శిలీంధ్రం

శిలీంధ్రాలు (ఆంగ్లం: Fungus) ఒక రకమైన సూక్ష్మక్రిములు. ఇవి మట్టిలో విరివిరిగా ఉంటాయి. వీటిలో 70,000 రకాలు గుర్తించబడ్డాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మొక్కలలో, జంతువులలో, మానవులలో వివిధ రకాలైన వ్యాధులు కలుగజేస్తాయి. కొన్ని ప్రాణాంతకముగా మారే అవకాశం ఉంది. శిలీంధ్రాల గురించి తెలియజేసే విజ్ఞానాన్ని మైకాలజీ అంటారు.

శిలీంధ్రాలు
కాల విస్తరణ: Early సిలూరియన్ - Recent
Clockwise from top left: Amanita muscaria, a basidiomycete; Sarcoscypha coccinea, an ascomycete; black bread mold, a zygomycete; a chytrid; a Penicillium conidiophore.
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Eukarya

Whittaker & Margulis, 1978
(unranked):
Opisthokonta
Kingdom:
శిలీంధ్రాలు

(లిన్నేయస్, 1753) R.T. Moore, 1980[1]
Subkingdom/Phyla
Chytridiomycota
Blastocladiomycota
Neocallimastigomycota
Glomeromycota
జైగోమైకోటా

Dikarya (inc. Deuteromycota)

ఏస్కోమైకోటా
బెసిడియోమైకోటా

ఉనికి

శిలీంధ్రాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి గాలిలో, నీటిలో, నేలపై, నేలలోను, సజీవ, నిర్జీవ దేహలలో ఉంటాయి. అత్యధిక జాతులు కుళ్ళుచున్న సేంద్రీయ పదార్థాలపై పూతికాహారులు గా (Saprophytes) జీవిస్తున్నాయి. నీటిలో నివసించే శిలీంధ్రాలు ఆదిమమైనవి. వీటికన్నా పరిణతి చెందినవి మృత్తికావాసం చేసేవి. వీటికన్నా పరిణతి చెందినవి పరాన్నజీవులు.

కొన్ని జంతువుల, వృక్షాల దేహాలలో పరాన్నజీవులు (Parasites) వివిధ వ్యాధులను కలుగజేస్తున్నాయి.

కొన్ని శిలీంధ్ర ప్రజాతులు వృక్షాల వేరు వ్యవస్థలలో శిలీంధ్ర మూలాలు (Mycorrhiza) గా ఏర్పడి సహజీవనం చేస్తూ, నీరు, లవణ పోషణకు ఉపకరిస్తాయి. చాలా వృక్ష జాతులు (90% పైగా) వాని మనుగడకు ఈ విధంగా శిలీంధ్రాలపై ఆధారపడి ఉంటాయి.[2][3][4] ఈ విధమైన సహజీవనం మానవులకు చాలా ప్రాచీన కాలం అనగా ఇంచుమించు 400 మిలియను సంవత్సరాల నుండి తెలుసును.[5] ఇవి మొక్కలు భూమి నుండి పీల్చుకునే నత్రజని, ఫాస్ఫేటు మొతాదులను పెంచుతాయి.[6] కొన్ని శిలీంధ్రాలు ఒక మొక్క నుంచి మరొక మొక్కకు పిండి పదార్థాలు మొదలైన ఆహార పదార్థాలను తరలిస్తాయి.[7]

Polypores growing on a tree in Borneo

ఉపయోగాలు

  • ఆహారపదార్ధాలలో పాల నుండి పెరుగును తయారుచేసేవి శిలీంధ్రాలు.
  • బేకరీలలో గోధుమ రొట్టెను మెత్తగా చిన్నచిన్న రంధ్రాలతో తయారుచేసేవి కూడా ఇవే.
  • మద్యం తయారీలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు.
  • పెన్సిలిన్ వంటి చాలా రకాల సూక్ష్మజీవి నాశకాలు (Antibiotics) ను శిలీంద్రాల నుండి తయారుచేస్తారు. ఇవి ప్రమాదకరమైన బాక్టీరియా వ్యాధుల నుండి మనను కాపాడుతున్నాయి.
  • పుట్టగొడుగులు ఆహారంగా మనకందరకు చాలా ఇష్టం. వీటిలో కొన్ని విషపూరితమైనవి గలవని మరిచిపోవద్దు.

వ్యాధులు

మనుషులలో

కొన్ని శిలీంధ్రాలు మానవులలో ముఖ్యంగా రోగ నిరోధకశక్తి లోపించిన వారిలో ప్రాణాంతకమైన వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఏస్పర్జిలస్, కాండిడా, క్రిప్టోకాకస్, [8][9] హిస్టోప్లాస్మా, [10] and న్యూమోసిస్టిస్ మొదలైనవి.[11] కొన్ని వ్యాధికారక శిలీంధ్రాలు తామర వంటి చర్మ వ్యాధుల్ని కలుగజేస్తాయి.

వృక్షాలలో

  • అగ్గి తెగులు - వరి
  • ఆకుపచ్చకంకి తెగులు - సజ్జ
  • కొరడా కాటుక తెగులు - చెరకు
  • టిక్కా ఆకుమచ్చ తెగులు - వేరుశెనగ

మూలాలు

బయటి లింకులు