్ లైబ్రరీNSZLబుడాపెస్ట్హంగరీ
పెర్సియస్ ప్రాజెక్ట్PERSEUSమెడ్‌ఫోర్డ్యునైటెడ్ స్టేట్స్
RERO (లైబ్రరీ నెట్‌వర్క్ ఆఫ్ వెస్టర్న్ స్విట్జర్లండ్)REROమార్టినీస్విట్జర్లండ్
రిపర్టోయిర్ ఇంటర్నేషనల్ డెస్ సోర్సెస్ మ్యూసికేల్స్క్వ్RISMఫ్రాంక్‌ఫర్ట్జర్మనీ
సిస్టెమె యూనివర్సిటెయిర్ డి డాక్యుమెంటేషన్SUDOCఫ్రాన్స్
సిరియాక్ రిఫరెన్స్ పోర్టల్SRPనాష్‌విల్యునైటెడ్ స్టేట్స్
స్విస్ నేషనల్ లైబ్రరీSWNLబెర్న్స్విట్జర్లండ్
Narodowy Uniwersalny Katalog Centralny, NUKAT (pl)NUKATపోలండ్
Union List of Artist Names – Getty Research InstituteULAN

JPG
లాస్ ఏంజలెస్యునైటెడ్ స్టేట్స్
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అగ్రికల్చరల్ లైబ్రరీNALTబెల్ట్స్‌విల్యునైటెడ్ స్టేట్స్
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్బెథెస్దాయునైటెడ్ స్టేట్స్
వాటికన్ లైబ్రరీBAVవాటికన్ నగరం
కల్చర్‌కనెక్ట్బ్రసెల్స్బెల్జియమ్
వికిడేటాWKPబెర్లిన్అంతర్జాతీయం

ఇవి కూడా చూడండి

ప్రస్తావనలు